Wednesday, November 21, 2012

నమో హాలోగ్రఫీ మాయ!


నరేంద్రమోడీని హాలోగ్రాఫిక్‌లైవ్‌లో చూపడంలో ఇద్దరు హైదరాబాదీలది కీలకపాత్ర . హిందీలో టాంగో చార్లీ వంటి చక్కటి సినిమా తీసిన హైదరాబాదీ దర్శకుడు మణిశంకర్, మరో తెలుగు వ్యక్తి కాసు రాజగోపాల్‌రెడ్డిలు నరేంద్రమోడీని త్రీడీ లైవ్‌లో ప్రొజెక్ట్ చేయటంలో టెక్నికల్ సహకారం అందిస్తున్నారు. మైకేల్ జాక్సన్ ఇచ్చిన గ్రాండ్ హాలోగ్రాఫ్ లైవ్‌తో తమకు టెక్నాలజీ వైపు ఆసక్తి కలిగిందని మణిశంకర్ ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ హాలోగ్రఫీ లైవ్ ద్వారా భారీ పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు ఈ దర్శకుడు. ఇది భవిష్యత్తులో మనకు మరింత మంది రాజకీయనాయకులను త్రీడీ లైవ్‌లో చూపిస్తుందేమో!

దాదాపు 15 సంవత్సరాల క్రితం తమిళ దర్శకుడు శంకర్ తీసిన ‘జీన్స్’ సినిమా గుర్తుంటే, అందులో ఒక పాటలో ఐశ్వర్యారాయ్‌ను డబుల్ పోజ్‌లో చూపిన స్టైల్‌ను ఎవరూ మరచిపోలేరు! టెక్నికల్ వండర్‌గా చూపించిన ఆ సీన్‌లో కొంచెం డ్రామా, మరి కొంచెం సినిమాటిక్ కలబోత ఉండవచ్చు. ఇప్పుడు అలాంటి త్రీడీ టెక్నికల్ వండర్ మరోసారి భారతదేశంలో చర్చనీయాంశం అవుతోంది. అది నరేంద్రమోడీ త్రీడీ హాలోగ్రాఫిక్ లైవ్‌లతో...






గుజరాత్ ఎన్నికల్లో మోడీని ప్రజలు ఏ స్థాయిలో ఆదరిస్తారో కానీ, ఆయన ప్రచారంలో అనుసరిస్తున్న బాణీని చూసి చాలామంది సమ్మోహితులవుతున్నారు. మొన్నటి ఆదివారం ఒకేసారి అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, బరోడా నగరాల్లోని సభల్లో స్టేజ్ మీద నరేంద్రమోడీ కనిపించారు. ఆ నాలుగుచోట్లా ఒకేసారి మోడీ ప్రత్యక్షమయ్యారు. వాస్తవానికి ఆ నాలుగు చోట్లలోనూ ఆయన లేరు. గాంధీనగర్‌లోని ఒక స్టూడియోలోంచి గంభీరంగా ప్రసంగిస్తున్న ఆయన ప్రధాన నగరాల్లో సెట్ చేసిన స్టేజీలపై నిలబడి ప్రసంగిస్తున్నట్లు కనిపించారు. ఇది సాధారణ లైవ్ కాదు, అసాధారణ 3డీ లైవ్ మహత్యం. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో పరిశీలిస్తే... వాస్తవంగా అక్కడ లేని ఒక మనిషిని కళ్లెదురుగా ప్రత్యక్షం చేయడం ఈ త్రీడీ హాలోగ్రాఫిక్‌లైవ్ విశిష్టత. కళ్లెదురుగా ఉన్నది త్రీడీ బొమ్మ అని గుర్తించవచ్చు. కానీ చూస్తున్నప్పుడు దాని మాయలో పడిపోవాల్సిందే.



డిస్‌ప్లేలో అంత స్పష్టత ఉంటుంది. ముమ్మూర్తులా ఒరిజినల్‌గా మనిషి ఆకారాన్ని, హావభావాలను, కదలికలను ప్రొజెక్ట్ చేస్తున్నారు ఈ టెక్నాలజీతో. ఈ త్రీడీ బొమ్మను చూడటానికి థియేటర్లలో మాదిరిగా ఎటువంటి కళ్లజోడు అవసరం ఉండదు. త్రీడెమైన్షనల్ మూవింగ్ ఇమేజెస్‌ను ప్రొజెక్ట్ చేయడంలో ఇది ఒక అద్భుత టెక్నాలజీ. ఇందులో ఉపయోగించే ఐ లైనర్ టెక్నాలజీ త్రీడీ చిత్రానికి ఒక నాటకీయతను తీసుకొస్తుంది. ఇన్ని రోజులూ కేవలం సినిమాలకే పరిమితం అయిన త్రీడీని లైవ్‌కు తీసుకొచ్చి, ఇది కళ్లముందు కదిలిస్తోంది. వార్నర్ బ్రదర్స్ వారి ‘హూ ఫ్రేమ్‌డ్ రోజర్ రాబిట్’ వంటి సినిమాలో ఈ ఐలైనర్ టెక్నాలజీ అద్భుతాన్ని ఆవిష్కరించారు. శంకర్ జీన్స్ తెలుగువారికి కూడా పరిచ యం ఉన్నదే. అయితే అవన్నీ స్టూడియోలకు పరిమితమైనవి. ఇప్పుడు స్టేజ్ ప్రెజంటర్‌లకు ఇది చాలా ఉపయుక్తమైన టెక్నాలజీగా వర్థిల్లుతోంది.



గతంలో మైకేల్ జాక్సన్ ఈ ఐలైనర్ టెక్నాలజీ ద్వారా ఏకంగా ముప్పై దేశాల్లో స్టేజ్ ఫెర్పార్మెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత లేడీగా తన షోను ఐలైనర్ ద్వారా ప్రొజెక్ట్ చేసింది. రాజకీయనాయకుల విషయంలో తొలిసారి మోడీ ఈ ప్రదర్శన చేస్తున్నారు. ఐలైనర్ టెక్నాలజీలో అవసరమైనది కేవలం సింగల్ కెమెరా షూట్, సింగల్ ప్రొజెక్టర్ ప్లేబ్యాక్. 360 డిగ్రీల కోణంలో టార్గెట్‌ను చిత్రీకరించే కెమెరా, ఆ దృశ్యాన్ని మరో చోట త్రీడీ ఎఫెక్ట్‌లో చూపుతుంది. ఆ దృశ్యం ఎలా కనిపిస్తుందంటే అది వాస్తవం కాదంటే ఎవరూ నమ్మలేరు. ఐ లైనర్ డిస్‌ప్లేలో, వ్యక్తి ధరించిన దుస్తుల నుంచి అతడి ప్రసంగం వరకూ జీవకళ ఉట్టిపడుతుంది. దీని ద్వారా ఏ స్థాయిలోని వస్తువులనైనా వాస్తవ రూపాలుగా ప్రొజెక్ట్ చేయవచ్చు. 20 ్ఠ 100 మీటర్ల స్థాయి పిక్చర్‌ను కూడా ఐలైనర్ ద్వారా డిస్‌ప్లే చేయవచ్చు. అద్భుత క్లారిటీతో త్రీడీ చిత్రాన్ని నాటకీయంగా చూపవచ్చు.



యాపిల్ పరిశోధిస్తోంది!



హాలోగ్రఫీ త్రీడీ లైవ్ పై యాపిల్ సంస్థ ఓ కన్నేసింది. ఐ ఫోన్ స్థాయిలో దీన్ని అనుసంధానించడానికి ప్రయత్నాలు చేస్తోంది. నెక్ట్స్ జనరేషన్ 3డీ హాలోగ్రాఫిక్ లైక్ సిస్టమ్స్ పేరుతో ఒక ప్రాజెక్టు చేపట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ల విషయంలో తన యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇవ్వడం యాపిల్ లక్ష్యంగా కనిపిస్తోంది. మరి భవిష్యత్తులో ఈ 3డీ హాలోగ్రాఫిక్ లైవ్‌కు ఐ ఫోన్‌కు కూడా అనుబంధం ఏర్పడుతుందేమో!

- జీవన్‌రెడ్డి. బి



మోడీకి మార్గదర్శకులు మనవాళ్లే!

నరేంద్రమోడీని హాలోగ్రాఫిక్‌లైవ్‌లో చూపడంలో ఇద్దరు హైదరాబాదీలది కీలకపాత్ర . హిందీలో టాంగో చార్లీ వంటి చక్కటి సినిమా తీసిన హైదరాబాదీ దర్శకుడు మణిశంకర్, మరో తెలుగు వ్యక్తి కాసు రాజగోపాల్‌రెడ్డిలు నరేంద్రమోడీని త్రీడీ లైవ్‌లో ప్రొజెక్ట్ చేయటంలో టెక్నికల్ సహకారం అందిస్తున్నారు. మైకేల్ జాక్సన్ ఇచ్చిన గ్రాండ్ హాలోగ్రాఫ్ లైవ్‌తో తమకు టెక్నాలజీ వైపు ఆసక్తి కలిగిందని మణిశంకర్ ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ హాలోగ్రఫీ లైవ్ ద్వారా భారీ పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు ఈ దర్శకుడు. ఇది భవిష్యత్తులో మనకు మరింత మంది రాజకీయనాయకులను త్రీడీ లైవ్‌లో చూపిస్తుందేమో!

No comments: