Wednesday, October 17, 2012

న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ గుట్టు బయట పెట్టారు. ఈ సాయంత్రం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ద్వారా గడ్కరీ గుట్టు బయటకు లాగామని చెప్పారు. గడ్కరీకి వ్యతిరేకంగా ఆయన కొన్ని ఆధారాలను బయట పెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి గడ్కరీ లబ్ది పొందారని ఆరోపించారు. శరద్ పవార్ , అజిత్ పవార్ లతో ఉన్న సంబంధాలను ఆయన బాగా ఉపయోగపెట్టుకున్నారని తెలిపారు. గడ్కరీ విధానాల వల్ల విదర్భ రైతులు నష్టపోయారని, నాగ్ పూర్ జిల్లాలో రైతులు దెబ్బతిన్నారని వివరించారు. ఆయన వ్యాపార ధోరణి సామాన్యులకు నష్టం కలిగించిందన్నారు. గడ్కరీ లేఖకు ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆఘమేఘాల మీద ఆయనకు భూమి కేటాయించినట్లు తెలిపారు. సుందరీకరణ పేరుతో రైతులను తిరస్కరించి, గడ్కరీకి భూమి కట్టబెట్టారని ఆరోపించారు. భూ కేటాయింపులపై అప్పటి ముఖ్యమంత్రి అజిత్ పవార్ సంతకం ఉందని తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని పత్రాలను ఇండియా ఎగెనిస్ట్ కరప్షన్ వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపారు. నీటిపారుదల కుంభకోణంలో గడ్కరీకి సంబంధం ఉన్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు.

No comments: