Saturday, January 3, 2009

వృధా చేయకు ప్రియతమ్

అప్పుడెప్పుడో వసంతకాలంలో .....
నా మదిలో మొగ్గలు విచ్చుకున్నప్పుడు .....
నా కళల కౌగిల్లో నువ్వు కరిగిపోతూ ......
నన్ను మురిపించి మైమరిపించావు!
నీ తలపు నా హృదయాన్ని తట్టినప్పుడు .....
నీ పిలుపు కోసం పడిగాపులు కాసాను.
నీ వలపు జడివానలో తడిసిపోవాలని .....
దారెంబడి
నిలువెల్ల కళ్లు చేసుకొని వెతుకుతుంటే మలపులో మాయమవుతుంది

పాల్గుణ మాసపు మధ్యాహ్నపు గాలి ....
ఫక్కున నవ్వింది..... నిప్పులు రువ్వింది .....!
అయినా.... నువ్వు లేవు .... !
కాలం నిర్ధాక్షిణ్యంగా కరిగిపోతుంది
దశాబ్దాన్ని స్వాహా చేసుకొంటూ
అదిగో....
మల్లీ వసంతం వస్తున్న సవ్వడి ....
ఎన్ని హేమంతాలు రాలిపోయాయో ....
నువ్వు లేకుండా
ప్రియతమ్ ! ఈ వసంతాన్ని వృధా చెయ్యకు....
అలసిన మనసును నీ దరిలో సేదతీర్చుకోనీ ....