Thursday, November 1, 2012

ఇంతులు... కాంతులు...

చిక్కగా పరుచుకున్న చీకటిని తరుముతూ ముంగిలిని మురిపించి, మెరిపించడానికి దీపకాంతులు అరుదెంచే శుభవేళ దీపావళి. నేలమీద పువ్వుల్లా విరిసి నింగిలోన తారకలతో పోటీపడే మతాబుల హేల దీపావళి. బంగారుకాంతులీనే దీపాలతో పోటీపడుతున్న పట్టుచీరలు రెపరెపలాడితేనే అతివలకు అసలైన ఆనందాల దీపావళి.పండగవేళకు పడతులు మెచ్చే పట్టుచీరలు



1- లైట్ పింక్ ప్యూర్ కంచిపట్టు చీర ఇది. రిబ్బన్ బార్డర్‌లో ‘వి’షేప్ డిజైన్ అందంగా రూపుకట్టింది. చీరంతా పసుపు బుటా,మీనా వర్క్ చేశారు. రిచ్ పల్లూ, ఫ్యాన్సీ బ్లౌజ్...ఈ చీరను వినూత్నంగా తీర్చిదిద్దాయి.

2- ఇంక్ బ్లూ కలర్ ప్యూర్ ఉప్పాడ పట్టుచీర ఇది. బాల్స్ డిజైన్‌లో సిల్వర్, గోల్డ్ నిలువు గీతలు, కడ్డీ బార్డర్, రిచ్ ఫ్లవర్ బుటా గల పల్లూ, ఫ్యాన్సీ బ్లౌజ్‌తో ఈ చీర అందం రెట్టింపైంది.

3- ఎరుపు, పసుపు రంగుల మధ్య నీలంరంగు నిలువు గీతలతో ఆకట్టుకుంటున్నది ఈ కుబేరా పట్టు చీర. సిల్వర్ గోల్డ్, కాపర్ కలర్స్‌తో తీరుగా కనిపించే కొంగు, సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఈ చీర ప్రత్యేకతలు.

No comments: