Wednesday, November 7, 2012

నెస్ట్ పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి?

ప్రిపరేషన్ గెడైన్స్-నెస్ట్ 


బేసిక్ సెన్సైస్, దాని అనుబంధ సబ్జెక్టుల్లో సుశిక్షితులైన మానవ వనరులను దేశానికందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ) 2007లో నైసర్, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సెన్సైస్‌లను ఏర్పాటు చేసింది. ఈ రెండు సంస్థల్లో ఐదేళ్ల ఇంటిగ్రే టెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) నిర్వహిస్తారు.

ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్షలో 5 విభాగాలుంటాయి. మొదటి సెక్షన్ అందరికీ కామన్‌గా ఉంటుంది. ఇందులో బయాలజీ, కెమిస్ట్రీ ఫిజిక్స్, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్‌లలో ప్రధాన సంఘటనలపై ప్రశ్నలుంటాయి. రెండో సెక్షన్‌లో బయాలజీపై, మూడో సెక్షన్‌లో కెమిస్ట్రీపై, నాలుగో సెక్షన్‌లో మ్యాథమెటిక్స్‌పై, ఐదో సెక్షన్‌లో ఫిజిక్స్‌పై ప్రశ్నలుంటాయి.

రెండు నుంచి నాలుగు సెక్షన్స్‌లో విద్యార్థులు ఏవైనా మూడు విభాగాలను ఎంచుకుని పరీక్ష రాయాలి. విద్యార్థుల గ్రహణ శక్తిని, విశ్లేషణ శక్తిని అంచనా వేసేలా 10+2 (సీబీఎస్‌ఈ) స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంగ్లిష్ మాధ్యమంలో మూడు గంటల కాల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి.

ఈ విభాగాల నుంచి ప్రశ్నలు:
ఐదు విభాగాలుగా ఉండే పరీక్షలో సెక్షన్-1లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్‌లపై ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలుంటాయి. ఈ సబ్జెక్టులలో అతిముఖ్యమైన సంఘటనలు, అంశాలపై ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. కాన్సెప్ట్ ఆధారంగా ఇచ్చే సైంటిఫిక్ ప్యాసేజ్‌లో విద్యార్థుల సాధారణ, గుణాత్మక సామర్థ్యాన్ని అంచనా వేసేలా ప్రశ్నపత్రం ఉంటుంది. మ్యాథ్స్‌లో పదోతరగతి వరకు ఉన్న సాధారణ సమస్యలపై పశ్నలుంటాయి.

సెక్షన్-2లో బయాలజీలో సెల్ బయాలజీపై; జువాలజీలో అనాటమీ అండ్ ఫిజియాలజీలో భాగంగా డెజైస్టివ్, సర్క్యులేటరీ, రెస్పిరేటరీ, ఎక్స్‌క్రీటరీ, నెర్వస్, రీప్రొడక్టివ్ సిస్టమ్‌లపై ప్రశ్నలడుగుతారు. ఇంకా డైవర్సిటీ ఆఫ్ యానిమల్ లైఫ్, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, ఎకాలజీలపై, బోటనీలో భాగంగా అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్, సిస్టమాటిక్స్, హ్యూమన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌లపై ప్రశ్నలుంటాయి. సెక్షన్-3లో కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీలపై ప్రశ్నలుంటాయి. సెక్షన్-4లో మ్యాథ్స్‌పై ప్రశ్నలడుగుతారు. సెక్షన్-5 ఫిజిక్స్‌పై ప్రశ్నలుంటాయి.

వీటిల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే 8 నుంచి 10+2 వరకు ఉన్న మ్యాథ్స్, సైన్స్ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. ఆయా చాప్టర్లలో ముఖ్యమైన భావనలను, సిద్ధాంతాలను ఔపోసన పట్టాలి. దీంతోపాటు సంబం ధిత సబ్జెక్టుల ఏఐఈఈఈ, ఐఐటీ -జేఈఈ మెటీరి యల్‌ను చదవాలి.


No comments: