Thursday, October 11, 2012

ఔషధ మొక్కలతో ఆరోగ్య భద్రత

Dr.Darshan Shanker
Institute of Ayurveda & Intigtrated Medicine
మన దేశంలో 6,500 ఔషధ మొక్కలు ఉన్నాయని, సంప్రదాయ విజ్ఞానం ద్వారా వాటిని సద్వినియోగం చేసుకొంటే మన ప్రజలకు ‘ఆరోగ్య భద్రత’ చేకూరుతుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దర్శన్ శంకర్ ఉద్బోధించారు. జీవ వైవిధ్య సదస్సు ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన అనుబంధ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పురాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో దాగున్న విజ్ఞానాన్ని ప్రజల దరి చేర్చడానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని యువతకు పిలుపునిచ్చారు. జ్ఞాపకశక్తి పెంపొందించడానికి ‘బ్రహ్మి’ ఆకులు ఉపయోగపడతాయని మన పూర్వీకులు విశ్వసించారని, దాన్ని ఉపయోగించి ప్రయోజనాలూ పొందారని పేర్కొన్నారు.

కానీ ఇప్పుడు మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్) చేసిన పరిశోధనల్లో.. బ్రహ్మి మొక్క జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుందని తేలిందని చెప్పారు. రాగి పాత్రలో రాత్రంతా నీరు ఉంచితే.. నీటిలోని బాక్టీరియా, వైరస్ అంతరించిపోతుందని పరిశోధనల్లో తేలిందన్నారు. తిప్పతీగ(అమృతవల్లి) మొక్క సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని ఇటీవల జరిగిన పరిశోధనలు నిరూపించాయని చెప్పారు. తాను చెబుతున్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని, ఇలాంటి విజ్ఞానానికి దేశంలో కొదవ లేదన్నారు.

No comments: