Sunday, February 22, 2009

రేపు ఎలా ఉంటుందో?

రేపు శివరాత్రి. శీతాకాలపు మొట్టమొదటెండాకాలపు సాయంకాలం భాణుని కిరణాలు చురుక్కుమనిపిస్తుండగా ఈ ఆదివారపు రోజున నా పి.ఎల్. రాంకోటి తారు రోడ్డుపైన ప్లాటినంలా జారుకొంటూ వెలుతుంది. అంతలోనె ఆబిడ్స్ తాజ్ దాటింది నా పి.ఎల్. నా అలోచనలు కూడా నా పి.ఎల్ లా దూసుకొని వెలుతున్నాయి. ఆదివారము రోడ్డు చాలవరకు నిర్మానుష్యంగా ఉంది. దూరం నుంచి నెహ్రూ బొమ్మ వెలసి పోయినట్టుగా ఉంది. దగ్గిరగా వెలుతున్నకొద్దీ బొమ్మ పై దుమ్ము వెక్కిరిస్తోంది. క్షణ కాలం నెహ్రూ నా వైపే చూస్తున్నట్టుగా తోచింది. ఈ నెహ్రూ కి నాకు ఉన్న అనుభందము 32 సంవత్సరాలకు దాటుతుంది. శబ్ద కాలుష్యం తక్కువగా ఉండడము వల్లనేమో నెహ్రూ చేతిలోని పావురానికి పోటిపడి నెహ్రూ బొమ్మపై పావురాలు తిరుగుతూ ఈ సాయంకాలనికి కొత్త శోభని తెచ్చాయి. ఇంకా నెహ్రూ నా వైపే చూస్తూ ఏంటీ చాన్నలైంది ఇటువైపు వచ్చి అంట్టున్నట్టుగా తోస్తుంది. నెహ్రూ చూపుల్ని తప్పించుకొని కాస్త ముందుకు వెల్లానో లేదో పుల్లారెడ్డి స్వీట్ హౌస్, మెట్రో షూ షాప్ ల చూపులని తప్పించుకుంటూ ఖాలిగా ఉండే పెట్రోల్ బంక్ వైపు చూపులు సారించుకొంటూ ముదుకు వెలితే బంక్ లో గ్యాస్ నింపుకోవడానికి బారులు తీరిన ఆటోలు దర్శనమిచ్చాయి. శోభ తప్పిన అన్నపూర్ణ హోటల్ దాటుకుంటు ముందుకు వెల్లాను. నాంపల్లి, ఏవో ఆలొచనలు చుట్టుముట్టుకున్నాయి. నేను చేరాలిసిన గమ్య స్తానం వచ్చేసింది. కల్వాల్సిన శాల్తి మాత్రం లేదు. మల్లీ నా పి.ఎల్ పైన ప్రయాణం సాగించాను, పబ్లిక్ గార్డెన్స్ ముందుగా టర్న్ తీసుకొని జర్రున ముందుకు వెలుతుంది నా పి.ఎల్ సుజాత పబ్లిక్ స్కూల్ దాటి(ఇప్పుడుందో లేదో తెలియదు) 112 సంవత్సరాల చరిత్ర కలిగిన స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్ దాటుకుంటూ ముందుకు వెలుతుంది. బాంబే బెకరీ వచ్చింది. అప్రయత్నంగా నా కల్లు చుట్టూరా వెతికాయి. ఎంతో మార్పు. నా పి.ఎల్ జోరును కాస్త ఆపుదామనుకునే లోపె జీన్స్ బ్యాక్ పాకెట్ లోని సెల్ వైబ్రేషన్స్ కర్తవ్యాన్ని గుర్తు చేసాయి. మెల్లగ లెఫ్ట్ కట్ చేసాను. లేపాక్షి షోరూం పక్క సందు లోకి నా చూపులు అప్రయత్నంగా సాగిపోయాయి. వీధి చివర పాత కాలపు డంగు సున్నం ఇల్లు గ్రీన్ కలర్స్ బోర్డర్స్ తో ఇంకా అలాగె ఉంది. ఇప్పుడెవరున్నారో అందులో? ఆలోచనలు చుట్టుముట్టుకునే లోపె బ్యాక్ పాకెట్ లో వైబ్రేషన్స్. నా పి.ఎల్ జర్రున జారుకుంది. రాత్రి తొమ్మిది తరువాత ఇంటికి చేరుకుని ఈ పోసెట్ ని రాయడం ప్రారంబించాను. ఎక్కడి నుండో సన్నగా వినవ స్తూంది "జగమంత కుటుంబం నాది. ఏకాకి జీవితం నాది" ఈ పోసెట్ రాసేప్పుడు శీర్షిక గురించి ఆలోచించలేదు. ఇప్పుడు అనిపిస్తోంది "రేపు ఎలా ఉంటుందో"?