Tuesday, November 20, 2012

మద్యంతో హాని ఇంతింత గాదయా...

ఆల్కహాల్ కొద్దిగా తాగితే పర్లేదని, హాయిగా నిద్రపడుతుందని అనుకుంటున్నారా? అది సరికాదు. మామూలుగా రోజూ పదింటికి పడుకునేవారు అరగ్లాసు ఆల్కహాల్ తీసుకుంటే ఇక రాత్రి రెండుగంటల వరకు నిద్రపట్టదు. ఇక నిద్రపట్టడం లేదని కాస్త ఎక్కువగా తీసుకుంటే దాంతో మరో ప్రమాదం ఉంది. ఆల్కహాల్‌కు డైయూరెటిక్ లక్షణం ఉంది. డై యూరెటిక్ అంటే శరీరంలోని ద్రవాలను బయటికి పంపించడం అన్నమాట. అందుకే ఆల్కహాల్ తీసుకున్నవారు మామూలు వారి కంటే చాలా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తుంటారు.



ఇలా మాటిమాటికీ మూత్రానికి వెళ్లడం వల్ల శరీరంలోని సాధారణ ద్రవాల పరిమాణం తగ్గుతుంది. విటమిన్-బి కాంప్లెక్స్, విటమిన్-సి లు నీటిలో కరిగే (వాటర్ సోల్యుబుల్) విటమిన్లు. అవి మన శరీరంలోని అన్ని భాగాలకు అందాలంటే తగినంత నీరు అవసరం. ఆల్కహాల్ తాగాక మన శరీరంలోంచి నీరు బాగా బయటకు వెళ్లిపోవడం వల్ల నీటిలో కరిగి అన్ని శరీర భాగాలకు అందాల్సిన విటమిన్-బి కాంప్లెక్స్, విటమిన్-సిలు తగినంతగా అందవు. దాంతో మన శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తి అందదు. అందుకే క్రితం రోజు మద్యం తాగాక... ఆ మర్నాడంతా డల్‌గా, అలసిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అందుకే పరిమితంగా తాగినా, ఎక్కువగా తాగినా, ఎలా తీసుకున్నా, ఎంత తీసుకున్నా ఆల్కహాల్‌తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనం అంటూ ఏదీ లేదు.

No comments: