Wednesday, November 7, 2012

బ్యాంక్ పీవో


ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో)... బ్యాంకింగ్ రంగంలో ఉజ్వలమైన కెరీర్‌ను అందించే పోస్టు. పీవోగా బ్యాంక్‌లో అడుగుపెడితే.. కెరీర్‌లో ఎదుగుదలకు ఎలాంటి పరిమితులూ ఉండవు. అంకితభావం ఉంటే.. ఆకాశమే హద్దు. నాలుగేళ్లు తిరిగేలోపు సీనియర్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు. పీవోగా చేరి.. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, చైర్మన్ స్థాయికి ఎదగొచ్చు.

అర్హతేంటి:
కేవలం గ్రాడ్యుయేషన్. ప్రభుత్వ రంగ బ్యాంకులు పీవోల భర్తీకి ఐబీపీఎస్ కామన్ పరీక్షను నిర్వహిస్తున్నా యి. ఐబీపీఎస్ స్కోర్‌తో 19 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగం పొందొచ్చు. మొదటి దశలో రాత పరీక్ష; రెండో దశలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలుంటాయి.

పీవో పనితీరు-కెరీర్ స్కోప్:
పీవోలు ఆన్‌లైన్ బ్యాంకింగ్, సెక్యూరిటీస్, ఇన్వెస్ట్‌మెంట్స్, అసెట్ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ బ్యాం కింగ్.. ఇలా బహుముఖ పాత్రలు పోషించాలి. నేడు ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్, మర్చెంట్ బ్యాంకింగ్.. ఇలా అనేక సరికొత్త విభాగాలు వచ్చిచేరాయి. పీవోకు ఒక ఏడాదిపాటు ప్రొబేషన్ ఉంటుంది. ప్రొబేషన్ కాలంలో ఫారెక్స్ ఆపరేషన్స్, జనరల్ బ్యాంకింగ్, లోన్స్ అండ్ మర్చంట్ బ్యాంకింగ్ విభాగాల్లో పనిచేయాలి. ప్రొబేషన్ పూర్తయ్యాక ఆయా విభాగాల్లో పోస్టింగ్ ఇస్తారు. సర్టిఫైడ్ అసోసియేట్స్ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ (సీఏఐఐబీ) పరీక్ష ద్వారా ఇంకా త్వరగానే పదోన్నతి పొందొచ్చు.

శాలరీ: కెరీర్ ప్రారంభంలోనే నెలకు రూ.25,000కు పైగా వేతనం పొందొచ్చు. దీంతోపాటు వివిధ అలవెన్సులు కూడా ఉంటాయి. పని తీరు, అనుభవంతో వేతనం పెరుగుతుంది.

స్కిల్స్:
బ్యాంక్ కార్యకలాపాలను చురుగ్గా నిర్వహించాలి.
కొత్త టెక్నాలజీకి అప్‌డేట్ కావాలి.
వినియోగదారులతో స్నేహపూర్వకంగా మెలగాలి.
నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవాలి.

No comments: