Sunday, October 28, 2012

‘లాలన, పాలన, పోషణ’ మీద అవగాహన

చిన్నపిల్లల్ని పుట్టిన దగ్గర నుండి 10 సంవత్సరాల వయసు వచ్చేవరకు పెంచి పెద్దచెయ్యడానికి తల్లిదండ్రులకు ‘లాలన, పాలన, పోషణ’ మీద అవగాహన కావాలి. లాలన వల్ల మనోవికాసం పదిలపడుతుంది. ఇది ప్రేమ, వాత్సల్యం వంటి ఉద్వేగాలకు సంబంధించింది. పాలన వల్ల పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ మెరుగుపడతాయి. పిల్లలకు ఎన్నో విషయాలను బోధపర్చడం, మంచి అలవాట్లను నేర్పించడం, సమాజ పోకడలకు గురిచేయడం వంటివి చెయ్యాలి. వీటికై తల్లిదండ్రులకు నేర్పు, ఓర్పు అవసరం. పోషణ వల్ల బరువు పెరగడం, క్షమత్వం అభివృద్ధి చెందడం, అనారోగ్యాలకు గురికాకుండా ఉండటం జరుగుతుంది. విటమిన్లు, ప్రొటీన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి సహజ లవణాలు శిశువులకు తగు ప్రమాణాలలో అందించడం ముఖ్యం. ముఖ్యంగా ఐరన్, క్యాల్షియం కావలసిన ప్రమాణాలలో దేహానికి లభించనప్పుడు పాండురోగం, ఫక్కరోగం వంటివి కలుగుతాయి.
కాసీసభస్మం, ప్రవాళపిష్ఠి: 200 మిల్లీగ్రాముల చొప్పున కలిపి తేనెతో రెండుపూటలా తినిపించండి
చ్యవనప్రాశ లేహ్యాన్ని: ఉదయం, రాత్రి ఒక్కొక్క చెంచా తినిపించండి అరవిందాసవ: రెండు చెంచాల ద్రావకానికి సమానంగా నీళ్లు కలిపి రెండుపూటలా తాగించండి.

ఆహారం: తాజా ఫలాలు, బాదం, ఖర్జూరం వంటి శుష్కఫలాలు మంచిది. నువ్వులు, బెల్లం, బొప్పాయి తగు ప్రమాణంలో తినిపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆవుపాలు శ్రేష్ఠం.

No comments: