Monday, December 29, 2008

"స్వప్న సంగమము"

నిన్న రాత్రి వసంతం గానంతో మైమరిచింది
వెన్నెల్లో సన్నజాజులు మన మాటలతో
పులకరించాయి
ఆదమరిచి నిద్రించిన గువ్వలు మన
గుస గుస లకు మేల్కొని సిగ్గుతో పారిపోయాయి
మన సంగపపు పూర్ణత్వపు జ్వాలకు గుర్తుగా
ఉల్క నేల రాలింది
ప్రకృతి స్తంభించి పోతుందని నెలరాజు
నీలి మేఘం చాటుకు తప్పుకున్నాడు
మదనుని శరములు శలభాలు కాగ మన రాత్రి
అంతమైంది
లలనా! భానుని కిరణాలు చురుక్కు మనిపించే
వరకు నా స్వప్నంలో ఉన్నావు.

"సమిధ"


అందంగా విరబూసిన వెన్నెల రాత్రిలో
నిను వెదుకుతున్నాయి నా కళ్ళు
అ కళ్ళ లో నిరాశ
చల్లగా వీచే చలి గాలి లో నీ పొందు కోసం
తహతహలాడే నా హృదిలో నిస్పృహ
ఈ నిరాశ నిస్పృహలు చాలవన్నట్లు
ఆకాశం లోని కొంటె నక్షత్రాలు, ఇంకా
నీ
చెలి రాలేదేమిటని ప్రశ్నిస్తున్నాయి.
ప్రియా! నీవందకుండానే నీ జ్ఞాపకాల విరహాగ్నిలో
ఎక్కడ సమిధనైపోతానోనని భయంగా వుంది.

Saturday, December 27, 2008

కాన్క

జ్ఞాపకాల పొరల్లోంచి అప్పుడప్పుడు

బయటకొస్తావు

కంటికి లీలగా అగుపిస్తావు ....!

ఈ జనారణ్యంలో ఒంటరినైపోతాను

ప్రియా! హృదయం మూగవోయినా సరే

మనసు కళం నుంచి అక్షరమాలలల్లి

ఎక్కడో నా కోసం నీవు వున్నావనుకొని

నీకు కాన్కలా పంపిస్తున్నాను.



__యదార్థ.