Tuesday, October 23, 2012

2019 నాటికి ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి

 ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు 2019 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బి. హరిరామ్ తెలిపారు. పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆలయ సందర్శన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 38,500 కోట్లవుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీనంగర్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని సుమారు 16 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. తొలుత చీఫ్ ఇంజనీర్ హరిరామ్‌కు దేవాలయంలో అధికారులు స్వాగతం పలికారు. కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరి, పురుహూతిక అమ్మవార్లు, దత్తాత్రేయస్వామి, సాయిబాబాలను కుటుంబసభ్యులతో దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయించుకున్నా రు. అర్చకులు ఆలయచరిత్ర, విశిష్టత తెలియజేసి ఆశీర్వచనాలు అందజేశారు. 

No comments: