Friday, October 19, 2012

పండుగ వంటలు




పెరుగు అన్నం


కావలసినవి:

బియ్యం - కప్పు, పెరుగు - 3 కప్పులు

ఉప్పు - తగినంత, అల్లం - చిన్నముక్క (తరగాలి)

కొత్తిమీర తరుగు - టీ స్పూన్

దానిమ్మ గింజలు - తగినన్ని



పోపుకోసం...

కరివేపాకు - 2 రెమ్మలు, మినప్పప్పు - టీ స్పూన్

ఆవాలు - అర టీ స్పూన్

ఎండుమిర్చి - 2 (మధ్యకు విరవాలి)

పచ్చిమిర్చి - 2 (నిలువుగా కట్ చేయాలి)

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ - తగినంత



తయారి:

అన్నం మెత్తగా వండి, గరిటెతో బాగా కలిపి, చల్లారనివ్వాలి.

పెరుగులో ఉప్పు వేసి, చల్లారిన అన్నంలో కలపాలి.

దీంట్లో అల్లం, పచ్చిమిర్చి కలపాలి.
స్టౌ పై కడాయి పెట్టి, నెయ్యి వేసి ఆవాలు, మిన ప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేగనివ్వాలి.
ఈ పోపును పెరుగన్నంలో కలపాలి. అరకప్పు పాలు వేడి చేసి పెరుగన్నంలో కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి.
కొత్తిమీర, దాన్నిమ్మ గింజలతో అలంకరించాలి.



సజ్జముద్దలు

కావలసినవి:

సజ్జ పిండి - 2 కప్పులు

బెల్లం తరుగు - కప్పు

నీళ్లు - ముద్ద చేయడానికి

తగినన్ని

ఏలకుల పొడి - చిటికెడు

డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్‌మిస్) - 2 టీ స్పూన్లు

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

తయారి:

నీళ్లు వేడి చేసి, సజ్జ పిండిలో కలిపి ముద్ద చేయాలి. కావల్సిన పరిమాణంలో ముద్ద తీసుకొని, రొట్టె చేసి, పెనం మీద రెండువైపులా కాల్చాలి.

వేడిగా ఉన్నప్పుడే నీళ్లు అద్దుకుంటూ చేత్తో ముక్కలు ముక్కలు చేయాలి. తర్వాత రోట్లో వేసి దంచాలి.

పెనం మీద నెయ్యి, బెల్లం, ఏలకుల పొడి, రొట్టె ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి, దించాలి.
కావలసిన పరిమాణం రొట్టెముక్కల పొడిని తీసుకొని, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి.



ఎండు కొబ్బరి అన్నం



కావల్సినవి:

బియ్యం - 2 కప్పులు (అన్నం వండి, బేసిన్‌లో వేసి, విడదీసి, చల్లారనివ్వాలి), పసుపు - చిటికెడు, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, ఎండుకొబ్బరి పొడి - అర కప్పు, కారం - అర టీ స్పూన్, శనగపప్పు - టేబుల్ స్పూన్, మినప్పప్పు - టేబుల్ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, ఎండుమిర్చి - 4, పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేయాలి), వేయించిన పల్లీలు - కొన్ని, నూనె - 3 టేబుల్ స్పూన్లు



తయారి:

చల్లారిన అన్నంలో ఉప్పు, టేబుల్ స్పూన్ నూనె, కొబ్బరిపొడి, కారం, కొన్ని కరివేపాకు ఆకులు వేసి కలపాలి.

పెనం మీద మిగిలిన నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి నిమిషం సేపు వేయించాలి. తర్వాత పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరికాసేపు వేయించాలి.

ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి.



పులిహోర


కావలసినవి:

బియ్యం - 2 కప్పులు, పసుపు - 1/2 స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, చింతపండు గుజ్జు - పావు కప్పు, బెల్లం తరుగు - టీ స్పూన్, శనగపప్పు, మినప్పప్పు - టేబుల్ స్పూన్ చొప్పున, ఆవాలు-టీ స్పూన్, ఎండుమిర్చి-4, పచ్చిమిర్చి - 4 ఇంగువ - పావు టీ స్పూన్, నువ్వులపొడి - టేబుల్ స్పూన్, పల్లీలు - కొన్ని, నూనె - 3 టేబుల్ స్పూన్లు, అల్లం - చిన్న ముక్క

తయారి:

అన్నం వండి చల్లార్చి, అందులో పసుపు, ఉప్పు, టేబుల్ స్పూన్ నూనె, కొన్ని కరివేపాకు ఆకులు వేసి కలపాలి.

కడాయిలో మిగిలిన నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, పప్పులు, పల్లీలు వేసి నిమిషం సేపు వేయించాలి. కోసిన పచ్చిమిర్చి, దంచిన అల్లం, ఇంగువ, కరివేపాకు వేయించాక చింతపండు గుజ్జు, బెల్లం వేసి ఉడికించి, తీయాలి. ఈ మిశ్రమాన్ని, నువ్వులపొడి అన్నంలో వేసి కలపాలి.



చపాతీ ముద్దలు

కావలసినవి:

గోధుమపిండి - 2 కప్పులు

బెల్లం తరుగు - కప్పు

నీళ్లు - ముద్ద చేయడానికి తగినన్ని

ఏలకుల పొడి - చిటికెడు

డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్‌మిస్) - 2 టీ స్పూన్లు

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు


తయారి:

పిండిలో నీళ్లు పోసి, ముద్ద చేయాలి. కావల్సిన పరిమాణంలో ముద్ద తీసుకొని, చపాతీ చేసి, పెనం మీద రెండువైపులా కాల్చాలి.



చపాతీని ముక్కలు చేసి, రోట్లో వేసి దంచాలి.



పెనం మీద నెయ్యి, బెల్లం, ఏలకుల పొడి, చపాతీ ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి, దించాలి.



కావలసిన పరిమాణంలో ఈ పొడిని తీసుకొని, బాదం, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి.

No comments: