Wednesday, October 31, 2012

మన ‘చరిత్ర’ మెరిసేనా...!



 హైదరాబాద్... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాచీన నగరం. అద్భుత చారిత్రక కట్టడాలకు నిలయం. చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ సమాధులు.. ఇలా చెబుతూ పోతే అలనాటి రాజవంశాల ఠీవికి దర్పణంగా నిలిచిన కట్టడాలెన్నో. కానీ వీటిలో ఏ ఒక్కదానికీ ‘యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)’ అధికారికంగా గుర్తించిన ప్రపంచ వారసత్వ కట్టడాల (హెరిటేజ్ బిల్డింగ్) జాబితాలో చోటు దక్కలేదు. నిర్మాణశైలి, చారిత్రక నేపథ్యం పరంగా ఆ కట్టడాలన్నీ అద్భుతమైనవే అయినప్పటికీ.. యునెస్కో రూపొందించిన నిబంధనలు అడ్డుగా మారటంతో ఇవి ఆ జాబితాలో చోటు దక్కించుకోలేదు. తొలుత పెద్దగా పట్టించుకోని పురావస్తు శాఖ గత మూడేళ్లుగా పట్టువదలకుండా చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి.

Monday, October 29, 2012

సైనసైటిస్‌కు పరిష్కారం

 విపరీతమైన తలనొప్పితో పాటు ముక్కు వెంట ద్రవాలు కారడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు సైనసైటిస్‌లో కనిపిస్తాయి. యాంటీబయోటిక్స్ ఎన్ని వేసినా ఫలితం శూన్యం.

తలనొప్పి తీవ్రంగా వేధిస్తోందా? కళ్ల దగ్గర దురదగా ఉందా? ముక్కు ఇరువైపులా ముట్టుకుంటే నొప్పిగా ఉందా? అయితే మీరు సైనసైటిస్‌తో బాధపడుతున్నట్టే. సింపుల్‌గా చెప్పాలంటే సైనస్ గదుల్లో ఏర్పడే నొప్పినే సైనసైటిస్ అంటారు. ముక్కుకు ఇరువైపులా సైనస్ గదులుంటాయి. మనం పీల్చేగాలి వీటి ద్వారా ప్రయాణిస్తుంది. జలుబు, వాతావారణ కాలుష్యం, అలర్జీ వల్ల ఈ సైనస్ గదులు మూసుకుపోతాయి. దీనివల్ల మ్యూకస్ పేరుకుపోతుంది.

చలికి మాస్క్



చలికాలం వచ్చిందంటే చర్మానికి బోలెడె సమస్యలు. ముఖ్యంగా ముఖంపై చలి ప్రభావం పడకుండా ఉండడానికి బోలెడు ప్రయత్నాలు చేస్తుంటారు. అన్నింటికంటే ముఖానికి వేసుకునే మాస్క్‌లు మంచి ఫలితానిస్తాయి. వాటిలో కొన్ని ఇక్కడ ఇస్తున్నాం...

- మిగడతో ఉన్న పెరుగులో పెసరపిండి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ అరగంట తర్వాత గోరువెచ్చటినీటితో కడిగేసుకోవాలి. చర్మంపొడిపారకుండా, పగుళ్లు రాకుండా ఉండాలంటే పెరుగు ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది.

వ్యక్తిత్వం ఎట్ నిద్రాభంగిమ...

మీరు కాలు ఇలా ముడుచుకుని(4వ చిత్రం) పడుకుంటారా? అయితే, మీరు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరముంది. అలా పడుకున్నారంటే.. మీరు ఏదైనా విషయం గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లేనట! ఎందుకంటే.. మనం పడుకునే భంగిమ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని శరీర భాషా నిపుణులు చెబుతున్నారు. వీరు ఇటీవల బ్రిటన్‌లో మనం పడుకునే భంగిమలపై పరిశోధన చేశారు. దాని ప్రకారం.. ఈ భంగిమలో పడుకుంటే.. వారి వ్యక్తిత్వం ఇలా ఉండే అవకాశముందంటూ వివరించారు. వాటిల్లో కొన్ని మీకోసం.

Sunday, October 28, 2012

‘లాలన, పాలన, పోషణ’ మీద అవగాహన

చిన్నపిల్లల్ని పుట్టిన దగ్గర నుండి 10 సంవత్సరాల వయసు వచ్చేవరకు పెంచి పెద్దచెయ్యడానికి తల్లిదండ్రులకు ‘లాలన, పాలన, పోషణ’ మీద అవగాహన కావాలి. లాలన వల్ల మనోవికాసం పదిలపడుతుంది. ఇది ప్రేమ, వాత్సల్యం వంటి ఉద్వేగాలకు సంబంధించింది. పాలన వల్ల పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ మెరుగుపడతాయి. పిల్లలకు ఎన్నో విషయాలను బోధపర్చడం, మంచి అలవాట్లను నేర్పించడం, సమాజ పోకడలకు గురిచేయడం వంటివి చెయ్యాలి. వీటికై తల్లిదండ్రులకు నేర్పు, ఓర్పు అవసరం. పోషణ వల్ల బరువు పెరగడం, క్షమత్వం అభివృద్ధి చెందడం, అనారోగ్యాలకు గురికాకుండా ఉండటం జరుగుతుంది. విటమిన్లు, ప్రొటీన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి సహజ లవణాలు శిశువులకు తగు ప్రమాణాలలో అందించడం ముఖ్యం. ముఖ్యంగా ఐరన్, క్యాల్షియం కావలసిన ప్రమాణాలలో దేహానికి లభించనప్పుడు పాండురోగం, ఫక్కరోగం వంటివి కలుగుతాయి.

స్వైన్‌ఫ్లూ నివారణకు ఔషధాలు ...

స్వైన్‌ఫ్లూ, ఒక వైరస్ కలిగించే సాంక్రామిక వ్యాధి. ఇది శ్వాసకోశ సంస్థానానికి సంబంధించిన లక్షణాలను కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకడమనేది వ్యక్తి వ్యాధినిరోధకశక్తి, వైరస్ తీవ్రతల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయా రోగుల సంపర్కానికి దూరంగా ఉండాలి. ఈ కింద సూచించిన కషాయాన్ని అవసరమైనంత కాలం వాడుకుంటే ఈ వ్యాధిని నివారించుకోడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. వెల్లుల్లి, అల్లం, ధనియాలు, పసుపు ఐదేసి గ్రాములు తీసుకుని బాగా దంచి, దానికి 3 గ్రా. ‘దాల్చినచెక్క’ చూర్ణాన్ని కలపాలి. దీనికి పావులీటరు నీళ్లు కలిపి బాగా మరిగించాలి. 25 మి.లీ చొప్పున ఉదయం, రాత్రి తాగాలి. పిల్లలకు దీంట్లో సగం మోతాదు సరిపోతుంది. లభిస్తే ఒక చెంచా తులసి ఆకుల రసం గాని, ఉసిరికాయరసం గాని కషాయంలో కలుపుకుని తాగవచ్చు.

Saturday, October 27, 2012

అత్యంత ఇరుకైన ఇల్లు..


ఇరుకిరుకు సందుల్లో చిన్న జాగా దొరికితే.. సన్నంగా నిలువుగా.. ఇల్లు లేపేయడం మన నగరాల్లో అలవాటే. ఇది వాటన్నిటికంటే అత్యంత ఇరుకైన ఇల్లు. చూశారుగా.. రెండు ఇళ్ల మధ్య ఎలా ఇరుక్కుపోయిందో.. దీని వెడల్పు గోడలతో కలిపి చూసుకున్నా.. 5 అడుగులకు మించి లేదట! ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన ఈ ఇల్లు ప్రారంభోత్సవం ఈ వారమే పోలాండ్ రాజధాని వార్సాలో జరిగింది. దీని రూపకర్త జాకబ్ అనే అర్కిటెక్ట్. ఇంత చిన్న ఇంట్లో ఏం సదుపాయాలుంటాయిలే అని తీసిపారేయద్దు. ఎందుకంటే.. ఇందులో వంటగది, బాత్రూం, భోజనం చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండటంతో పాటు పైన.. బెడ్రూం కూడా ఉంది. మధ్యలో ఉండే నిచ్చెన ద్వారా ఇందులో ఉండేవారు బెడ్రూంలోకి వెళ్లవచ్చు. 

అక్కడ పుట్టబోతున్న మనవడు, ఇక్కడ వీసా కష్టాలు!

అసలు కంటె వడ్డీ ముద్దు. ఏళ్ల తరబడి పిల్లలు అమెరికాలో, తాము ఇక్కడ ఉండగలిగిన తల్లిదండ్రులు తమకు మనవడో, మనవరాలో పుట్టబోతున్నట్టు తెలసినప్పుడు మాత్రం రెక్కలు కట్టుకుని అమెరికాలో వాలిపోవాలని తహతహలాడతారు. తన కూతురికి, లేదా కోడలికి నెలలు నిండేటప్పుడు దగ్గర ఉండి ఆమె బాగోగులు చూసుకోవాలని ఏ తల్లి అయినా, అత్తగారయినా ఆశపడతారు.

పుత్రోదయాన్ని పొందబోతున్న పడతికి అమ్మ, అత్త దగ్గరుండి సేవలు చెయ్యడం మన సంప్రదాయంలో ఒక విడదీయరాని ముఖ్యభాగం. మనవడు, లేదా మనవరాలి రాక కోసం కళ్లు కాయలు చేసుకుని ఎదురు చూస్తూ కూతురికి లేదా కోడలికి సపర్యలు చేసే అమ్మ, అత్తల సేవలు ప్రపంచంలోని ఏ కరెన్సీతోను అన్నిటికంటె విలువైన, డాలర్లతోను కొనలేనివి, వెల కట్టలేనివి. అంతేకాదు. తమ వృద్ధాప్యాన్ని కూడా ఖాతరు చెయ్యకుండా కాన్పుకి ముందు, కాన్పు తర్వాత తమ కుమార్తెకి తమ కోడలకి అమ్మ, లేదా అత్త అందించే ప్రేమ పూరితమైన సేవలు ప్రతి దానినీ పౌండ్లు, డాలర్లతో వెలకట్టే సమాజాలలో దొరకనివి కూడా.

ఇక్కడ మిగిలినపోయిన అమ్మ, అత్తలకి అక్కడ అమెరికాలో కూతురు, కోడలు కడుపులో కదిలిన పేగుకి మధ్య రుణానుబంధం ఇంతగా విడదీయరానిదీ, ఇంతగా అనూచానమైనదీ అయివుండగా కూతురి లేదా కోడలి కాన్పు కోసం, మనవడు లేదా మనవరాలిని ఎత్తుకోవడానికి వెళ్లేందుకు యు.ఎస్.కాన్సులేట్‌లో తమకి వీసా రాకపోవడం ఏ గ్రాండ్ పేరెంట్స్‌కైనా సరే అశనిపాతమే అవుతుంది.

ఇలా అమెరికాలో తమ ప్రాణానికి ప్రాణం లాంటి కూతురు లేదా కోడలు డెలివరీకి వీసా రెఫ్యూజ్ అయి వెళ్లలేకపోయిన అనేకమంది తల్లిదండ్రుల, అత్తమామల ఆక్రోశాన్ని యు.ఎస్.కాన్సులేట్‌లో పనిచేసిన పాతికేళ్లలో నేను అనేక పర్యాయాలు విన్నాను. అయితే ఇది నాణానికి ఒక పక్క మాత్రమే. నాణానికి రెండవవైపున మనకి భిన్నమైన అమెరికన్ సంస్కృతి, దాని ప్రాతిపదికపైన రూపొందిన వీసా నిబంధనలు ఉన్నాయి.

ఇక్కడ ముందుగా మీకు నేను చెప్పదలుచుకున్న అంశం అమెరికాలో తమ కూతురు డెలివరీకి వెళ్లానుకునే పేరెంట్స్ వీసాకి అనర్హులు అని తేల్చి చెప్పే నిబంధన ఎక్కడా లేదు.


అలాగే డెలివరీకి వెళుతున్నామని చెప్పిన వారికి కూడా కాన్సులేట్ ఆఫీసర్లు వీసాలు ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. కనుక వీసా ఇంటర్వ్యూలో మీరు మీ అమ్మాయి డెలివరీకి వెళుతున్నామని చెబితే ‘మీకు రూఢిగా వీసా రాదు’ అని ఎవరైనా చెబితే అది నిజం కాదని అర్థం చేసుకోండి. అయితే కూతురు/ కోడలు డెలివరీకి వెళ్లాలనుకునే పేరెంట్స్‌కి వీసా వచ్చే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ నిజాన్ని జీర్ణించుకోవాలంటే అమెరికన్ సంస్కృతి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

అమెరికాలో ‘కుటుంబం’ చాలా చిన్నది. తను, తన జీవిత భాగస్వామి, మైనారిటీ తీరని తన పిల్లలు అంతే. తల్లిదండ్రులు, అత్తమామలు, ఆ మాటకొస్తే మైనారిటీ తీరిన పిల్లలు లెక్కప్రకారం అమెరికన్ కుటుంబాలలో సభ్యులు కాదు. అందువల్ల మన సమిష్టి కుటుంబ సంప్రదాయాలు, కాన్పు సమయంలో దగ్గర ఉండడం అనే మన ప్రేమ పూరితమైన బాధ్యతలు, సెంటిమెంట్లు లాంటివి అమెరికన్ చట్టాల రూపకల్పనని, నిబంధనల నిర్మాణాన్ని ప్రభావితం చేయలేకపోయాయి.

Friday, October 26, 2012

గ్రేట్ గార్లిక్

వాసన ఘాటుగా ఉంటుందని, తింటే వాసన వస్తుందని కొందరు వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు. కానీ... ఆరోగ్య పరిరక్షణ కోసం వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఇది నివారస్తుంది. దాని ఉపయోగాల్లో కొన్ని...

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే యాంటాక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలోని కొవ్వులను తగ్గించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది. ఫలితంగా మనలో గుండెపోటును నివారిస్తుంది.

గర్భం ధరించాలనుకున్నప్పుడు ఆహారం...

మన రోజువారీ వ్యవహారంలో కొన్ని పనులు చేయబోయే ముందు కొంత ప్రత్యేకమైన ఆహారం మీకు ఉపయోగిస్తుంది. మనం సరిగ్గా ఇలాగే తింటామని, లేదా ఇలాగే తినాలని కాకపోయినా... ఇలా తినడం వల్ల అదనపు ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. ఈ వివరాలు ఇలా...

గర్భం ధరించాలనుకున్నప్పుడు...

కొత్తగా పెళ్లయ్యాక పిల్లలప్పుడే వద్దనుకుంటే పర్వాలేదు. అయితే పిల్లలు కావాలనుకోగానే మహిళలు కార్బోహైడ్రేట్లు, ఫోలిక్ యాసిడ్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

అందం పదిలం వ్యాధి మాయం

రొమ్ము క్యాన్సర్ చికిత్స - ఆధునిక ప్రక్రియలు

ఇప్పుడు దాదాపు అన్ని క్యాన్సర్లకూ చికిత్స అందుబాటులో ఉన్నట్లే రొమ్ము క్యాన్సర్‌కూ ఉంది. పైగా మునుపటిలా రొమ్మును తొలగించాల్సిన పనిలేదు. అప్పట్లో రొమ్ము తొలగించాక - క్యాన్సర్ తగ్గినా - స్త్రీలలో తమ పరిపూర్ణతకు ఏదో లోపం వచ్చిన భావన ఉండేది. ఇప్పుడా అవసరమే లేదు. పైగా పురోగతి అక్కడికి మాత్రమే పరిమితం కాలేదు. రొమ్ముక్యాన్సర్ చికిత్ప ప్రక్రియలన్నింటిలో సాధించిన ప్రగతిని తెలుపుతూ మహిళల్లో ఆందోళన తొలగించి, అవగాహన కలిగించడానికే ఈ కథనం...

రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఒకప్పటి వైద్య విధానాలకూ, ఆధునిక వైద్య విధానాలకూ భూమికీ, ఆకాశానికీ మధ్య ఉన్నంత తేడా ఉంది. చికిత్సలోనే కాదు, వ్యాధి నిర్ధారణకూ ఎన్నో అధునాతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఉన్న సాధారణ ఎనలాగ్ మమ్మోగ్రఫీ స్థానంలోకి ఇప్పుడు డిజిటల్ మమ్మోగ్రఫి వచ్చి చేరింది. ఒకప్పుడు కణితి 7 నుంచి 8 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఉంటే తప్ప పరీక్షల్లో కనిపించేది కాదు. గుర్తించే నాటికే కొన్ని సార్లు కేన్సర్ విషమ పరిస్థితికి చేరుకునేది. ఇప్పుడొచ్చిన డిజిటల్ మమ్మోగ్రఫీ ద్వారా దీని వల్ల అతి చిన్నదిగా... అంటే 3 మిల్లీ లీటర్ల పరిమాణంలో ఉన్న కణితిని కూడా గుర్తించడం సాధ్యమవుతోంది. ఇప్పుడు కాంట్రాస్ట్ ఎన్‌హాన్స్‌డ్ మమ్మోగ్రఫీ, డైనమిక్ కాంట్రాస్ట్‌తో ఎంఆర్ మమ్మోగ్రామ్ ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా కణితిని ఎంతో కచ్చితంగా గుర్తించవచ్చు. ఆల్ట్రాసౌండ్ పరీక్షలోనూ, ఎలాస్టోగ్రఫీ చేయడం ద్వారా కణితి తత్వాన్ని కూడా అంచనా వేసే అవకాశం ఉంది.

స్టూడెంట్స్ అందరికీ అమెరికాలో సోషల్ సెక్యురిటీ వస్తుందా?

అమెరికాలో సోషల్ సెక్యురిటీ నంబర్ (ఎస్.ఎస్.ఎన్.) లేకపోతే అసలు ఏ పనీ జరగదు. అక్కడ బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే డబ్బు కంటే ముందు ఎస్.ఎస్.ఎన్. అవసరం. అసిస్టెంట్ షిప్ రావాలన్నా, వర్క్ చెయ్యాలన్నా, డ్రైవింగ్ లెసైన్స్ కావాలన్నా (కొన్ని మినహాయింపులతో) ఈ నంబరు తప్పనిసరి. ఎవరి నంబరు వారికే ప్రత్యేకంగా ఉండే ఈ ఎస్.ఎస్.ఎన్.ని యు.ఎస్. సిటిజన్లు, గ్రీన్ కార్డు హోల్డర్లు, తాత్కాలిక ఉద్యోగాలు చేసే విదేశీయులు, ఇంకా మరికొందరు అర్హులైన వారికి ఇస్తారు.

వణికిస్తున్న స్వైన్ ఫ్లూ!

నాలుగు నెలల్లో స్వైన్‌ఫ్లూతో 29 మంది మృతి

17 జిల్లాలకు పాకిన వైరస్

హైదరాబాద్, విశాఖ, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ తీవ్రత

మృతుల్లో 21 మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలవారే

బెంబేలెత్తుతున్న జనం.. చోద్యం చూస్తున్న ప్రభుత్వం

రోజురోజుకూ వైరస్ విస్తరిస్తున్నా చర్యలు శూన్యం

సర్కారీ ఆసుపత్రుల్లో ఎక్కడా కనిపించని ప్రత్యేక వార్డులు

గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు

‘ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు’

గ్రూప్-1 మినహా ఏపీపీఎస్సీ నిర్వహించే మరే పరీక్షలకూ ఇంటర్వ్యూలను నిర్వహించబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ విషయమై కృష్ణయ్య నేతృత్వంలో వివిధ యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూను కలిసి చర్చలు జరిపారు. 40 కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలు లేకుండానే ఫలితాలివ్వాలని ఏపీపీఎస్సీ అధికారులను ఆదేశిస్తామని, ఈ మేరకు శుక్రవారమే ఉత్తర్వులిస్తామని హామీ ఇచ్చారని కృష్ణయ్య తెలిపారు. 

Tuesday, October 23, 2012

ఐ-20 పొడిగించడం ఆటోమాటిక్ ఏమీ కాదు

శాన్ డీగో. కాలిఫోర్నియాలో రెండవ పెద్ద నగరం. ఇటీవలే ఒక తెల్లవారు జామున ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక అపార్ట్‌మెంట్‌పై దాడిచేశారు. ఎఫ్-1 మీద ఒక పక్క కాలేజీకి వెళుతూనే ఇంకోపక్క వర్క్ ఆథరైజేషన్ లేకుండా క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న దాదాపు 40 మంది స్టూడెంట్స్ ఉంటున్నట్టు ఎవరో ఉప్పందించడంతో దాడి చేసి వాళ్లని పట్టుకున్నారు. వాళ్ల వీసాలని రద్దు చేసి 30 రోజులలోగా యు.ఎస్. నుంచి వెళ్లిపోవలసిందిగా ఆదేశించారు.

చెప్పటానికేమీ లేదు!

ప్రశ్నలతో విసిగించొద్దని మీడియా ప్రతినిధులపై ఆగ్రహం



న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: తెలంగాణ అంశం పరిష్కారం విషయంలో పురోగతి ఏదైనా ఉంటే తప్పక తెలియజేస్తామని.. ఇప్పటికైతే చెప్పటానికేం లేదని కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వయలార్ రవి పేర్కొన్నారు. ఈ సమస్యపై పదేపదే తన వెంటపడి విసిగించవద్దని మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొంటున్న వయలార్ వద్దకు తెలుగు టీవీ చానళ్ల ప్రతినిధులు వెళ్లి తెలంగాణపై ప్రశ్నలు గుప్పించారు.


అంతరిక్షంలో వంద రోజుల పండుగ....

 భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ సోమవారం అంతరిక్షంలో వంద రోజులు పూర్తి చేసుకున్నారు. ఆమె ఈ ఏడాది జూలైలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్)కి చేరుకోవడం తెలిసిందే. ‘అంతరిక్షంలో తేలియాడడం అమూల్యమైన అనుభూతి. మేం దాన్ని ప్రతిక్షణాన్ని ఆనందిస్తున్నాం’ అని సునీత సోమవారం ఐఎస్‌ఎస్‌లోని డెస్టినీ యూఎస్ లేబొరేటరీ మ్యాడ్యూల్ నుంచి ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే ఇంటిలాంటి ప్రదేశం అంతరిక్షంలోనే కాదు మరెక్కడా లేదన్నారు. ఐఎస్‌ఎస్‌లో దిండు, పరుపు లేకుండా నిద్రలోకి జారుకోవడానికి కాస్త సమయం పడుతోందని అన్నారు. ఐఎస్‌ఎస్‌లో తమ పరికరాలు అక్కడొకటీ ఇక్కడొకటీ పడి ఉన్నాయని, కొత్త వ్యోమగాములు వచ్చే లోపు వాటిని శుభ్రం చేయాల్సిన అవసరముందని చెప్పారు. 

2019 నాటికి ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి

 ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు 2019 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బి. హరిరామ్ తెలిపారు. పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆలయ సందర్శన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 38,500 కోట్లవుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీనంగర్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని సుమారు 16 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. తొలుత చీఫ్ ఇంజనీర్ హరిరామ్‌కు దేవాలయంలో అధికారులు స్వాగతం పలికారు. కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరి, పురుహూతిక అమ్మవార్లు, దత్తాత్రేయస్వామి, సాయిబాబాలను కుటుంబసభ్యులతో దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయించుకున్నా రు. అర్చకులు ఆలయచరిత్ర, విశిష్టత తెలియజేసి ఆశీర్వచనాలు అందజేశారు. 

తెలుగులో జీవో జారీ

రాష్ట్ర ప్రభుత్వం తెలుగులో జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ తెలుగులో జీవో జారీ చేశారు. అలాగే సంఘం సభ్యులుగా డాక్టర్ టి.గౌరీశంకర్, అయ్యాల సోమయాజుల గోపాలరావు, యన్.ఆర్.వెంకటేశం, వేంపల్లి అబ్దుల్ ఖాదర్‌లను నియమించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి సంఘం కాలపరిమితిని రెండు సంవత్సరాలుగా నిర్ణయించారు. అధికార భాషా వ్యవహారాలు చూసే అదనపు లేదా సంయుక్త లేదా ఉప కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

first blow of FDIs

దేశంలోని సామాన్యులపై గ్యాస్ రూపంలో ఎఫ్ డిఐ తొలిదెబ్బ పడనుంది. యూపీఏ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలతోపాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ లెక్కచేయకుండా కేంద్రం చిల్లర వ్యాపార రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతించింది. ఇది రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతుందని కేంద్రం పేర్కొంది.

Sunday, October 21, 2012

కలవరపెట్టే కండరాల నొప్పి...

కండరాల నొప్పిని వైద్యపరిభాషలో ఫైబ్రోమయాల్జియా అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ప్రైమరీ. ఇందులో కండరాల నొప్పి వేరే ఏ ఇతర కారణాల వల్ల రాదు. రెండోది సెకండరీ. ఇందులో ఇతర వ్యాధుల కారణంగా కండరాల నొప్పి వస్తుంది.

కండరాల నొప్పి లక్షణాలు:

కండరాలు కుదించుకుపోయినట్లుగా అనిపించడం
కండరాలు కొంకర్లు పోవడం
నిద్రలేచిన తర్వాత అలసటగా ఉండటం
నీరసం
శరీరం శక్తి కోల్పోయినట్లుగా అనిపించడం
కండరాల నొప్పులు
మెడ, వెన్ను, భుజాలు మొదలైనవి సున్నితంగా ఉండటం
నిద్రలేమి
ఉదయం లేచిన వెంటనే కండరాలు బిగుతుగా ఉండటం
ఆందోళన
తలనొప్పి
సమస్యల వల్ల ఉత్సాహంగా అనిపించకపోవడం
తల తిరుగుతున్నట్లుగా అనిపించడం
విరేచనాలు లేదా మలబద్దకం వంటి లక్షణాలు ఉంటాయి.

కారణాలు: 

రక్తహీనత
థైరాయిడ్ సమస్యలు
అడ్రినల్ సమస్యలు
శరీరంలో క్యాల్షియం నిల్వలు తక్కువగా ఉండటం
న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన సమస్యలు
అతిమూత్రవ్యాధి లేదా డయాబెటిస్

నిర్ధారణ పరీక్షలు: 

సీబీపీ, ఈఎస్‌ఆర్
టీ3, టీ4, టీఎస్‌హెచ్
సీరమ్ క్యాల్షియమ్
ఆర్‌బీఎస్, ఎఫ్‌బీఎస్, పీఎల్‌బీస్ పరీక్షలు
అడ్రినల్ గ్లాండ్ పరీక్షలు స్లీప్ ఆప్నియా పరీక్షలు.

చికిత్స: Joint flex gel : శరీరంలోని అన్ని కండరాలు నొప్పిగా ఉండి, నొప్పి గుచ్చినట్లుగా ఉండటం, మ్యూకస్ బెంబ్రేన్స్ పొడిగా ఉండటం, నోరు తడారిపోయినట్లుగా ఉండి దాహం ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలుంటే ఈ మందును ఆలోచించవచ్చు.

Jointflex tab : అధిక శ్రమ, అధికమైన బరువు ఎత్తడం వంటి పనులు చేశాక వచ్చే సమస్యలకు ఇది మంచి మందు. ముఖ్యంగా కీళ్లు, కండరాల మీద బాగా పనిచేస్తుంది. చల్లగాలిని భరించలేకపోవడం, కాళ్లు పట్టేసినట్లుగా ఉండటం వంటి లక్షణాలకు ఇవ్వాల్సిన మందు.

Calicimax : కండరాలు, కీళ్ల చుట్టూ ఉండే పొరల మీద మంచి ప్రభావం చూపుతుంది. వాతరోగం (గౌట్) తత్వం కలవారికి, శరీరంలోపల చల్లగా అనిపిస్తున్న వారికి,


Sorbiogel:  రాత్రి ఎక్కువసేపు నిద్రపట్టనివారికి, కాళ్లూ, చేతుల్లో పిన్ను గుచ్చినట్లుగా అనిపించేవారికి సూచించాల్సిన మందు.

‘బ్రా’బోయ్..!

ప్రఖ్యాత విక్టోరియా సీక్రెట్ కంపెనీ తయారుచేసిన ఈ బ్రా రేటు వింటే మీరనే మాట ఇదే. ఎందుకంటే.. 5,200 కెంపులు, నీలాలతో రూపొందించిన ఈ ఫ్లోరల్ ఫ్యాంటసీ బ్రా రేటు రూ.13 కోట్లు! మధ్యలో పుష్పం ఆకారంలో ఉన్న 20 క్యారెట్ల వజ్రాన్ని అందంగా అమర్చారు. దీనికి మ్యాచింగ్ బెల్ట్ కూడా ఉంది. డిసెంబర్ 4న జరగబోయే విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షోలో ప్రముఖ మోడల్ అలెగ్జాండ్రా అంబ్రోసియో దీన్ని ప్రదర్శిస్తారు.

నత్తి ఉన్నా.. అనర్గళంగా...


నత్తి సమస్య ఉన్నవారు కూడా అనర్గళంగా మాట్లాడేందుకు ఉపయోగపడే ఓ వినూత్న పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపీ పరిశోధకులు కనుగొన్నారు. వర్సిటీకి చెందిన కమ్యూనికేషన్ సెన్సైస్, డిజార్డర్స్ విభాగం ప్రొఫెసర్ గ్రెగ్ స్నైడర్ తనకు నత్తి ఉన్నా, గొంతు నుంచి మాటలు వెలువడడాన్ని అనుభూతి చెందుతూ తడబడకుండా మాట్లాడటం నేర్చుకున్నారు. 

తాను అనుసరించిన విధానం ఆధారంగానే సెల్‌ఫోన్ అంత సైజులో ఉండే ఈ పరికరాన్ని తయారుచేసినట్లు ఆయన వెల్లడించారు. బ్యాటరీతో పనిచేసే ఈ పరికరాన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా వాడేందుకు వీలుందన్నారు. నత్తిని పోగొట్టేందుకు చేసే ఇతర చికిత్సల కన్నా దీనిని వాడటం సులభమన్నారు. మాట్లాడేటప్పుడు గొంతులో కలిగే ప్రకంపనలను అనుభూతి చెందుతూ, స్పర్శసంబంధమైన ఫీడ్‌బ్యాక్‌ను పొందానని, తద్వారా నత్తిని చాలావరకూ జయించానని తెలిపారు. ఈ పరికరం సహాయంతో నత్తి ఉండేవారు కూడా తాము మాట్లాడేటప్పుడు గొంతులో కలిగే ప్రకంపనలను అనుభూతి చెందుతారని, తద్వారా వారి మాటల్లో తడబాటు తగ్గుతుందన్నారు. ఈ పరికరం నత్తిని నివారించకపోయినా, దాని తీవ్రతను మాత్రం తగ్గిస్తుందన్నారు.

దిగివస్తున్న బంగారం ధరలు


అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నెల రోజుల కనిష్ఠ స్థాయికి దిగి వచ్చింది. అమెరికా, యూరోప్‌ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల వార్తల కారణంగా డాలర్‌ బలపడింది. ఈ కారణంగా బంగారం ధర తగ్గింది. ఈనెల మొదటి వారంలో 1800 డాలర్ల సమీపంలోకి వెళ్లిన ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 1725 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. షార్ట్‌ టర్మ్‌ కోసం బంగారంలో పెట్టుబడులు పెట్టిన స్పెక్యులేటర్లు లాభాలు స్వీకరిస్తుండటం కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణమని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.




1600 డాలర్ల స్థాయి నుంచి వేగంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నెల కిందట 11 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అంటే 1800 డాలర్ల సమీపానికి వచ్చింది. ఇప్పుడు మళ్లీ 1600 డాలర్ల స్థాయికి వెళ్లేలా ఉందని అనలిస్టులు చెబుతున్నారు. సాధారణంగా దసరా, దీపావళి సమయంలో బంగారం ధర పెరుగుతుంటుంది. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మన రూపాయల్లో చూస్తే 10 గ్రాముల ధర దాదాపు 33 వేల రూపాయల దాకా వెళ్లింది. ప్రస్తుతం ఎంసీక్స్ లో 10 గ్రాముల ధర 100 రూపాయల దాకా నష్టపోతూ 31,200లకు సమీపంలో ట్రేడవుతోంది. అదే సమయంలో కేజీ వెండి ధర 100 రూపాయల దాకా పెరుగుతూ 59,900లకు సమీపంలో ట్రేడవుతోంది.

పలువురు తెలంగాణవాదుల అరెస్ట్

పాలమూరులో చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటారనే నెపంతో పోలీసులు సోమవారం తెలంగాణవాదులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. నారాయణపేటలో బీజేపీ రాష్ట్ర తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్‌ నాగురావు నామాజీతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు బీజేపీ నేతల ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

పట్టాలు తప్పిన కావేరి ఎక్స్ ప్రెస్

చిత్తూరు జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున చెన్నై- కావేరీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. మైసూరు నుంచి చెన్నై వెళుతున్న కావేరీ ఎక్స్‌ప్రెస్‌ కుప్పం మండలం మల్లానూరు పులికొండ వద్ద ఈరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. రైల్వే ట్రాక్ పై కొండ చరియలు పడటంతో ఇంజన్ భాగం దెబ్బతింది. ఆరు బోగీలకు ఇంజన్ తో లింకు తెగిపోయింది. ట్రాక్ పై బోగీలు ఒరిగిపోవటంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


కాగా ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను మల్లనూరు రైల్వేస్టేషన్ కు తరలించారు. వీరిని ప్రత్యేక రైలులో చెన్నైకి చేర్చేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే అన్ని రైళ్లు రద్దయ్యాయి. కాగా చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

MILK STANDARDS POOR IN.........

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పట్టణాల్లో వినియోగిస్తున్న పాలలో 68% వరకు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రమాణాలకు అనుగుణంగా లేనివేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇందులో 66% వరకు విడిగా(లూజ్) అమ్మే పాలేనని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2011లో జరిపిన సర్వేలో తేలినట్లు పేర్కొంది. కల్తీ, సింథటిక్ పాలతో పాటు పలు డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను అరికట్టాలన్న కొందరి పిటిషన్ నేపథ్యంలో.. సుప్రీం నోటీసుతో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. పాలను నీటితో కల్తీ చేయడమనేది సర్వ సాధారణ ప్రక్రియగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్వే పేర్కొంది. పాలపొడితో పాటు గ్లూకోజ్‌ను కలపడం ప్రమాణాలు లోపించడానికి ప్రధాన కారణమంది. డిటర్జెంట్ కలుపుతున్నట్లు తనిఖీలో తేలిందని వివరించింది. గ్రామాల్లో 83% వరకు లూజ్ పాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని తెలిపింది.

బాదుషా

మైదా .................................250 గ్రా.


డాల్టా లేదా వెన్న .............. 3 టీ.స్పూ.
పెరుగు ............................  100 గ్రా.

వంటసోడా ........................ చిటికెడు

ఉప్పు ............................... చిటికెడు

చక్కెర ............................. 500 గ్రా.

యాలకుల పొడి ............1/2 టీ.స్పూ.

నూనె .........................వేయించడానికి

ఇలా చేయాలి

మైదాలో ఉప్పు, సోడా వేసి జల్లించాలి. ఇందులో కరిగించిన డాల్టా లేదా వెన్న లేదా నెయ్యి వేసి కలపాలి. తర్వాత పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా తడిపి ఒక గంట నాననివ్వాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజులో ముద్దలా చేసుకుని కొద్దిగా వెడల్పు చేసి మధ్యలో వేలితో గుంతలా చేయాలి. ఇలా చేసుకున్నవి వేడి నూనెలో నిదానంగా బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.

పక్కన చక్కెరలో అర కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేలా మరిగించి యాలకుల పొడి కలిపి మూత పెట్టి ఉంచాలి. వేయించిన బాదుషాలను ఈ పాకంలో వేసి పది నిమిషాలు నాననిచ్చి తీసి, విడిగా ప్లేట్లో పెట్టుకోవాలి.

క్యారట్ పూర్ణాలు

క్యారట్ తురుము .............................. 1 కప్పు
చక్కెర ............................................... 1/4 కప్పు
యాలకుల పొడి ........................ 1/2 టీ.స్పూ.

నెయ్యి - 3 టీ.స్పూ.

మినప్పప్పు - 1 కప్పు

ఉప్పు - చిటికెడు

నూనె - వేయించడానికి

వండే విధం

మినప్పప్పు కడిగి నీళ్లుపోసి మూడు గంటలు నానబెట్టి మెత్తగా కాటుకలా రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసి కలిపి మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా కలిపి పెట్టుకోవాలి. ప్యాన్‌లో నెయ్యి వేడి చేసి క్యారట్ తురుము వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పంచదార వేసి ఉడికించాలి. మొత్తం ఉడికి దగ్గర పడ్డాక యాలకుల పొడి కలిపి దింపేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. క్యారట్ ఉండలను ఒక్కొక్కటిగా పప్పు మిశ్రమంలో ముంచి వేడి నూనెలో వేయాలి. అన్నివైపులా బంగారు రంగు వచ్చేవరకు వేపుకుని తీసేయాలి.

నవరాత్రి వంటలు..........కట్టె పొంగలి

బియ్యం - 250 గ్రా.

పెసరపప్పు - 100 గ్రా.

మిరియాలు

- 1/2 టీ.స్పూ.

జీలకర్ర - 1 టీ.స్పూ.

కరివేపాకు - 2 రెబ్బలు

ఉప్పు - తగినంత

నెయ్యి - 4 టీ.స్పూ.

నూనె - 3 టీ.స్పూ.

ఇంగువ - చిటికెడు

పచ్చిమిర్చి - 2

ఇలా చేద్దాం

బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఒక గినె్నలో నూనె, సగం నెయ్యి వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేసి దోరగా వేగిన తర్వాత కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపి, మూడు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో తగినంత ఉప్పు వేయాలి.

నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం, పప్పు నీళ్లనుండి తీసి వేసి మెత్తగా ఉడికించాలి. చివరిలో మిగిలిన నెయ్యి వేసి దింపేయాలి.

ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహాలు (world telugu conference)

తిరుపతి వద్ద 90 ఎకరాల్లో ఏర్పాట్లు

తిరుపతిలో నిర్వహించే నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహాలు ముమ్మరం చేశామని ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కార్యదర్శి బలరామయ్య తెలిపారు. రవీంద్రభారతి కళాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభల ఏర్పాట్ల గురించి వివరించారు."డిసెంబర్‌లో 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల కోసం జూన్ నుంచే పనులు ప్రారంభించాం. తిరుపతి వద్ద 90 ఏకరాల స్థలాన్ని మహాసభల వేదిక ప్రాంగణంగా నిర్ణయించాం.

మీ ఫోన్.. వారి రక్తం!

కాంగోలో తీవ్రవాద ముఠాల దారుణ కాండ..

కుటుంబ సభ్యుల ఎదుటే అత్యాచారాలు, హత్యలు

బాలబాలికలతో వెట్టి చాకిరీ.

గనుల కోసమే ఆకృత్యాలు

ఆ లోహాలతో సెల్‌ఫోన్ సహా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ..

ఏడాదికి 900 కోట్లు..

అన్ని తీవ్రవాద కార్యకలాపాలకే!..

                                                             


                                                          
కాంగో నుంచి ఖనిజాలు కొనొద్దు: 'సేవ్ ది కాంగో'!


'బ్లడ్ ఇన్ మొబైల్' పేరిట లఘు చిత్రం.. 
  
ఇంటర్‌నెట్‌లో విడుదల

మీరు కొన్న టాబ్లెట్ కంప్యూటర్ విలువెంతో తెలుసా..? కాంగో దేశంలో ఒక మహిళ మానం!? అదే మీ ల్యాప్‌టాప్ కోసం ఖర్చయ్యిందెంతో తెలుసా..? ఆ దేశంలో ఒక మనిషి ప్రాణం!? మనం కొంటున్న సెల్‌ఫోన్ విలువ.. ఆవిరవుతున్న ఒక బాల్యం..!? ఇంతేకాదు.. మనం కొనే ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువు వెనుకా.. కాంగో దేశ ప్రజల కన్నీరు ఉంటుంది. ఆ దేశంలో ఓ నేరంతో అది సంబంధాన్ని కలిగి ఉంటుంది.

Saturday, October 20, 2012

మీ పాలసీ కరెక్టేనా..?

ముందుచూపు ఉన్న ముకుందరావుకి పాప పుట్టింది. ఇరవై ఏళ్ల తర్వాత అమ్మాయి పెళ్లి ఘనంగా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే అమ్మాయి పేరుపై ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు. అదే విషయాన్ని తన మిత్రుడు సుబ్బారావు చెవిన వేశాడు. ఆ మాట విన్న వెంటనే ఎల్‌ఐసీలో ‘కోమల్ జీవన్’ పాలసీ తీసుకోమని సలహా ఇచ్చాడు సుబ్బారావు. అప్పటికే ఆ పథకం గురించి కొంత అవగాహన ఉన్న ముకుందరావు వెంటనే పాలసీ తీసుకున్నాడు. కాని... ఈ మధ్యనే ముకుందరావుకి తాను చేస్తున్న పెట్టుబడులు, లక్ష్యాలకు అనుగుణంగా లేవన్న అనుమానం వచ్చి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్(సీఎఫ్‌వో)ను కలిశాడు. పిల్లల ఉన్నత చదువుల ప్రణాళికల గురించి చెప్పిన తర్వాత, అమ్మాయి పెళ్లి కోసం కోమల్ జీవన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ సంగతి చెప్పాడు. ఆ మాట విన్నవెంటనే, పెళ్లి కోసమైతే ఈ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆపేయమని సలహా ఇచ్చాడు సీఎఫ్‌వో. ఇంత మంచి పథకంలో ఇన్వెస్ట్‌మెంట్ ఆపేయమంటారేంటి? అన్నట్టుగా సందేహంగా చూశాడు ముకుందరావు.



అతని అనుమానాన్ని పసిగట్టిన సీఎఫ్‌వో ‘కోమల్ జీవన్’ పాలసీ మంచిదే కాని అది మీ లక్ష్యానికి సరిపోదన్నాడు. ‘కోమల్ జీవన్’ ఒకేసారి భారీ మొత్తాన్ని అందించదని, మనీబ్యాక్ రూపంలో 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలకు వరకు ప్రతీ రెండేళ్లకు ఇస్తుంది కాబట్టి ఈ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆపేయమన్నాడు. మీ లక్ష్యానికి ఇదే సంస్థకు చెందిన ‘‘చైల్డ్ డిఫర్డ్ ఎండోమెంట్ వెస్టింగ్ ఎట్ 21 బాగుంటుంది... ఇన్వెస్ట్‌మెంట్‌ను అందులోకి మార్చుకోండి’’ అని సూచించాడు. ముకుందరావుకు దూరదృష్టి ఉంది కాబట్టి సీఎఫ్‌వో దగ్గరికెళ్లి తన పెట్టుబడులను ఒకసారి చెక్ చేసుకున్నాడు. కాని మనలో చాలామంది పిల్లల కోసం రకరకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారే కాని అవి చివరికి వారి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో పరిశీలించుకోరు.

ఇప్పుడు పిల్లలు పుట్టగానే వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాని ఇందులో అనేక మంది ఆ పథకం తమ ఆర్థిక లక్ష్యానికి సరిపోతుందా లేదా అన్న విషయాన్ని పరిశీలించుకోకుండా పక్కింటి వాళ్లు చెప్పారనో, లేదా బీమా ఏజెంట్ సిఫార్సు చేశారనో ప్రారంభిస్తుంటారు. ఫలితం ఏమంటే.... తీరా అవసరం వచ్చినప్పుడు అవి అక్కరకురాక ఇబ్బందులు పడుతుంటారు. అందుకనే ఏదైనా పథకం ఎంచుకునేటప్పుడు అది తమ లక్ష్యానికి అనువుగా ఉందో లేదో అన్న విషయాన్ని ముందే పరిశీలించాలి. పిల్లల కోసం పాలసీలు తీసుకునేటప్పుడు గమనించాల్సిన అంశాలను పరిశీలిద్దాం.



లక్ష్యంపై స్పష్టత అవసరం...

చాలా మంది తమ పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రధానంగా రెండు లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఒకటి వారి చదువుల కోసమైతే మరొకటి పిల్లల పెళ్లి ఖర్చుల కోసం. ఈ రెండూ భిన్నమైన లక్ష్యాలు కాబట్టి వీటికి ఒకే రకమైన పాలసీలు తీసుకోలేం. ఉదాహరణకు ఉన్నత చదువుల కోసమైతే పిల్లల వయస్సు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకేసారిగా లేక విడతలు విడతలుగా కొంత మొత్తం వచ్చే పాలసీని ఎంచుకోవచ్చు. అదే పిల్లల వివాహ ఖర్చుల కోసమైతే ఒకేసారి మొత్తం చేతికి వచ్చే పాలసీని మాత్రమే ఎంచుకోండి. ఎల్‌ఐసీ ‘జీవన్ అంకుర్’, చైల్డ్ డిఫర్డ్ ఎండోమెంట్ వెస్టింగ్ ఎట్ 21, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్మార్ట్ కిడ్ రెగ్యులర్ వంటి పాలసీలు అనువుగా ఉంటాయి.



బీమా పథకంపై అవగాహన

పిల్లల విద్యా వ్యయం ఏటా 10% చొప్పున పెరుగుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో తక్కువ రాబడినిచ్చే బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. సాధారణంగా పిల్లల కోసం నిర్దేశించిన బీమా పథకాలు 5-6% మించి రాబడిని ఇవ్వడం లేదు. కాబట్టి పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుంటే బీమాలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది వివేకవంతమైన నిర్ణయంగా కనిపించదు. అందుకే చాలామంది సీఎఫ్‌వోలు ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా బీమా పథకాలను సిఫార్సు చేయరు. పెట్టుబడుల గురించి ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చే ఆర్థికవేత్తలు అందుబాటులో లేనివారు రాబడి తక్కువగా ఉన్నా అనేక ఇతర ప్రయోజనాలున్న బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. తల్లిదండ్రులకు లభించే బీమా రక్షణ, పన్ను ప్రయోజనాలు, రిస్క్ లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

రిస్క్ చేయగలిగితే...

స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌పై అంతగా అవగాహన లేకపోయినా కొద్దిగా రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే ఎండోమెంట్ పాలసీల కంటే అధిక రాబడి పొందడానికి వీలుంటే యులిప్స్ వైపు దృష్టి పెట్టొచ్చు. పిల్లల ఆర్థిక అవసరాలు సాధారణంగా దీర్ఘకాలిక లక్ష్యాలు కాబట్టి వాటి కోసం ప్రత్యేకంగా రూపొందించిన యులిప్స్ పథకాలను పరిశీలించొచ్చు. ఇవి ఒక లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేసేవి కాబట్టి పూర్తి రిస్క్ కాకుండా తక్కువ రిస్క్ ఉండే బ్యాలెన్స్‌డ్ పథకాలను ఎంచుకోండి. దీనివల్ల అటు బీమా రక్షణ, ఇటు పన్ను ప్రయోజనాలతో పాటు ఎండోమెంట్ పాలసీల కంటే అధిక రాబడిని పొందే అవకాశం ఉంటుంది. మాక్స్‌లైఫ్ సురక్ష-2, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్ యంగ్‌స్టార్-2, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్మార్ట్‌కిడ్, ఎస్‌బీఐ స్మార్ట్ స్కాలర్ వంటివి ఈ కోవలోకి వస్తాయి.

వైవర్ రైడర్ మరవద్దు

పిల్లల బీమా పాలసీలతో పాటు అనేక రైడర్లు అందుబాటులో ఉన్నా వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ లేదా పేయర్ బెనిఫిట్ రైడర్ తీసుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల ప్రీమియం చెల్లించే తండ్రి/తల్లి/సంరక్షకులకు అనుకోని సంఘటన ఏదైనా జరిగితే పాలసీ రద్దు కాకుండా భవిష్యత్తు ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీ కొనసాగుతుంది. రెగ్యులర్ పాలసీకి చెల్లించే ప్రీమియానికి అదనంగా కొంతమొత్తం చెల్లించడం ద్వారా దీన్ని పొందవచ్చు. తద్వారా పిల్లల ఆర్థిక లక్ష్యానికి ఎలాంటి విఘాతం ఏర్పడదు.

Friday, October 19, 2012

పండుగ వంటలు




పెరుగు అన్నం


కావలసినవి:

బియ్యం - కప్పు, పెరుగు - 3 కప్పులు

ఉప్పు - తగినంత, అల్లం - చిన్నముక్క (తరగాలి)

కొత్తిమీర తరుగు - టీ స్పూన్

దానిమ్మ గింజలు - తగినన్ని



పోపుకోసం...

కరివేపాకు - 2 రెమ్మలు, మినప్పప్పు - టీ స్పూన్

ఆవాలు - అర టీ స్పూన్

ఎండుమిర్చి - 2 (మధ్యకు విరవాలి)

పచ్చిమిర్చి - 2 (నిలువుగా కట్ చేయాలి)

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ - తగినంత



తయారి:

అన్నం మెత్తగా వండి, గరిటెతో బాగా కలిపి, చల్లారనివ్వాలి.

పెరుగులో ఉప్పు వేసి, చల్లారిన అన్నంలో కలపాలి.

దీంట్లో అల్లం, పచ్చిమిర్చి కలపాలి.
స్టౌ పై కడాయి పెట్టి, నెయ్యి వేసి ఆవాలు, మిన ప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేగనివ్వాలి.
ఈ పోపును పెరుగన్నంలో కలపాలి. అరకప్పు పాలు వేడి చేసి పెరుగన్నంలో కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి.
కొత్తిమీర, దాన్నిమ్మ గింజలతో అలంకరించాలి.



సజ్జముద్దలు

కావలసినవి:

సజ్జ పిండి - 2 కప్పులు

బెల్లం తరుగు - కప్పు

నీళ్లు - ముద్ద చేయడానికి

తగినన్ని

ఏలకుల పొడి - చిటికెడు

డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్‌మిస్) - 2 టీ స్పూన్లు

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

తయారి:

నీళ్లు వేడి చేసి, సజ్జ పిండిలో కలిపి ముద్ద చేయాలి. కావల్సిన పరిమాణంలో ముద్ద తీసుకొని, రొట్టె చేసి, పెనం మీద రెండువైపులా కాల్చాలి.

వేడిగా ఉన్నప్పుడే నీళ్లు అద్దుకుంటూ చేత్తో ముక్కలు ముక్కలు చేయాలి. తర్వాత రోట్లో వేసి దంచాలి.

పెనం మీద నెయ్యి, బెల్లం, ఏలకుల పొడి, రొట్టె ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి, దించాలి.
కావలసిన పరిమాణం రొట్టెముక్కల పొడిని తీసుకొని, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి.



ఎండు కొబ్బరి అన్నం



కావల్సినవి:

బియ్యం - 2 కప్పులు (అన్నం వండి, బేసిన్‌లో వేసి, విడదీసి, చల్లారనివ్వాలి), పసుపు - చిటికెడు, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, ఎండుకొబ్బరి పొడి - అర కప్పు, కారం - అర టీ స్పూన్, శనగపప్పు - టేబుల్ స్పూన్, మినప్పప్పు - టేబుల్ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, ఎండుమిర్చి - 4, పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేయాలి), వేయించిన పల్లీలు - కొన్ని, నూనె - 3 టేబుల్ స్పూన్లు



తయారి:

చల్లారిన అన్నంలో ఉప్పు, టేబుల్ స్పూన్ నూనె, కొబ్బరిపొడి, కారం, కొన్ని కరివేపాకు ఆకులు వేసి కలపాలి.

పెనం మీద మిగిలిన నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి నిమిషం సేపు వేయించాలి. తర్వాత పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరికాసేపు వేయించాలి.

ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి.



పులిహోర


కావలసినవి:

బియ్యం - 2 కప్పులు, పసుపు - 1/2 స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, చింతపండు గుజ్జు - పావు కప్పు, బెల్లం తరుగు - టీ స్పూన్, శనగపప్పు, మినప్పప్పు - టేబుల్ స్పూన్ చొప్పున, ఆవాలు-టీ స్పూన్, ఎండుమిర్చి-4, పచ్చిమిర్చి - 4 ఇంగువ - పావు టీ స్పూన్, నువ్వులపొడి - టేబుల్ స్పూన్, పల్లీలు - కొన్ని, నూనె - 3 టేబుల్ స్పూన్లు, అల్లం - చిన్న ముక్క

తయారి:

అన్నం వండి చల్లార్చి, అందులో పసుపు, ఉప్పు, టేబుల్ స్పూన్ నూనె, కొన్ని కరివేపాకు ఆకులు వేసి కలపాలి.

కడాయిలో మిగిలిన నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, పప్పులు, పల్లీలు వేసి నిమిషం సేపు వేయించాలి. కోసిన పచ్చిమిర్చి, దంచిన అల్లం, ఇంగువ, కరివేపాకు వేయించాక చింతపండు గుజ్జు, బెల్లం వేసి ఉడికించి, తీయాలి. ఈ మిశ్రమాన్ని, నువ్వులపొడి అన్నంలో వేసి కలపాలి.



చపాతీ ముద్దలు

కావలసినవి:

గోధుమపిండి - 2 కప్పులు

బెల్లం తరుగు - కప్పు

నీళ్లు - ముద్ద చేయడానికి తగినన్ని

ఏలకుల పొడి - చిటికెడు

డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్‌మిస్) - 2 టీ స్పూన్లు

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు


తయారి:

పిండిలో నీళ్లు పోసి, ముద్ద చేయాలి. కావల్సిన పరిమాణంలో ముద్ద తీసుకొని, చపాతీ చేసి, పెనం మీద రెండువైపులా కాల్చాలి.



చపాతీని ముక్కలు చేసి, రోట్లో వేసి దంచాలి.



పెనం మీద నెయ్యి, బెల్లం, ఏలకుల పొడి, చపాతీ ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి, దించాలి.



కావలసిన పరిమాణంలో ఈ పొడిని తీసుకొని, బాదం, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి.

యు.ఎస్ వెళ్లిన తర్వాతే ఎఫ్-1 అసలు కథ!

స్టూడెంట్ వీసా ఇవ్వడానికి కాన్సులేట్‌లు చూసే ప్రధానమైన రిక్వైర్‌మెంట్‌లలో విద్యార్థికి అమెరికాలో ఉండడానికి తగినంత ఫండ్ ఉండాలి. ఆర్థిక వనరులు చూపలేనివారిని ‘‘పొటెన్షియల్ ఇమిగ్రెంట్’’ గా భావించి వీసా నిరాకరిస్తారు. వీసా కోసం ఏదో ఒక అకౌంట్‌లో డబ్బు చూపించి ఆ తర్వాత చేతిలో చిల్లిగవ్వ లేకుండా అమెరికాలో దిగే విద్యార్థి పీకల లోతు కష్టాలలో కూరుకుపోక తప్పదని పేరెంట్స్ గుర్తించాలి. మీ దగ్గర సొంత డబ్బు లేకపోతే జాతీయ బ్యాంకుల దీర్ఘకాలిక విద్యా రుణాలకు ప్రయత్నించండి.



ఎఫ్-1 అసలు కథ!

ఇక్కడ యుఎస్ కాన్సులేట్ నుంచి ఎఫ్-1 వీసా వచ్చిన వెంటనే అమెరికా వెళతారు. అయితే వెళ్లిన తర్వాత ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎఫ్-1 కథ ఎలా తిరగడుతుందో ఒక ఉదాహరణ చూడండి.



శ్రీధర్ న్యూయార్కులో ఒక యూనివర్సిటిలో చేరాడు. ఆర్థిక వనరులు అంతగా లేకుండా వెళ్లడం వల్ల అప్పుడప్పుడు క్లాసులు వదిలేసి వర్క్‌కి వెళ్లేవాడు. అదే అతడిని ఆఖరికి చిక్కుల్లో పడేసింది.



యు.ఎస్‌లో ఎఫ్-1లు పార్ట్ టైము క్యాంపస్ ఉద్యోగాలని నిర్ణీత గంటలకు మించకుండా, డి.ఎస్.ఓ. (స్కూలు అధికారి) అనుమతితోనే జరగాలి. ‘‘సేవిస్’’ డేటా బేస్‌లో దాని వివరాలు అప్‌డేట్ అవుతూ ఉండాలి. శ్రీధర్ ఇక్కడే దెబ్బ తిన్నాడు. డి.ఎస్.ఓ. తో అతనికి సరైన కమ్యూనికేషన్ కుదరలేదు. క్యాంపస్ జాబ్ గురించి ఎప్పటికప్పుడు డి.ఎస్.ఓ.తో చర్చించలేకపోయాడు. తను ఎక్కువ గంటలు పని చేస్తున్నట్టు ఎవరో అంటే యూనివర్సిటీ ఆఫీసులో అడిగొచ్చాడే గాని డి.ఎస్.ఓ. దగ్గరకు వెళ్లలేదు. యూనివర్శిటీ అబ్జెక్షన్ పెట్టేవరకు భయపడాల్సింది ఏమీ లేదని ఎవరో చెప్పింది నమ్మాడేగాని తన స్కూలు అధికారిని కన్సల్ట్ చెయ్యలేదు. దానితో ఒకనాడు డి.ఎస్.ఓ. అతడిని పిలిచి ‘‘ఫుల్ కోర్స్ లోడ్’’ (పూర్తి కోర్సు) చెయ్యలేక పోవడం వల్ల ‘‘సేవిస్’’ నిబంధనల క్రింద తను ‘‘అవుటాఫ్ స్టేటస్’’ అయ్యాడని, అతని ఎఫ్-1 వీసా రద్దయిందని, యు.ఎస్. నుంచి తక్షణం వెళ్లిపోవాలని చెప్పాడు.

అప్పీళ్ల కోసం తిరుగుతూ దేశం విడిచే గడువుని కూడా శ్రీధర్ పట్టించుకోకపోవడంతో అతడి మీద రిమూవల్ ప్రొసీడింగ్స్ అమలుచేసి బలవంతంగా అమెరికా నుంచి పంపేశారు. కష్టపడి సంపాదించుకున్న స్టూడెంట్ వీసాకి చిక్కులు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తల్ని పాటించాలి. మీ డి.ఎస్.ఓ. తో సత్సంబంధాలు కొనసాగించాలి సెవిస్ రూల్స్‌ని జవదాటని క్రమశిక్షణ పాటించాలి తొలి విద్యా సంవత్సరంలో ఆఫ్ క్యాంపస్ జాబ్ చెయ్యకూడదు ఆన్ క్యాంపస్ వర్క్ కూడా డి.ఎస్.ఓ. అనుమతితోనే చెయ్యాలి ఎఫ్-1 మీద యు.ఎస్. చేరిన తర్వాత 30 రోజులలోగా యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకోవాలి మందస్తు అనుమతి లేకుండా ఒక్క క్లాసుకి కూడా గైర్హాజరు కాకూడదు స్కూల్ జరిగేటప్పుడు వారానికి 20 గంటలకి మించి వెకేషన్‌లో వారానికి 40 గంటలకి మించి ఆన్ క్యాంపస్ జాబ్ చెయ్యకూడదు ఐ-20 లో వేసిన తేదీలోగా కోర్సు పూర్తిచెయ్యలేకపోతే ముందుగానే ఎక్స్‌టెన్షన్ పొంది తీరాలి ఒక స్కూలు నుంచి ఇంకొక స్కూలుకి మారాలంటే సెవిస్ నిబంధనల్ని పాటించితీరాలి యు.ఎస్సీ.ఐ.ఎస్ అనుమతించిన స్కూలులో మాత్రమే చదవాలి. ఏ ఒక్క నిబంధనని ఉల్లఘించినా ఎఫ్ వీసా రద్దవుతుంది.

గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రెఫ్లక్స్ డిసార్డర్ Gastroesophageal reflux disease (GERD) ఉన్నవారికి

GERD(గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రెఫ్లక్స్ డిసార్డర్) ఉన్నవారికి ఇది.... మన జీవన విధానంలో మార్పులు, ఉద్యోగరీత్యా ఉండే ఒత్తిడులు... వీటి వల్ల చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సంబంధిత మందులు వాడటం వల్ల అప్పడికప్పుడు ఉపశమనం ఉంటుంది కానీ పరిష్కారం అయినట్లు కాదు. మీకు ఈ సమస్య ఎలా వచ్చిందో అర్థం చేసుకోగలిగితే శాశ్వత పరిష్కారం కూడా అర్థమవుతుంది.

సాగరళం..


 హుస్సేన్ సాగర్ జలాశయంలో కాలుష్య స్థాయి ఆందోళన కలిగించే రీతిలో పెరిగింది. జలాశయంలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరగడంతో జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వృక్ష, జంతు ప్లవకాలు, ఇతర జలచరాల మనుగడకు అత్యావశ్యకమైన ‘కరిగిన ఆక్సీజన్ (డీఓ)’స్థాయిపడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాల ప్రకారం ఈ జలాశయం అత్యంత కాలుష్యకాసారమైన ‘ఇ’ కేటగిరీ జలాశయంగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే కాలుష్య స్థాయి గణనీయంగా పెరిగి నట్లు పీసీబీ తాజా నివేదిక బట్టబయలుచేసింది. సెప్టెంబరులో గణేష్ నిమజ్జనానికి ముందు, ఆ తరవాత జలాశయంలో వివిధ కాలుష్య ప్రమాణాల స్థాయిలను తాజా నివేదికలో పొందుపరిచారు. జాతీయ నీటి నాణ్యతా పర్యవేక్షణ కింద ఈ నివేదిక సిద్ధంచేసినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 17కు ముందు, 26 నుంచి 29 తేదీల మధ్యన కాలుష్య ప్రమాణాల స్థాయిలను లెక్కించి ఈ నివేదికలో పేర్కొన్నారు. ఐదు ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి పరిశోధించామన్నారు.



నీటి నమూనాలు స్వీకరించిన ప్రాంతాలివే..

ఎన్‌టీఆర్ పార్క్ ఎదురుగా(ప్లాట్‌ఫాం నెం.1, ప్లాట్‌ఫాం నెం.2), నక్లెస్‌రోడ్, లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్, బుద్ధవిగ్రహం (సాగరం నడిబొడ్డున ఉన్నది) ప్రాంతాల్లో నమూనాలు సేకరించారు

.

పీసీబీ నివేదిక వెల్లడించిన అంశాలివే..



నిమజ్జనానికి ముందు, ఆ తర్వాత జలాల గాఢత (పీహెచ్) విలువ 7.38 - 8.1 మధ్య ఉంది.



టీడీఎస్ (నీటిలో కరిగిన ఘన పదార్థాలు) విలువ లీటరు నీటికి 550 నుంచి 853 మి.గ్రా. ఉంది. లుంబినీ పార్క్ వద్ద అత్యధికంగా, బుద్ధవిగ్రహం వద్ద తక్కువగా నమోదైంది.



డీఓ పరిమాణం తగ్గడంతో జలచరాల మనుగడ ప్రశ్నార్థకమైంది.



కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడి) ఎన్‌టీఆర్ పార్క్-ప్లాట్‌ఫాం నెం.2 వద్ద లీటరు నీటికి 85 నుంచి 210 మి.గ్రా. పెరిగింది.



బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) స్థాయి.. లీటరు నీటికి లుంబినీ పార్క్ వద్ద అత్యధికంగా 20-90 మి.గ్రా. మధ్యనుంది.



సాగర్‌లో లీటరు నీటికి సీఓడీ స్థాయి 90-100 మి.గ్రా. ఉంది.



భారలోహాల స్థాయి లీటరు నీటికి 0.01 మి.గ్రా. నమోదైంది.



నిరుడు నిమజ్జనం కంటే ఈసారి కాలుష్య స్థాయి బాగా పెరిగింది.



సీపీసీబీ హుస్సేన్‌సాగర్‌ను ‘ఇ’ స్థాయి జలాశయంగా ప్రకటించింది.



సాగరం నడిబొడ్డున కాలుష్య స్థాయి తక్కువే.



జలాశయంలో నిమజ్జనమైన విగ్రహాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది 48 గంటల్లోగా తొలగించినట్లు ప్రకటించారు.

Wednesday, October 17, 2012

పోషకాల బయోగ్రఫీ



పిజ్జాలు, బర్గర్ల వెనక పరిగెత్తి పరిగెత్తి అనారోగ్యాలతో అలసిపోయిన జనాలు ఈ మధ్య తిండి విషయంలో మళ్లీ తాతల కాలం నాటి పద్ధతులను అనుసరించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా చిరుధాన్యాలకు పెద్ద పీటవేసి, ముతక బియ్యాన్ని మురిపెంగా చూసుకుంటున్నారు. అందరూ వాడుతున్నారు కాబట్టి మేమూ వాడతాం అన్నట్టు కాకుండా. వాటిలో ఉన్న పోషకాల గురించి కాస్త తెలుసుకుంటే మంచిది. ఆ వివరాలే ఇవి...

భారత చరిత్రలో అత్యంత ధనవంతుడు చివరి నిజాం!




 
కబేరుల జాబితాలో ఆయనది ఆరో స్థానం

మొదటి స్థానంలో 14వ శతాబ్దపు ఆఫ్రికా రాజు

లండన్, అక్టోబర్ 16: 'భారత చరిత్రలో అత్యంత ధనవంతుడు ఎవరు?' ఈ ప్రశ్న వినగానే సహజంగానే టాటా, బిర్లా, అంబానీలు గుర్తుకు వస్తారు! కానీ... ఆ ఘనత దక్కించుకున్నది వీరెవరూ కాదు! భారత్‌లో అత్యంత కుబేరుడు... హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తే ఆయన సంపద రూ.12.48 లక్షల కోట్లు. హైదరాబాద్ సంస్థానాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన ఉస్మాన్ అలీఖాన్ 1967లో మరణించారు.


ప్రపంచ చరిత్రలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన ఆరో స్థానంలో నిలిచారు. 'సెలెబ్రిటీ నెట్‌వర్త్' అనే వెబ్‌సైట్ ఈ జాబితాను రూపొందించింది. 14వ శతాబ్దానికి చెందిన ఆఫ్రికా రాజు మన్సా ముసా-1 చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానం ఆక్రమించారు. ప్రస్తుత విలువ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 40,000 కోట్ల డాలర్లు. సెలెబ్రిటీ నెట్‌వర్త్ సంస్థ 'చరిత్రలోనే కుబేరులు' పేరిట మొత్తం 25 మందితో కూడిన జాబితాను రూపొందించింది. వెయ్యేళ్ల చరిత్రను... పాలకుల ఆస్తులను పరిగణనలోకి తీసుకుంది.

వయాగ్రా వృద్ధుడు




ముత్తాత కాదు.. తండ్రి  
ఖర్ఖోడా, అక్టోబర్ 16: ఆయన వయసు 96 ఏళ్లు.. ఆమె వయ సు 52 ఏళ్లు. మనవళ్లు, ముని మనవళ్లతో ఆడుకోవాల్సిన ఈ లేటు వయసులో ఆ దంపతులిద్దరూ తల్లిదండ్రులయ్యారు! బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద వయసులో తండ్రి అయిన ఘనత హర్యానాలోని సోనిపట్ సమీపంలో గల ఖర్ఖోడా గ్రామవాసి రామజిత్ రాఘవ్‌కే దక్కుతుందేమో! రెండేళ్ల క్రితం తొలిసారి మగబిడ్డను కన్న ఆయన భార్య శకుంతలాదేవి.. ఇప్పుడు రెండోసారి కూడా మరో పుత్రరత్నానికి జన్మనిచ్చింది.

జేఈఈ-2013 పై పిటిషన్‌

హైదరాబాద్, అక్టోబర్ 16: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష జేఈఈ-2013 నిబంధనల్లో మార్పులు చేయడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి హైకోర్టు మంగళవారం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కేంద్ర మానవ వనురుల శాఖ కార్యదర్శి, సీబీఎస్ఈ బోర్డు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ అపెక్స్ బోర్డుకు ఈ నోటీసులిచ్చింది.

నింగిలోకి నల్ల బెలూన్లు





ప్రధానికి తెలంగాణ వాదుల నిరసన..
నాగం ఆధ్వర్యంలో దీక్ష
హైదరాబాద్, అక్టోబర్ 16 : 'మీది విశ్వాస ఘాతుకం... అందుకే నిరసనల స్వాగతం' అంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ రాకకు నిరసనగా తెలంగాణ నేతలు ఆకాశంలోకి నల్లబెలూన్లు ఎగురేశారు. తెలంగాణ నగారా సమితి నేత, ఎమ్మెల్యే నాగం జనార్దన రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మంగళవారం జరిగిన దీక్షలో జేఏసీ భాగస్వామ్య పక్షాలు, ఇతర ఉద్యమ సంస్థల నేతలు పాల్గొన్నారు. నల్ల చొక్కాలు, బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభం కాగా... సరిగ్గా 3.35 గంటలకు నల్ల బెలూన్లను గాలిలోకి వదిలారు. దీక్ష సాయంత్రం 4.50 గంటలకు ముగిసింది. అయితే... ప్రధాని హాజరైన జీవ వైవిధ్య సదస్సుకు తెలంగాణ మీడియా ప్రతినిధులను అనుమతించకపోవటాన్ని నిరసిస్తూ బేగంపేట విమానాశ్రయానికి వెళ్తామని నాగం ప్రకటించారు. కోదండరాం, హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా ఇందిరాపార్క్-లోయర్ ట్యాంక్‌బండ్ వైపు కదిలారు. నేతలు బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లటంతో తోపులాట జరిగింది. పోలీసులు పెద్దఎత్తున వారిని చుట్టుముట్టి, అరెస్ట్ చేశారు.


ఈ సమయంలో ఒక కానిస్టేబుల్‌పై ఉద్యమకారులు చేయి చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వ్యాన్‌లో గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి తదుపరి విడిచిపెట్టారు. కాగా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్ర'దానిని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.



కాగా, "తెలంగాణ వాదులకు పాలకులు భయపడుతున్నారంటే.. మనం సగం గెలిచినట్టే లెక్క'' అని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. "ప్రధాని హైదరాబాద్‌కొస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? నిరసన తెలుపుతామన్న తెలంగాణవాదులను అడ్డుకున్నారు. చివరికి నల్ల బుగ్గలను, వాటిలో గాలి నింపటానికి ఉపయోగించిన సిలిండర్లనూ 'అరెస్ట్' చేశారు'' అని మండి పడ్డారు.



దసరా తర్వాత సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే.. వారిని ఊళ్లలోకి అడుగుపెట్టనివ్వొద్దని దీక్షకు అధ్యక్షత వహించిన నాగం జనార్దన రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ విషయంలో మోసం, దగా చేసిం ది కాంగ్రెస్సేనని విమర్శించారు. ప్రభుత్వం పోతుంది అంటేనే ఒత్తిడి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు అన్నారు. "ఎంపీలుగా మేం ఏం చేసినా ఎందుకో ఒత్తిడి రాలేదు. తెలంగాణపై తీర్మానం చేసే వరకు అసెంబ్లీకి రాబోమని 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఒక్క లేఖ రాస్తే, ప్రత్యేక రాష్ట్రం ఎలా రాదో చూస్తాం!' అని కేకే అన్నారు.



"మర్యాదగా తెలంగాణ ఇస్తే సై.. లేకపోతే కాంగ్రెస్ అంతం చూస్తాం'' అని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఇం కా కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ ముసుగులో ఐక్యంగా కొట్లాడుతామంటే నమ్మే పరిస్థితిలేదని టీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్ రావు అన్నారు. ప్రధాని మాటకు విలువలేదని, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని బీజేపీ నేత దత్తాత్రేయ అన్నారు. తెలంగాణపై అంతా టీడీపీని తప్పుపడుతున్నారని తొలుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ సంగతి తేల్చితే, టీడీపీ సంగతి ప్రజలు చూసుకుంటారని సీపీఐ నేత వెంకటరెడ్డి పేర్కొన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి

తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతిపథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరుతూ ప్రభుత్వ విప్ టి.జగ్గారెడ్డి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. జీవవైవిధ్య సదస్సులో మంగళవారం నాడు పాల్గొన్న ప్రధానమంత్రిని విప్ జగ్గారెడ్డి కలిశారు. తెలంగాణలోని పది జిల్లాల్లో వ్యవసాయమంతా వర్షాధారంపైనే సాగుతున్నదని విప్ జగ్గారెడ్డి ప్రదానికి వివరించారు. అంతేగాక సాగునీటి రంగంలో భారీ, మధ్య తరహాప్రాజెక్టులు కూడా లేవని పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ ప్రాంత రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా ప్రాణహిత-చేవెళ్ల పథకం అత్యంత అవసరమన్నారు.

చక్కెరకూ - చర్మానికీ సంబంధం ....

చర్మం యౌవనంగా ఉండాలంటే... చక్కెర తక్కువ తినాలి. చక్కెరకూ, చర్మానికీ సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? ఉంది. చక్కెర పదార్థాలు ఎక్కువగా తినేవాళ్లలో అది చర్మాన్ని బిగుతుగా ఉంచేందుకు దోహదపడే కొలాజెన్‌ను దెబ్బతీస్తుందట. ఫలితంగా చక్కెర పదార్థాలు ఎక్కువగా తినేవాళ్లలో చర్మం చాలా త్వరగా సాగడం, బిగుతుగా ఉండటం అనే గుణా(ఎలాస్టిసిటీ)న్ని కోల్పోతుందట. ఈ విషయాన్ని ఇటీవలే యూ.ఎస్.లోని డార్ట్‌మౌత్ మెడికల్ స్కూల్ పరిశోధకులు తెలుసుకున్నారు. అందుకే దీర్ఘకాలం యౌవనంగా ఉండాలనుకున్నవారు తీపి పదార్థాలు కాస్త తక్కువ తీసుకోవడం మంచిది.

షూ కొనే వేళేది?

మంచి షూ వేసుకుంటే హుందాతనం అంతా ఇంతా కాదు. మరి మనం వేసుకునే షూ సౌకర్యవంతంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏ వేళలో కొనడం ఉత్తమం? ఇదీ ఒక ప్రశ్నేనా అనుకోకండి. వ్యాయామం చేసే వారికి ఇది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తూ ఉండటం వల్ల అయ్యే వ్యాయామంతో అన్ని కండరాల్లాగే కాలి కండరాలు కూడా స్వల్పంగా పెరుగుతాయట. అందుకే సాయంత్రం వేళలో కాలి సైజ్ కాస్తంత ఎక్కువ ఉంటుంది. అలాగే రాత్రంతా విశ్రాంతి వల్ల ఉదయానికి కాలి కండరాలు కాస్తంత రిలాక్స్ అయి ఉంటాయి. కాబట్టి షూ కరెక్ట్ సైజ్ తెలుసుకోడానికి మధ్యాహ్నానికి, సాయంత్రానికి మధ్య వేళ అయితే బెటర్ అంటున్నారు నిపుణులు.

నవ్వుతో మేలు...

బరువు తగ్గడానికి ఇప్పటికే రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారా? వాటికి తోడు మరో మంచి మార్గం తెలుసుకోండి. విపరీతంగా నవ్వడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయన్నది ఇటీవలే యూ.ఎస్.లోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలుసుకున్న కొత్త సత్యం. ఇక్కడి నిపుణులు బాగా నవ్వించే విపరీతమైన కామెడీ సినిమాలను కొందరికి చూపించారు. ఆ సినిమాలు చూస్తూ నవ్వుతున్న వారికి 10 నుంచి 15 నిమిషాల్లో దాదాపు 50 క్యాలరీలు ఖర్చయినట్లు గుర్తించారు. అందుకే ఇకపై నవ్వుకు ఉన్న ప్రయోజనాలకు ఇది కూడా కలుపుకోవాలంటున్నారు వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ పరిశోధకులు.

సర్వేంద్రియానాం... నయనం ప్రదానం

సాధారణంగా కంటికి సంబంధించి మూడు రకాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి... మయోపియా (దగ్గరి దృష్టి... దగ్గరి వస్తువులు కనిపిస్తూ దూరంగా ఉన్నవి కనిపించకపోవడం), హైపరోపియా (దూరదృష్టి... దూరంగా ఉన్నవే కనిపిస్తూ దగ్గరగా ఉన్నవి కనిపించకపోవడం), ఆస్టిగ్మాటిజమ్ (ఉదాహరణకు గ్రాఫ్‌లోని రెండు రకాల గీతల్లో ఒకటి మాత్రమే స్పష్టంగా కనిపించే సమస్య). ఈ మూడింటినీ రిఫ్రాక్టివ్ సమస్యలు లేదా దృష్టిలోపాలుగా చెబుతారు. మన సమాజంలో ఈ మూడు సమస్యల వల్లనే 20 శాతం మందిలో దృష్టిలోపాలు వస్తుంటాయి. ఇవి చిన్న వయసులోనే వస్తుంటాయి కాబట్టి పిల్లలు స్కూలుకు వెళ్లే ముందర (ప్రీ-స్కూల్), స్కూల్‌కు వెళ్తున్నప్పుడు (స్కూలింగ్ సమయంలో), కాలేజ్‌కు వెళ్తున్నప్పుడు తగిన పరీక్షలు చేయించి అవసరమైన కంటి అద్దాలు వాడటం వల్ల వాళ్లలో రిఫ్రాక్టివ్ సమస్యలు, లేజీ ఐ, మెల్లకన్ను లేకుండా చూడవచ్చు.

స్మైల్ @ 60

వయసు పైబడింది అనడానికి కొన్ని గుర్తులు చెప్పుకుంటాం. వాటిలో జుట్టు నెరవడం, చర్మం ముడతలు పడటం, పళ్లు ఊడిపోవడం... వంటివి ప్రధానంగా చూస్తుంటాం. మొదటి రెండు పరిస్థితులు సాధారణమే అయినా, దంతాలు మాత్రం మన అజాగ్రత్తల వల్లే ఊడిపోతుంటాయి అంటున్నారు వైద్యులు. వృద్యాప్యంలోనే కాదు ఇటీవల రకరకాల కారణాల వల్ల నలభై ఏళ్ల వయసులోపు వారిలోనూ దంతాలు ఊడిపోతున్నాయి. ఇప్పటి వరకు ఊడిపోయిన దంతాల స్థానంలో కట్టుడు పళ్ల సెట్ పెట్టుకొని ఇబ్బందులు పడేవారు. ఇంప్లాంట్స్ ఈ ఇబ్బందుల నుంచి శాశ్వతంగా విముక్తి లభించేలా చేస్తున్నాయి. ఆ వివరాలు తెలిపేదే ఈ కథనం...

దంతాలు ఊడిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. 50 శాతం మందిలో చిగుళ్ల వ్యాధి వల్ల ఊడిపోతుంటాయి. అయితే ఇవి నొప్పి లేకుండానే దంతాలు కదిలి ఊడిపోతాయి. ముందు చిగుళ్ల వాపు వస్తుంది. తర్వాత చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. ఏదైనా తిన్నప్పుడు దంతాల మధ్య పదార్థాలు ఇరుక్కోవడం మొదలవుతాయి. ఇలాంటప్పుడు పుల్లలు పెట్టి తీయడం అలవాటు అవుతుంది. ఈ అలవాటు 60-70 ఏళ్ల వారిలోనే కాదు 20-30 ఏళ్ల మధ్య వయసు వారూ పళ్ల సందుల్లో పుల్లలు పెట్టి కెలకడం గమనించవచ్చు. ఇవి దంతాలు కదలడానికి, ఊడిపోవడానికి సూచనలు అని గుర్తించాలి.
న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ గుట్టు బయట పెట్టారు. ఈ సాయంత్రం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ద్వారా గడ్కరీ గుట్టు బయటకు లాగామని చెప్పారు. గడ్కరీకి వ్యతిరేకంగా ఆయన కొన్ని ఆధారాలను బయట పెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి గడ్కరీ లబ్ది పొందారని ఆరోపించారు. శరద్ పవార్ , అజిత్ పవార్ లతో ఉన్న సంబంధాలను ఆయన బాగా ఉపయోగపెట్టుకున్నారని తెలిపారు. గడ్కరీ విధానాల వల్ల విదర్భ రైతులు నష్టపోయారని, నాగ్ పూర్ జిల్లాలో రైతులు దెబ్బతిన్నారని వివరించారు. ఆయన వ్యాపార ధోరణి సామాన్యులకు నష్టం కలిగించిందన్నారు. గడ్కరీ లేఖకు ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆఘమేఘాల మీద ఆయనకు భూమి కేటాయించినట్లు తెలిపారు. సుందరీకరణ పేరుతో రైతులను తిరస్కరించి, గడ్కరీకి భూమి కట్టబెట్టారని ఆరోపించారు. భూ కేటాయింపులపై అప్పటి ముఖ్యమంత్రి అజిత్ పవార్ సంతకం ఉందని తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని పత్రాలను ఇండియా ఎగెనిస్ట్ కరప్షన్ వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపారు. నీటిపారుదల కుంభకోణంలో గడ్కరీకి సంబంధం ఉన్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు.