Saturday, October 6, 2012

తెలంగాణ లో ఈ రోజు

దసరాలోపే..!
దసరా పండుగ లోపే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కచ్చితమైన ప్రకటన వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులంతా ఇప్పటికే సానుకూల నిర్ణయానికి వచ్చారని ఆయన శనివారం తనను కలిసిన తెలంగాణ ఎన్‌జీవో, ఇతర జేఏసీ నేతలతో చెప్పారు.
*రెండు మూడ్రోజుల్లో అఖిలపక్షం.. టీఎన్‌జీఓ నేతలతో కేసీఆర్

*ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఢిల్లీ యాత్రకు సిద్ధంగా ఉండాలి

*కేంద్రంలోని కీలక వ్యక్తులు సానుకూల నిర్ణయానికి వచ్చారు

*సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటుపై చర్చ జరుగుతోంది

*ఆ ప్రాంత నేతలతో చర్చించే బాధ్యతను ఆజాద్‌కు అప్పగించారు

ఎనిమిదేళ్లుగా వింటున్నా

నెలాఖరులోగా తెలంగాణ వస్తుందనే మాటల్ని ఎనిమిదేళ్లుగా వింటున్నానని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరులోగా ప్రత్యేక రాష్ట్రం వస్తుందంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన్నే అడగాలని పేర్కొన్నారు.

       తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ ఆవిర్భావం
రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాజకీయ యవనికపైకి మరో కొత్త పార్టీ రానుంది. కేంద్రమంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత అజిత్‌సింగ్ నాయకత్వంలో ‘తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్’ ఆవిర్భవించనుంది. అజిత్‌సింగ్, ఆయన తనయుడు జయంత్‌సింగ్‌లు తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ను ప్రారంభించడంకోసం ఆదివారం హైదరాబాద్ రానున్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఉంటూనే తెలంగాణపై స్పష్టంగా మాట్లాడుతున్న అజిత్‌సింగ్ నేతృత్వంలోనే ఈ పార్టీ ఏర్పాటుకానుంది. కేంద్రంపై ప్రజల నుంచి ఒత్తిడి తేవడానికిగాను తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్తున్నారు. కాగా కేసీఆర్‌కు దూరంగా ఉంటూ ఉద్యమిస్తున్న వివిధ సంఘాలు, పార్టీల నాయకులు అజిత్‌సింగ్‌తో జతకడుతున్నారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌కు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారని, ఇప్పటిదాకా వివిధ సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తున్న నాయకులకు దీనిలో ప్రాతినిధ్యం ఉంటుందని సమాచారం.

1 comment:

Praveen Mandangi said...

తెలంగాణా రాష్ట్రం సాధించాలి. కానీ పాచిపళ్ళ దాసరి పాటలు పాడితే మాత్రం తెలంగాణా రాదు.