Wednesday, November 7, 2012

కాంపిటీటివ్ ఎగ్జామ్- ఏఐఈఈఏ

ఏఐఈఈఏ-యూజీ:
ఇందులో ర్యాంకు సాధించినవారు మొత్తం 11 యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. దీనికి విద్యార్థులు స్ట్రీమ్-ఏ, స్ట్రీమ్-బీలలో ఒక దాన్ని ఎంచుకోవాలి.
స్ట్రీమ్-ఏ (అగ్రికల్చరల్/బయాలజీ): అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీస్, హోం సైన్స్, సెరికల్చర్, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి సబ్జెక్టులుగా బయాలజీ/అగ్రికల్చర్/హోంసైన్స్‌లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
స్ట్రీమ్-బీ (మ్యాథమెటిక్స్): దీని ద్వారా అగ్రి ఇంజనీరింగ్, డెయిరీ టెక్నాలజీ, అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. కొన్ని అగ్రి వర్సిటీలు ఫుడ్ సైన్స్, బయోటెక్నాలజీ, ఫారెస్ట్రీ కోర్సుల్లో కూడా ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే 10+2లో బయాలజీ చదివి ఉండాలి.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులు 40 శాతం) ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.

వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 17-23 ఏళ్లు.
పరీక్ష విధానం: ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో రెండున్నర గంటల వ్యవధిలో జరిగే పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం మూడు సబ్జెక్టుల్లో 180 ప్రశ్నలుంటాయి. రెండు స్ట్రీమ్‌ల విద్యార్థులకు ఫిజిక్స్ నుంచి 60 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. ఇక మూడో సబ్జెక్టు కింద స్ట్రీమ్-ఏ విద్యార్థులు బయాలజీ/అగ్రికల్చర్‌లలో ఒకదానిని, స్ట్రీమ్-బీ విద్యార్థులు మ్యాథ్స్‌ను ఎంచుకోవాలి. దీనిలో కూడా 60 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.

No comments: