Friday, October 12, 2012

చిన్న పిల్లల్లో అలర్జీ : ఇమ్యునిటి సిస్టం

శరీరంలోకి ప్రవేశించే హానికరమైన పదార్థాలను అంటే బాక్టీరియా, వైరస్ వంటి క్రిమికీటకాలతో పోరాడి, కాపాడే శక్తిని రోగనిరోధక శక్తి అంటారు. అయితే అంత హానికరం కాని పదార్థాలకు కూడా శరీరం అధికంగా ప్రతిస్పందించడాన్నే అలర్జీ అంటారు. దీనినే హైపర్‌సెన్సిటివిటీ అని కూడా అంటారు. పిల్లల్లో ససెప్టబిలిటీ లెవెల్స్ హెచ్చుగా ఉండటం వల్ల అలర్జీ ఎక్కువగా కనపిసస్తుంది. పిల్లల్లో వచ్చే అలర్జీలలో శ్వాసకోశ సంబంధిత అలర్జీ, ఫుడ్ అలర్జీ, అర్టికేరియా ముఖ్యమైనవి. చిన్న పిల్లల్లో పాల అలర్జీ, టిన్డ్ ఫుడ్ అలర్జీ, బాటిల్ ఫుడ్ అలర్జీ కనిపిస్తాయి. కొంతమందికి డెయిరీ వస్తువులు ఏది తిన్నా వాంతులు, విరేచనాలు అవుతూ ఉంటాయి. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు, చాక్లెట్స్, గోధుమలు ఇలా అనేక రకాల ఆహార పదార్థాలు కొంతమంది పిల్లలకు అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి.

లక్షణాలు

పిల్లల వ్యక్తిగత సెన్సిటివిటీని బట్టి ఆయా పదార్థాల వల్ల అలర్జీ వస్తుంది. కడుపులో ఇబ్బందిగా అనిపించడం, నోట్లోదురదగా లేదా తిమ్మిరిగా ఉండటం, చర్మంపైన దద్దుర్లు, పెదాలు వాచిపోయి, కొన్నిసార్లు నాలుక గొంతు కూడా వాచిపోవడం కనిపిస్తుంది. ఊపిరిసరిగ్గా తీసుకోలేకపోవడం, పిల్లికూత రావడం, కళ్లు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. శ్వాసకోశ సంబంధిత అలర్జీలలో ముక్కు నుంచి నీళ్లు కారడం, విపరీతంగా తుమ్ములు రావడం, కళ్లు ఎరుపెక్కడం, దురద, దగ్గు,ఆయాసం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

శ్వాసకోశ అలర్జీ

శ్వాసకోశ సంబంధిత అలర్జీలు చాలా మంది పిల్లల్లో ఉంటాయి. పిల్లలు పువ్వులతో ఆడుకున్నప్పుడు, ఆరుబయట గాలిలో ఆడుకున్నప్పుడు పుప్పొడిని పీల్చుకోవడమో, దుమ్ము, ధూళిలోనికి వెళ్లినపుడు తుమ్ములతో మొదలవుతుంది. పెంపుడు జంతువులతో ఆడుకోవడం వల్ల వాటి రోమాల వల్ల, దోమల మందుల వల్ల కూడా అలర్జీ రావచ్చు. తుమ్ములు, జలుబు, దగ్గు క్రమేణా ఆయాసానికి దారితీస్తుంది. పిల్లలు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిపడుతూ కొనిసార్లు ఎనైఫిలాక్సిస్ అనే ప్రమాదకర స్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. స్పృహకోల్పోవడం, శరీరం నీలంగా మారడం జరిగితే వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. సరియైన మందులు వాడుతూ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే పరిస్థితి విషవించకుండా చూసుకోవచ్చు.

 
డ్రగ్ ఎలర్జీ

పిల్లల్లో డ్రగ్ అలర్జీకూడా ఎక్కువే కనిపిస్తుంది. పెన్సిలిన్, యాస్పిరిన్ వంటి మందులు వాడినపుడు అలర్జీ లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. సోయా అలర్జీ, కాస్మెటిక్ అలర్జీ, మోల్డ్ అలర్జీ, సన్ అలర్జీ, లేటెక్ అలర్జీ .. ఇలా పలు రకాల అలర్జీలు పిల్లల్లో కనిపిస్తుంటాయి. చిన్నపిల్లలు వ్యక్తిగత సెన్సిటివిటీని బట్టి ఎన్నో రకాల అలర్జీలతో బాధపడుతుంటారు. కొంతమందిలో ఈ పదార్థాలలో చాలా పడవు. దేనిని దూరంగా ఉంచాలో కూడా అర్థంకాని పరిస్థితి ఉంటుంది.
 
అలర్జీని కచ్చితంగా నిర్ధారించడానికి స్కిన్‌ప్రక్‌టెస్ట్ ఉపయోగిస్తారు. అయితే చాలా శాతం పిల్లల్లో లక్షణాలను బట్టి అవసరాన్ని బట్టి ఇమ్యునోగ్లోబ్యులిన్ టెస్ట్‌తో నిర్ధారిస్తారు. ఏ పదార్ధానికి అలర్జీ వస్తుందో గమనించి సాధ్యమైనంత వరకు పిల్లలను దానికి దూరంగా ఉంచాలి. దీనివల్ల కొంతవరకు లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చు. అయితే ఇది పరిష్కారం కాదు. వ్యాధి నిరోధక వ్యవస్థలో వచ్చిన మార్పులను పైపర్‌సెన్సిటివిటీని తొలగించే మందులు వారికి ఇవ్వాలి
 
రెమిడి: రోగనిరోధక శక్తిని క్రమబద్దీకరించడం ఉత్తమమైన మార్గం. ఇందుకోసం పుడ్ సప్లిమెంటరీ ప్రోడక్ట్స్ ఉపయోగ పడుతాయి. అమెరికన్ కంపెనీ అయిన  4LIFE కంపెనీ యొక్క "ట్రాన్స్ ఫర్ ఫ్యాక్టర్", రియోవిడా మరియు రష్యన్ కంపెనీ అయిన  ARTLIFE యొక్క "సిట్రిజిన్" అదేవిదంగా BSY యొక్క "నోని డ్రాప్స్" చాలా బాగ పనిచేస్తాయి.

Transfer Factor
Riovida
Citrazin

BSY NONI




No comments: