Friday, October 19, 2012

యు.ఎస్ వెళ్లిన తర్వాతే ఎఫ్-1 అసలు కథ!

స్టూడెంట్ వీసా ఇవ్వడానికి కాన్సులేట్‌లు చూసే ప్రధానమైన రిక్వైర్‌మెంట్‌లలో విద్యార్థికి అమెరికాలో ఉండడానికి తగినంత ఫండ్ ఉండాలి. ఆర్థిక వనరులు చూపలేనివారిని ‘‘పొటెన్షియల్ ఇమిగ్రెంట్’’ గా భావించి వీసా నిరాకరిస్తారు. వీసా కోసం ఏదో ఒక అకౌంట్‌లో డబ్బు చూపించి ఆ తర్వాత చేతిలో చిల్లిగవ్వ లేకుండా అమెరికాలో దిగే విద్యార్థి పీకల లోతు కష్టాలలో కూరుకుపోక తప్పదని పేరెంట్స్ గుర్తించాలి. మీ దగ్గర సొంత డబ్బు లేకపోతే జాతీయ బ్యాంకుల దీర్ఘకాలిక విద్యా రుణాలకు ప్రయత్నించండి.



ఎఫ్-1 అసలు కథ!

ఇక్కడ యుఎస్ కాన్సులేట్ నుంచి ఎఫ్-1 వీసా వచ్చిన వెంటనే అమెరికా వెళతారు. అయితే వెళ్లిన తర్వాత ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎఫ్-1 కథ ఎలా తిరగడుతుందో ఒక ఉదాహరణ చూడండి.



శ్రీధర్ న్యూయార్కులో ఒక యూనివర్సిటిలో చేరాడు. ఆర్థిక వనరులు అంతగా లేకుండా వెళ్లడం వల్ల అప్పుడప్పుడు క్లాసులు వదిలేసి వర్క్‌కి వెళ్లేవాడు. అదే అతడిని ఆఖరికి చిక్కుల్లో పడేసింది.



యు.ఎస్‌లో ఎఫ్-1లు పార్ట్ టైము క్యాంపస్ ఉద్యోగాలని నిర్ణీత గంటలకు మించకుండా, డి.ఎస్.ఓ. (స్కూలు అధికారి) అనుమతితోనే జరగాలి. ‘‘సేవిస్’’ డేటా బేస్‌లో దాని వివరాలు అప్‌డేట్ అవుతూ ఉండాలి. శ్రీధర్ ఇక్కడే దెబ్బ తిన్నాడు. డి.ఎస్.ఓ. తో అతనికి సరైన కమ్యూనికేషన్ కుదరలేదు. క్యాంపస్ జాబ్ గురించి ఎప్పటికప్పుడు డి.ఎస్.ఓ.తో చర్చించలేకపోయాడు. తను ఎక్కువ గంటలు పని చేస్తున్నట్టు ఎవరో అంటే యూనివర్సిటీ ఆఫీసులో అడిగొచ్చాడే గాని డి.ఎస్.ఓ. దగ్గరకు వెళ్లలేదు. యూనివర్శిటీ అబ్జెక్షన్ పెట్టేవరకు భయపడాల్సింది ఏమీ లేదని ఎవరో చెప్పింది నమ్మాడేగాని తన స్కూలు అధికారిని కన్సల్ట్ చెయ్యలేదు. దానితో ఒకనాడు డి.ఎస్.ఓ. అతడిని పిలిచి ‘‘ఫుల్ కోర్స్ లోడ్’’ (పూర్తి కోర్సు) చెయ్యలేక పోవడం వల్ల ‘‘సేవిస్’’ నిబంధనల క్రింద తను ‘‘అవుటాఫ్ స్టేటస్’’ అయ్యాడని, అతని ఎఫ్-1 వీసా రద్దయిందని, యు.ఎస్. నుంచి తక్షణం వెళ్లిపోవాలని చెప్పాడు.

అప్పీళ్ల కోసం తిరుగుతూ దేశం విడిచే గడువుని కూడా శ్రీధర్ పట్టించుకోకపోవడంతో అతడి మీద రిమూవల్ ప్రొసీడింగ్స్ అమలుచేసి బలవంతంగా అమెరికా నుంచి పంపేశారు. కష్టపడి సంపాదించుకున్న స్టూడెంట్ వీసాకి చిక్కులు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తల్ని పాటించాలి. మీ డి.ఎస్.ఓ. తో సత్సంబంధాలు కొనసాగించాలి సెవిస్ రూల్స్‌ని జవదాటని క్రమశిక్షణ పాటించాలి తొలి విద్యా సంవత్సరంలో ఆఫ్ క్యాంపస్ జాబ్ చెయ్యకూడదు ఆన్ క్యాంపస్ వర్క్ కూడా డి.ఎస్.ఓ. అనుమతితోనే చెయ్యాలి ఎఫ్-1 మీద యు.ఎస్. చేరిన తర్వాత 30 రోజులలోగా యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకోవాలి మందస్తు అనుమతి లేకుండా ఒక్క క్లాసుకి కూడా గైర్హాజరు కాకూడదు స్కూల్ జరిగేటప్పుడు వారానికి 20 గంటలకి మించి వెకేషన్‌లో వారానికి 40 గంటలకి మించి ఆన్ క్యాంపస్ జాబ్ చెయ్యకూడదు ఐ-20 లో వేసిన తేదీలోగా కోర్సు పూర్తిచెయ్యలేకపోతే ముందుగానే ఎక్స్‌టెన్షన్ పొంది తీరాలి ఒక స్కూలు నుంచి ఇంకొక స్కూలుకి మారాలంటే సెవిస్ నిబంధనల్ని పాటించితీరాలి యు.ఎస్సీ.ఐ.ఎస్ అనుమతించిన స్కూలులో మాత్రమే చదవాలి. ఏ ఒక్క నిబంధనని ఉల్లఘించినా ఎఫ్ వీసా రద్దవుతుంది.

No comments: