Monday, October 29, 2012

చలికి మాస్క్



చలికాలం వచ్చిందంటే చర్మానికి బోలెడె సమస్యలు. ముఖ్యంగా ముఖంపై చలి ప్రభావం పడకుండా ఉండడానికి బోలెడు ప్రయత్నాలు చేస్తుంటారు. అన్నింటికంటే ముఖానికి వేసుకునే మాస్క్‌లు మంచి ఫలితానిస్తాయి. వాటిలో కొన్ని ఇక్కడ ఇస్తున్నాం...

- మిగడతో ఉన్న పెరుగులో పెసరపిండి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ అరగంట తర్వాత గోరువెచ్చటినీటితో కడిగేసుకోవాలి. చర్మంపొడిపారకుండా, పగుళ్లు రాకుండా ఉండాలంటే పెరుగు ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది.


- ఓట్‌మీల్‌ని బాగా మెత్తగా పొడి చేసి అందులో తేనె, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై మురికి కూడా త్వరగా పోతుంది.

- అరటిపండు గుజ్జులో స్వీట్‌క్రీము కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవలి. ఓ పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. పొడిచర్మం వారికి చక్కని ఫలితం ఉంటుంది. అలాగే చర్మంపై నునుపుతనం కూడా పోకుండా ఉంటుంది.

- చలికాలంలో వారం రెండు మూడుసార్లు గుడ్డుతెల్లసొనని ప్యాక్ వేసుకోవాలి. పావు గంట తర్వాత చల్లటినీళ్లతో కడిగేసుకోవాలి. దీని వల్ల ఆయిల్‌స్కిన్ వారికి మంచి ఫలితం ఉంటుంది.

No comments: