Thursday, November 1, 2012

ప్రెగ్నెన్సీ ....జాగ్రత్తలు....

ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల రెగ్యులర్ పీరియడ్స్ 25 నుంచి 30 రోజుల లోపు రావడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ నిలిచినట్లయితే ఆ పెనైల పీరియడ్స్ ఆగిపోతాయి. దీనినే నెల తప్పడం అని పిలుస్తాం. ఈ సమయంలో స్త్రీ శరీరంలో హెచ్.సి.జి అనే హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఈ హార్మోన్‌నే మనం ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ చేయడానికి ఉపయోగిస్తాం. మూత్రంలో హెచ్.సి.జి హార్మోన్‌ని గుర్తించడానికి వీలవడం వల్ల ప్రెగ్నెన్సీని యూరిన్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తాం. ఈ పరీక్షను కిందటి నెల పీరియడ్స్ వచ్చిన దగ్గర నుంచి 35రోజుల తర్వాత అంటే నెల తప్పిన 5 రోజుల తర్వాత నుండి చేస్తారు.


ఇక డెలివరీ... నార్మల్‌గానా లేదా ఆపరేషన్ ద్వారానా అనేది నెలలు నిండిన తర్వాత కాని చెప్పలేరు. తల్లి ఎత్తు, బరువు... బిడ్డ బరువు, పొజిషన్, నొప్పులు, బిడ్డ బయటకు వచ్చేందుకు అనువుగా ఉండే దారి... ఇలా ఎన్నో విషయాలు డెలివరీ ఎలా అవుతుందనేది ప్రభావితం చేస్తాయి. ముందు కాన్పులో ఆపరేషన్ అయిందని, ఈసారి కూడా అలాగే జరగాలని నియమమేమీ లేదు. తొమ్మిదో నెల వచ్చిన తర్వాత మిమ్మల్ని పరీక్షించిన డాక్టర్... నార్మల్ డెలివరీనా లేక సిజేరియన్ అవసరమా అనేది ట్రయల్ లేబర్ ద్వారా నిర్ణయిస్తారు. నార్మల్ డెలివరీ అయ్యేందుకు ప్రయత్నం చేసినా కొన్నిసార్లు నొప్పులు సరిగా రాక, బిడ్డ పొజిషన్ సరిగ్గా లేకపోవడం లేదా బిడ్డకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఆపరేషన్ చేయవలసి వస్తుంది. అందువల్ల మీరు డెలివరీ ఎలా అవుతుందనే విషయం గురించి ఆందోళన చెందక తల్లి-బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

ముప్ఫయ్యేళ్లు దాటిన స్త్రీలలో ప్రెగ్నెన్సీ రావడం వల్ల తల్లికి వచ్చే అదనపు ఆరోగ్యసమస్యలు ప్రత్యేకించి ఏమీ లేవు. అయితే 35 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీలో మాత్రం మానసిక వికలాంగులు, బుద్ధిమాంద్యత తక్కువగా ఉన్న పిల్లలు పుట్టడానికి అవకాశం అధికం. ఆ వయసుకు సంబంధించి తల్లికి కూడా బి.పి, షుగర్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉండటం చేత బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదల మరింత క్ల్లిష్టం కావచ్చు.

No comments: