Sunday, October 7, 2012

బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

పాశుపతాస్త్రంలా ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణిని భారత నౌకాదళం ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. 290 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే దీన్ని గోవా తీరంలో ఉదయం ఐఎన్‌ఎస్ తేగ్ యుద్ధనౌక నుంచి ప్రయోగించారు. పేలుడుపదార్థాలు తీసుకెళ్లకుండా దూసుకెళ్లిన బ్రహ్మోస్ తన లక్ష్యమైన ఓ నౌకను చావుదె బ్బ తీసింది. దాడి ధాటికి ఆ నౌకలో మంటలు లేచాయి. బ్రహ్మోస్ సవ్యదిశలో కాకుండా మెలికల విన్యాసాల చేస్తూ వెళ్లి లక్ష్యాన్ని ఛేదించింది.

No comments: