Tuesday, October 23, 2012

అంతరిక్షంలో వంద రోజుల పండుగ....

 భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ సోమవారం అంతరిక్షంలో వంద రోజులు పూర్తి చేసుకున్నారు. ఆమె ఈ ఏడాది జూలైలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్)కి చేరుకోవడం తెలిసిందే. ‘అంతరిక్షంలో తేలియాడడం అమూల్యమైన అనుభూతి. మేం దాన్ని ప్రతిక్షణాన్ని ఆనందిస్తున్నాం’ అని సునీత సోమవారం ఐఎస్‌ఎస్‌లోని డెస్టినీ యూఎస్ లేబొరేటరీ మ్యాడ్యూల్ నుంచి ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే ఇంటిలాంటి ప్రదేశం అంతరిక్షంలోనే కాదు మరెక్కడా లేదన్నారు. ఐఎస్‌ఎస్‌లో దిండు, పరుపు లేకుండా నిద్రలోకి జారుకోవడానికి కాస్త సమయం పడుతోందని అన్నారు. ఐఎస్‌ఎస్‌లో తమ పరికరాలు అక్కడొకటీ ఇక్కడొకటీ పడి ఉన్నాయని, కొత్త వ్యోమగాములు వచ్చే లోపు వాటిని శుభ్రం చేయాల్సిన అవసరముందని చెప్పారు. 

No comments: