Tuesday, October 16, 2012

 సిగరెట్టు తాగితే.. ఆయుష్షు తగ్గిపోతుందని విన్నాంగానీ.. ఇదేంటి టీవీ చూస్తే కూడా ఆయుష్షు తగ్గిపోతుందా? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది ముమ్మాటికీ నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. ‘ఇడియట్ బాక్స్’ ముందు మనం గడిపే ప్రతి గంటకూ మన ఆయుష్షులో 22 నిమిషాల చొప్పున తగ్గిపోతాయని అంటున్నారు వారు. ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. రోజూ టీవీ చూసే వారి ఆయుష్షు దాదాపు 4.8 సంవత్సరాల మేర తగ్గిపోయే అవకాశముందని చెప్తున్నారు. 25 ఏళ్లకు పైబడిన వారిలో ఈ తగ్గుదల కనిపిస్తోందన్నారు. అసలు టీవీ చూడని వారితో... రోజుకు సగటున ఆరు గంటలు టీవీ చూసే వారిని పోల్చి చూస్తూ ఈ అధ్యయనం చేశారు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా డయాబెటిస్, ఒబెసిటీ, జీవన విధానాలపై అధ్యయనాలను, జాతీయ గణాంకాల బ్యూరో సమాచారాన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. అధ్యయనం ఆస్ట్రేలియన్లపైనే చేసినా.. టీవీ చూసేవారందరికీ ఇది వర్తిస్తుందని వారు అంటున్నారు.

No comments: