Tuesday, November 27, 2012

సొరియాసిస్ - ఆయుర్వేదం

ఏవ్యాధి రావడానికైనా, శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గడమే ప్రధమ కారణం. ఆ శక్తి తగ్గడానికి వ్యర్థ-విషపదార్థాలతో తయారైన ఆమం శరీరమంతా పేరుకుపోవడమే కారణం. ఆమం పెరిగిపోగానే శరీరంలోని సప్తధాతువులూ క్షీణించడం మొదలవుతుంది. పరిస్థితి ధాతువులు క్షీణించేదాకా వెళ్లిందీ అంటే, శరీరంలోని అత్యంత సూక్ష్మమైన ప్రసరణా వ్యవస్థలోనే లోపాలు ఏర్పడ్డాయి అని అర్థం. సప్తధాతువుల సారమే ఓజస్సు అదే ప్రాణ శక్తి. అలాంటప్పుడు ఓజస్సుకు కేంద్రంగా ఉండే ధాతువులే క్షీణించిపోతే, శరీరం రోగగ్రస్తం కాకుండా ఎలా ఉంటుంది? శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు పలురకాల వ్యాధులు వస్తాయి.

అందులో భాగంగానే సొరియాసిస్ కూడా వస్తుంది. ఆమం పెరిగితే శరీరం వ్యాధిగ్రస్తమవుతుంది. శరీరం వ్యాధి గ్రస్తమయ్యే శరీరంలో ఆమం పెరుగుతుంది. హఠాత్తుగా వ్యాధినిరో«ధక శక్తిని పెంచే ఔషధాలు అందితే తప్ప రోగి ఈ విషవలయంలోంచి బయటపడలేడు. మందులు వాడతాడు. తగ్గినట్లే తగ్గి మళ్లీ వ స్తుంది. దీనికి శరీర బలం తగ్గిపోయి, వ్యాధిబలం పెరగడమే కారణం. అల్లోపతి వైద్యం ఎంత సేపూ వ్యా«ధి లక్షణాలు తగ్గించే ప్రయత్నాలే తప్ప వ్యాధికారకమైన ఆమాన్ని తగ్గించి, వ్యాధినిరోధక శక్తిని పెంచే ప్రయత్నమేదీ చేయడం లేదు. 

నిజానికి అల్లోపతిలో అసలు ఆ విధానమే లేదు. ఆ ప్రయత్నం జరగనంత కాలం ఎన్నేళ్లు మందులు వాడినా ఏ ప్రయోజనమూ ఉండదు. ఆహారం అనేది కేవలం పోషకంగానే కాదు. శరీరానికి అదో ఔషధంగా కూడా పనిచేస్తుంది. అందుకే ఆయుర్వేదం వైద్యచికిత్సలకే పరిమిత మై ఉండదు.వాస్త్తవానికి ఔష«ధ విలువలు ఉన్న ఆహారం తీసుకుంటే అమృతంలా పనిచేస్తుంది. విరుద్ధ ఆహారం తీసుకుంటే, విషంలా పనిచేస్తుంది. 

అందుకే సొరియాసిస్ రోగికి ఆయుర్వేద ఔషధ విలువలు ఉన్న ఆహారాన్ని సూచించడంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. చర్మం రక్తపు ఉపధాతువు. కొన్ని రకాల ఆహార పదార్థాలు ప్రత్యేకించి చేపలు తినడం వల్ల పెరిగిన పిత్తర క్తం వల్ల అంతకు ముందే చర్మ సమస్యలు ఉన్నవారికి వ్యాధి ఉధృతమవుతుంది. కానీ, అల్లోపతిలో చేపలు తినమనే చెబుతారు. ఇది వ్యాధిని మరింత తీవ్రం చేస్తుంది.

తాత్కాలిక ఉపశమనాలేనా?
అల్లోపతిలో ఎంత సేపూ తక్షణ ఉపశమనం కలిగేందుకు అవసరమైన వైద్య విధానాల్నే అనుసరిస్తున్నారు. చర్మం మీద ఏదైనా మచ్చ వచ్చి, దురద వేస్తే, ఆ దురద తగ్గడ మే ముఖ్యమనుకుని ఆ పరిమితిలోనే చికిత్సలు చేస్తున్నారు. ఏదో ఆయింట్‌మెంట్ ఇచ్చి ఆ మచ్చను అణచివేస్తున్నారు. ఇదంతా వ్యాధి లక్షణాలకు చికిత్స చేయడమే గానీ, వ్యాధికి చికిత్స చేయడం కాదు. ఏళ్లపర్యంతం ఈ ఉపశమనాలకే పరిమితమైతే, ఆ క్రమంలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతూ వెళుతుంది.

సొరియాసిస్‌ను తాత్కాలికంగా తగ్గించే విధానాల్లో స్టెరాయిడ్స్ ఇవ్వడమే ప్రధానంగా ఉంటోంది. స్టెరాయిడ్స్ వ్యాధినిరోధక శక్తిని బాగా తగ్గిస్తాయి. అయితే ఒకసారి ఇచ్చిన స్టెరాయిడ్స్ డోసు రెండవసారి ఇస్తే ఉపశమనం రాదు. అందుకే స్టెరాయిడ్స్‌ను కూడా క్రమంగా డోసు పెంచుతూ వెళతారు. అవీ పనిచేయని స్థితి వచ్చేసరికి కేన్సర్ మందులు ఇస్తున్నారు. ఒక దశలో అవీ పనిచేయకుండా పోతాయి. అప్పుడింక శరీరమంతా రోగగ్రస్తమవుతుంది. ఈ స్థితిలో రోగి మంచాన పడటం తప్ప మరేమీ ఉండదు.

ఈ వైద్యచికిత్సలతో సొరియాసిస్ తగ్గకపోగా ఈ స్థితిలో లివర్, కిడ్నీలు, మెదడు, గుండె ఇవన్నీ దెబ్బ తినిపోతాయి.సమస్య మొదట్లోనే ఎవరూ ఆయుర్వేద వైద్య చికిత్సలకు రావడం లేదు. ఏళ్ల పర్యంతం అల్లోపతి మందులు వాడినా తగ్గని ఒక నిస్సహాయ పరిస్థితిలో మాత్రమే వాళ్లు ఆయుర్వేదానికి వస్తున్నారు. ఆ స్థితిలో అల్లోపతి మందుల దుష్ప్రభావాలు కూడా వ్యాధిలో భాగమవుతున్నాయి. అప్పుడింక సొరియాసిస్ చికిత్సలు అందిస్తూనే అల్లోపతి మందుల దుష్ప్రభావాలను కూడా తొలగించాల్సి వస్తోంది. ఇది ఆయుర్వేదంపై పడుతున్న అదనపు భారం.

ఆమాన్ని తొలగిస్తే గానీ....
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ విషపదార్థాల సమేతమైన ఆమాన్ని తొలగించకుండా వ్యాధినిరోధక శక్తి పెరగదు. వ్యాధినిరోధక శక్తి పెరగనిదే సొరియాసిన్ తగ్గదు. అందుకే శరీరంలోని ఆమాన్ని తగ్గించడానికి ముందు పంచకర్మ చికిత్సలు చేస్తుంది. ఆ తరువాత వ్యాధినిరోధక శక్తిని, ఓజస్సును పెంచడానికి ర సాయన చికిత్సలు అందిస్తుంది. ఆమం అనేది కేవలం జీర్ణాశయానికే పరిమితమై ఉంటుందనుకుని, దీపన పాచన చికిత్సలు చేస్తే సరిపోతుంది అనుకుంటారు.

కానీ, ఆమం అనేది మొత్తం సప్తధాతువులకూ వ్యాపిస్తూ వెళుతుంది. అందుకే, సొరియాసిస్ రోగుల్లో రస,రక్త, మాంస, అస్తి, మేధో, మజ్జ, శుక్ర ఈ సప్త ధాతువుల్లో ఆమం ఏ ధాతువులో ఉందో ఆయుర్వేదం తెలుసుకుంటుంది. ఆయుర్వేద చికిత్సలు ఆమం చేరిన ధాతువును అనుసరించే ఉంటయి. సొరియాసిస్‌లో వైద్య చికిత్సలు సప్తధాతువులకూ అందేలా ఉండాలే గానీ, చ ర్మానికే పరిమితమై ఉండిపోకూడదు. 

అందుకు విరుద్ధంగా చర్మానికే పరిమితం కావడం వల్లే అల్లోపతి చికిత్సలు పెద్ద ఫలితాల్ని సాధించలేకపోతున్నాయి. ఆమం ఏ ధాతువులో ఉందో తెలుసుకోకుండానే అల్లోపతి వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. అందుకే పదేళ్లుగా మందులు వాడుతున్నా వ్యాధి పూర్తిగా తగ్గడం లేదు. అయితే ఆయుర్వేద చికిత్సలతో చర్మం మీది మచ్చలు కాస్త తగ్గుముఖం పట్టగానే కొందరు మందులు వాడటం మానేస్తారు. పంచకర్మ చికిత్సలు, ఔషధాల ప్రభావం ఇంకా ధాతువుల్ని చేరకముందే, రసాయన చికిత్సలతో ఓజస్సును పెంచకముందే మందులు ఆపడంతో కొద్దిరోజుల్లోనే సమస్య మళ్లీ మొదలవుతుంది. సమస్య సమూలంగా తొలగిపోవాలంటే ధాతుచికిత్సలు జరగడం తప్పనిసరి.

సైకోసొమాటిక్ వ్యాధి
మౌలికంగా సొరియాసిస్ మానసిక కారణాలతో వచ్చే శారీరక (సైకోసొమాటిక్) వ్యాధి. అల్లోపతిలో సొరియాసిస్‌ను కేవలం శారీరక వ్యాధిగానే పరిగణిస్తూ వైద్యం అందిస్తున్నారు. కానీ, ఆయుర్వేదంలో మాత్రం నాడీవ్యవ స్థను ఉత్తేజితం చేయడం ద్వారా మానసిక ఒత్తిళ్లు దిగులు, ఆందోళనలనుంచి విముక్తి చేసే చికిత్సలు ఉంటాయి. అందులో శిరోధార చికిత్సలతో పాటు రోజూ కొన్ని ప్రత్యేకమైన ఔషధ తైలాలతో తలకు తైల మర్థనం చేసుకొమ్మని కూడా సూచిస్తాం. 

అలా చేయడం ద్వారా కేంద్రనాడీ వ్యవస్థకు రక్తప్రసరణ పెరిగి సమస్త మానసిక సమస్యలనుంచి బయటపడగలుగుతున్నారు. తలకే కాకుండా మొత్తం శరీరానికి తైలమర్థన చేసుకోవడం వల్ల కూడా మానసికమైన మరెన్నో ఒత్తిళ్లనుంచి బయటపడే వీలు కలుగుతుంది. అలాగే ముక్కులోంచి ఔషధ రసాల్ని లోనికి పంచే ఒక ప్రత్యేకమైన నస్యకర్మ కూడా మానసిక ఒత్తిళ్లనుంచి బయటపడేలా చేస్తుంది. సైకోసొమాటిక్ వ్యాధులకు నిజంగా ఇది సరియైన వైద్యం.

ఆయుర్వేదంతో అడ్డుకట్ట
అల్లోపతిలో ఇచ్చే స్టెరాయిడ్స్‌తో వ్యా«ధి చాలా తగ్గినట్లే అనిపిస్తుంది. అందుకే ఎక్కువ మంది అక్కడికే వెళతారు. కాకపోతే, ఆ చికిత్సలన్నీ తాత్కాలిక ఉపశమనానికే అన్న విషయం వారికి ఆ తరువాత తెలుస్తుంది. స్టెరాయిడ్స్ శరీరంలోని ఏదో ఒక భాగానికి హఠాత్తుగా రక్తప్రసర ణను పెంచే ద్రవ్యం. రక్తప్రసరణ పెరగడంతో అక్కడున్న సమస్య తాత్కాలికంగా తగ్గుతుంది. అయితే, ఆ స్టెరాయిడ్స్ ప్రభావం తగ్గగానే సమస్య మళ్లీ యధాస్థితికి చేరుకుంటుంది. పైగా స్టెరాయిడ్స్ వల్ల వ్యాధినిరోధక శక్తి చాలా వేగంగా తగ్గిపోవడం వల్ల రెండవసారి సొరియాసిస్ మరింత తీవ్రస్థాయిలో విరుచుపడుతుంది.

ఆయుర్వేద చికిత్సలు ఇందుకు పూర్తిగా భిన్నమైనవి, విలక్షణమైనవి. పంచకర్మ చికిత్సలతో శరీరంలోని ఆమాన్ని తొలగించడంతోపాటు, వాత, పిత్త, కఫాలను సమస్థితికి తీసుకు రావడం ద్వారా ఆయుర్వేదంలో తొలి అడుగు వేస్తుంది. ఆ తరువాత చేసే రసాయన చికిత్సల ద్వారా, మరికొన్ని ప్రత్యేక ఔషధాల ద్వారా ధాతు పుష్టి జరిగి వ్యా«ధినిరోధక శక్తి, ఓజస్సు (ప్రాణశక్తి) పెరుగుతాయి. అలా సొరియాసిస్ సమూలంగా తొలగిపోతుంది. 

అప్పటికే ఎన్నో ఏళ్లుగా సొరియాసిస్ ఉన్నవారు ఏటా ఒకసారి పంచకర్మ చికిత్సలు తీసుకుంటే జీవితంలో మరోసారి సొరియాసిస్ వచ్చే అవకాశమే ఉండదు. ఏటా ఒకసారి పంచకర్మ చికిత్సలు చేసుకోవడం అంటే అది సొరియాసిస్‌నే ఉద్దేశించి మాత్రమే అని కాదు. శరీరంలో ఆమం పేరుకుపోయి భవిష్యత్తులో ఇతరమైన మరే వ్యాధీ రాకుండా చేయడానికి ఈ పంచకర్మ చికిత్సలు తోడ్పడతాయి. సొరియాసిస్ తగ్గపోయినా మళ్లీ వస్తుందేమోనన్న దిగులు ఎందుకు? నిపుణులైన ఆయుర్వేద వైద్యులతో చికిత్సలు తీసుకోండి సొరియాసిస్ జీవితంలో కనిపించకుండా మటుమాయమవుతుంది.

పంచకర్మ చికిత్సలతో శరీరంలోని ఆమాన్ని తొలగించడంతోపాటు, వాత, పిత్త, కఫాలను సమస్థితికి తీసుకు రావడం ద్వారా ఆయుర్వేదంలో తొలి అడుగు వేస్తుంది. ఆ తరువాత చేసే రసాయన చికిత్సల ద్వారా, మరికొన్ని ప్రత్యేక ఔషధాల ద్వారా ధాతు పుష్టి జరిగి వ్యా«ధినిరోధక శక్తి, ఓజస్సు (ప్రాణశక్తి) పెరుగుతాయి. అలా సొరియాసిస్ సమూలంగా తొలగిపోతుంది.

No comments: