Friday, October 5, 2012

స్టెమ్‌తో హెచ్-1కి మారడానికి వ్యవధి

చదువుకోవడానికి వెళ్లేటప్పుడు అమెరికాలో స్థిరపడే అవకాశాలున్నట్లు కనిపించిన వారికి (పొటెన్షియల్ ఇమిగ్రెంట్‌లు) యుఎస్ కాన్సులేట్‌లలో వీసాలు లభించవు. అయితే అదే సమయంలో అక్కడ చదువుకుంటూనే ఆన్-క్యాంపస్, ఆఫ్- క్యాంపస్ జాబ్స్ చేసుకోవడానికి, వాటి నుంచి మళ్లీ అక్కడే తాత్కాలిక ఉద్యోగ వీసా (హెచ్-1బి) పొందడానికి విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం చట్టబద్ధమైన కొన్ని అవకాశాలు కల్పించింది. ఇదే యుఎస్ ఇమిగ్రేషన్ నిబంధనలలోని వైవిధ్యం.

‘చదువు పూర్తి కాగానే ఉద్యోగం వెతుక్కుని యుఎస్‌లోనే సెటిల్ కావాలనుకుంటున్నాను’ అని చెప్పినవారికి వీసా ఇచ్చే అధికారం వీసా అధికారులకు కూడా ఉండదు. ఎందుకంటే ఎఫ్-1 స్టూడెంట్ వీసా అనేది యుఎస్‌లో స్థిరపడే ఉద్దేశం లేనివారికి (నాన్- ఇమిగ్రెంట్ అప్లికెంట్‌లకి) మాత్రమే ఉద్దేశించినది. స్థిరపడేందుకు వెళ్లే వారి కోసం ఇమిగ్రెంట్ వీసాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అయితే మన విద్యార్థులకు చదువు పూర్తవుతుండగానే అక్కడ అవకాశాలు అంది వచ్చి ఒక చట్టబద్ధమైన క్రమం (లీగల్ ప్రాసెస్) ద్వారా మొదట ఒక తాత్కాలిక ఉద్యోగానికి (పెంటపరరీ ఎంప్లాయ్‌మెంట్ హెచ్-1బి), ఆ తర్వాత దాని నుంచి శాశ్వత నివాసానికి (గ్రీన్‌కార్డ్) మారాలనుకుంటే యుఎస్ ప్రభుత్వానికి దాంతో ఏమీ పేచీ ఉండదు. ఒక విద్యార్థి ఎఫ్-1 వీసా నుంచి హెచ్-1 వీసాకి మారిన తరవాత తనకి ఇమిగ్రెంట్ ఇంటెంట్ (అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకునే ఉద్దేశం) ఏర్పడడాన్ని యుఎస్ ఇమిగ్రేషన్ నిబంధనలు తప్పు పట్టవు.

ఈ నేపథ్యంలో చూస్తే యుఎస్‌లో విద్యాభ్యాసం తర్వాత హెచ్-1కి మారే ఆలోచన, అవకాశం ఏర్పడే మన విద్యార్థులకు రెండు వీసా స్టేటస్‌ల మధ్య (ఎఫ్-1, హెచ్-1) పోస్ట్ కంప్లీషన్ ఓపిటి (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) 12 నెలల పాటు మనవాళ్లు కొనసాగించవచ్చు. ఓపిటి చేయడం వల్ల ఉపాధి, అనుభవం, వేతనం లభించడం మాత్రమే కాక విదేశీ విద్యార్థుల ఎఫ్-1 స్టేటస్ కూడా ఆ 12 నెలల కాలానికి ఢోకా లేకుండా కొనసాగుతుంది.

ఈ 12 నెలల వ్యవధిలో యుఎస్‌లోని ఒక ఎంప్లాయర్ ద్వారా హెచ్-1 పొందడానికి విదేశీ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. అయితే ఓపిటి పూర్తయ్యేలోగా హెచ్-1 అప్రూవల్ రాకపోతే విదేశీ విద్యార్థులు అమెరికాను విడిచి వెళ్లవలసి ఉంటుంది (దీనిని గురించి వివరంగా మరొక సందర్భంలో తెలుసుకుందాం).

ఈ సమస్య నుంచి బయటపడడానికి అమెరికాలో విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరొక మంచి అవకాశం స్టెమ్ ఎక్స్‌టెన్షన్. ఇక్కడ స్టెమ్ అనేది సైన్స్(s), టెక్నాలజీ (t), ఇంజనీరింగ్(e), మాథమాటిక్స్(m) అనే పదాలలోని మొదటి ఇంగ్లిష్ అక్షరాల కలయిక నుంచి ఏర్పడిన సంక్షిప్త నామం.

ఈ నాలుగు విభాగాల కిందికి వచ్చే స్టెమ్ డిగ్రీల విద్యార్థులు తమ పోస్ట్ కంప్లీషన్(విద్యానంతరం) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌ని మరొక 17 నెలల పాటు పొడిగించుకునే వీలు ఉంటుంది. అంటే స్టెమ్ విద్యార్థులు మొదటి 12 నెలల ఓపిటితో కలిపి మొత్తం 29 నెలలపాటు (12+17) తమ ఓపిటిని, దానితోపాటు తమ స్టూడెంట్ స్టేటస్‌ని కొనసాగించే అవకాశాన్ని యుఎస్‌లో చట్టబద్ధంగా పొందవచ్చు. ఇలా 29 నెలల పాటు ఓపిటిలో ఉండే విద్యార్థులకు హెచ్-1కి మారడానికి పుష్కలంగా వ్యవధి లభిస్తుంది.

యుఎస్‌లోని విద్యాసంస్థలను ఎంచుకునేటప్పుడు మన విద్యా ర్థులు ఏయే యూనివర్శిటీలలో ఓపిటి/ స్టెమ్ నిబంధనలు ఎలా ఉన్నాయో వాటి వెబ్‌సైట్లలోకి వెళ్లి తెలుసుకోవాలి. ఇక ఏయే కోర్సులు ‘స్టెమ్’ జాబితాలోకి వస్తాయి,

No comments: