Friday, October 5, 2012

టోఫూ, కార్న్ ఫ్రైడ్ రైస్

కావలసినవి

సన్న బియ్యం లేదా బాస్మతి - 2 కప్పులు

స్వీట్ కార్న్ గింజలు - 1/2 కప్పు

టోఫూ ముక్కలు - 1/2 కప్పు

ఉల్లిపాయ -1

పచ్చిమిర్చి -3

కరివేపాకు - 2 రెబ్బలు

పసుపు - 1/4 టీ.స్పూ.

క్యారట్ తరుగు - 3 టీ.స్పూ.

కొత్తిమీర - 3 టీ.స్పూ.

అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.

గరం మాసాలా పొడి - 1/4 టీ.స్పూ.

ఉప్పు - తగినంత

నూనె - 2 టీ.స్పూ.

నెయ్యి - 1 టీ.స్పూ.

ఇలా వండాలి

బియ్యం కడిగి అరగంట నీళ్లలో నానబెట్టి పొడి పొడిగా ఉడికించుకోవాలి. కార్న్ గింజలు ఆవిరిమీద ఉడికించి పెట్టుకోవాలి. టోఫీ పనీర్ అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని గోరువెచ్చని నీళ్లలో వేసి ఉంచాలి. ఇలా చేయడంవల్ల పనీర్ ముక్కలు రబ్బర్‌లా గట్టిగా కాకుండా, మృదువుగా ఉంటాయి. ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువునా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి.

ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరో రెండు నిమిషాలు వేపాలి. ఇందులో వేయించిన టోఫూ ముక్కలు, ఉడికించిన కార్న్ గింజలు, క్యార్ తురుము వేసి మరికొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు అన్నం, తగినంత ఉప్పు, గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలియబెట్టి రెండు నిమిషాలు వేయించి దింపేయాలి.

No comments: