Wednesday, November 7, 2012

సివిల్స్-2013..

సివిల్స్-2013.. షెడ్యూల్ విడుదలైంది.. డే టు డే డెడ్‌లైన్లతో ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైంది. పోటీలో లక్షల నుంచి వేలకు.. వేల నుంచి వందలకు చేరుకోవాలంటే పకడ్బందీ వ్యూహాలు.. పక్కా ప్రిపరేషన్ ప్లాన్‌తోనే సాధ్యం. ముఖ్యంగా ‘ఒక్క’ మార్కు కూడా ముఖ్యమైన మొదటి దశ ప్రిలిమ్స్ కోసం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. షెడ్యూల్ ప్రకారం ఇంకా ఆరు నెలల సమయం అందుబాటులో ఉన్న ప్రిలిమ్స్.. ఆ తర్వాత మరో నాలుగు నెలలకు నిర్వహించే మెయిన్‌‌స కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై లాంగ్‌టర్మ్ గెడైన్స్


దాదాపు రెండు లక్షలు.. అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల సంఖ్య. 10 నుంచి పన్నెండు వేలు.. మొత్తం మూడు దశల (ప్రిలిమినరీ, మెయిన్‌‌స, ఇంటర్వ్యూ) ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమ్స్‌లో వడపోత ద్వారా మలి దశ మెయిన్‌‌స కోసం ఎంపిక చేసే అభ్యర్థుల సంఖ్య. అటు.. ఇటుగా రెండు వేలు.. తుది దశ ఇంటర్వ్యూకి ఎంపికవతున్న వారి సంఖ్య. ఈ గణాంకాలు చాలు.. సివిల్స్‌లో విజయానికి ఏ స్థాయి కృషి చేయాలో అర్థం చేసుకోవడానికి! అంతమాత్రానా డే అండ్ నైట్ కష్టపడి చదవక్కర్లేదు. డే టు డే డెడ్‌లైన్లు విధించుకుంటూనే ఇష్టపడి అడుగులు వేస్తే ఒక్కో మెట్టు ఎక్కొచ్చు.



తొలి మెట్టు.. పట్టుదల:

‘సివిల్స్ రాయాలి’.. అనే ఆలోచన వచ్చిన అభ్యర్థి విజయానికి దోహదం చేసే తొలిమెట్టు పట్టుదల. ఆ పట్టుదల ఉంటే పరీక్ష క్లిష్టత? ప్రిపరేషన్ ఎలా సాగించాలి? ఎలా చేస్తే విజయం సొంతమవుతుంది? వంటి అన్ని ప్రశ్నలకు సమాధానం లభించినట్లే. లక్షల్లో పోటీ కూడా ఏమాత్రం భయపెట్టదు. అదే సగం విజయానికి నాంది. టన్నులకొద్దీ పరిశ్రమ, లేశమాత్ర తెలివితేటలు.. ఇదే విజయ సూత్రం.



మొదలిలా!

పట్టుదల అనే తొలిమెట్టు మీద నిలదొక్కుకున్న అభ్యర్థి తక్షణ కర్తవ్యం ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టడం. మూస ధోరణిలో కాకుండా శాస్త్రీయంగా దీనికి సిద్ధం కావాలి. ఇందుకోసం ముందుగా అవగాహన ఏర్పరచుకోవాల్సిన అంశం సివిల్స్ సిలబస్. ప్రిలిమ్స్, మెయిన్‌‌స పరీక్షల్లో ఆయా సబ్జెక్టుల సిలబస్‌ను ఆసాంతం క్షుణ్నంగా పరిశీలించాలి. గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను విశ్లేషించాలి. ఫలితంగా ప్రాధాన్య, అప్రాధాన్య అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అంశాలపై స్పష్టత లభించి ప్రిపరేషన్ ప్రారంభ శైలి అవగతమవుతుంది.



ప్రిపేర్ విత్ సైంటిఫిక్ అప్రోచ్:

సిలబస్‌పై అవగాహన తర్వాత పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. ఒక అంశానికి సంబంధించి అనేక పుస్తకాలను అనుసరిస్తే మరింత ఫలితం పొందొచ్చనే ఆలోచనను విడనాడి.. శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేయాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడు గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? ముఖ్యమైన విభాగాలు ఏంటి? సిలబస్ ఏంటి? అని విశ్లేషించుకుంటూ సాగాలి. ‘ఒక సబ్జెక్ట్ పూర్తయ్యాక మరో సబ్జెక్ట్‌కు సమయం కేటాయిద్దాం’ అనే ఆలోచనకు బదులు.. ప్రతిరోజు చదివే సమయంలో అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యమివ్వాలి. ఇటీవల సివిల్స్ ప్రిలిమ్స్‌లో అధిక ప్రాధాన్యం లభిస్తున్న అంశాలు ఎకానమీ, పాలిటీ. వీటిలో కన్వెన్షనల్ ఏరియాస్‌ను కాంటెంపరరీ ఇష్యూస్‌తో అనుసంధానం చేస్తూ ప్రశ్నలొస్తున్నాయి. ఈ రెండు సబ్జెక్ట్‌ల విషయంలో ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించి బేసిక్స్‌ను, బ్యాక్‌గ్రౌండ్‌ను.. సమకాలీన పరిణామాలతో బేరీజు వేసుకుంటూ ‘బ్యాలెన్‌‌సడ్’గా ప్రిపరేషన్ సాగించాలి.



సిలబస్ వర్గీకరించుకుంటూ..

మరో ముఖ్య నియమం.. నిర్దేశిత సబ్జెక్టులు.. అందులోని అంశాలు.. అనుసంధానం చేసుకోవడానికి మార్గాలను గుర్తించి ఆ మేరకు సిలబస్‌ను వర్గీకరించుకుంటే ప్రిపరేషన్ సులువుగా ఉంటుంది. ఉదా: జీఎస్.. ఇది ప్రిలిమ్స్, మెయిన్‌‌స రెండింటిలోనూ ఉంటుంది. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను పరిశీలించాలి. దీని ప్రకారం చదవాల్సిన అంశాలను విభజించుకోవాలి. మొదట ప్రిలిమ్స్ సిలబస్‌ను, తర్వాత మెయిన్‌‌స సిలబస్‌ను చదవడం ఉపయుక్తం. హిస్టరీ, పొలికల్ సైన్‌‌స/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా ఎంచుకున్న వారికి ఇది అత్యంత ఆవశ్యకమైన వ్యూహం. కారణం.. ఈ రెండు పరీక్షలకు పేర్కొన్న సిలబస్ దాదాపు ఒకేతీరుగా ఉంటుంది.



శైలి మారుతోంది.. అభ్యర్థులూ మారాలి:

యూపీఎస్సీ ప్రశ్నలు అడిగే శైలి మారుతోంది. ప్రతి అంశానికి నేపథ్యంతో కూడిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు.. తాజా చర్చనీయాంశమైన గ్యాస్ సబ్సిడీ సిలిండర్ల సంఖ్య ఆరుకు తగ్గింది. దీనికి అంతర్జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అనేక కారణాలు ఉన్నాయి. వీటన్నిటినీ గుర్తించి విశ్లేషించాలి. వాటిని నోట్స్ రూపంలో రాసుకోవాలి. అదే విధంగా చమురు ధరల పెంపు అంశం. దీనికి కారణమైన అంతర్జాతీయ చమురు నిల్వల ఉత్పత్తిలో, ధరల్లో ఒడిదుడుకులు, దిగుమతి సుంకాలు ఇలా ఎన్నో అంశాలు సమ్మిళితమై ఉంటాయి. వీటన్నిటిని విశ్లేషించాలి. పరీక్షలో ప్రతీది ప్రశ్నార్హమే అని గుర్తించాలి.

ఇప్పట్నుంచే మెయిన్స్ దిశగా:

‘మెయిన్స్ కంటే ప్రిలిమ్స్ కష్టం. ప్రిలిమ్స్ గట్టెక్కితే మెయిన్‌‌సలో ఇట్టే రాణించొచ్చు’.. అనేది సాధారణంగా అత్యధికుల అభిప్రాయం. ఇది వాస్తవం. కానీ ప్రిలిమ్స్ తర్వాతే మెయిన్స్ కు ఉపక్రమిద్దాం అనే భావన సరికాదు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటినీ కలిపి చదవాలి. ఆప్షనల్స్‌కు సంబంధించి ప్రిలిమ్స్ నాటికి ఒక ఆప్షనల్‌ను పూర్తి చేసుకోవాలి. ఉదా: తెలుగు సాహిత్యం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్స్‌గా ఎంచుకుంటే ప్రిలిమ్స్ నాటికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్‌ను పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. వాస్తవానికి ఇది సులభం కూడా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లోని పలు అంశాలు ప్రిలిమ్స్ పాలిటీలోని అనేక అంశాలతో సరితూగుతాయి.



ఆప్షనల్ ఎంపిక.. అభిరుచి ఆధారంగా:

షెడ్యూల్ ప్రకారం మెయిన్‌‌సకు సరిగ్గా సంవత్సరం సమయం అందుబాటులో ఉంది. కానీ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ సమయంలోనే ఆప్షనల్స్‌ను పేర్కొనాల్సి ఉంటుంది. ఇప్పట్నుంచే ఆప్షనల్ ఎంపిక విషయంలో కసరత్తు ప్రారంభించాలి. రెండు ఆప్షనల్స్‌లో ఒకటి తమ విద్యా నేపథ్యానికి సంబంధించినది ఎంచుకోవడం అభిలషణీయం. డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవడం ఉపయుక్తం. ఎంతోకొంత అవగాహన ఉంటుంది. చదివితే త్వరగా అర్థమవుతుందనే కోణాల్లో ఈ ఆప్షనల్ తీసుకోవచ్చనేది నిపుణుల మాట. మరెన్నో ఆప్షనల్స్ ఉన్నాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, సైకాలజీ, తెలుగు సాహిత్యం పాపులర్ ఆప్షనల్స్‌గా నిలుస్తున్నాయి.



ఆప్షనల్ ఎంపికలో పరిగణించాల్సిన అంశాలు.. స్వీయ అభిరుచి; స్కోరింగ్ సబ్జెక్ట్; పాపులర్ ఆప్షనల్; సులువుగా అర్థం చేసుకోగల సబ్జెక్ట్; మెటీరియల్ లభ్యత; విద్యా నేపథ్యం.



మెటీరియల్.. క్వాంటిటీ కాదు.. క్వాలిటీ ముఖ్యం:

అభ్యర్థులు గందరగోళానికి గురయ్యే అంశం మెటీరియల్ ఎంపిక. ప్రస్తుతం విస్తృతమైన మెటీరియల్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం అనే సూత్రాన్ని అనుసరించాలి. సిలబస్‌కు అనుగుణంగా అన్ని అంశాలు కవరైన రెండు, మూడు పుస్తకాలు సరిపడతాయి. ఆయా ప్రచురణలు, సిలబస్‌ను బేరీజు వేసుకోవాలి. ప్రిపరేషన్‌కు ముందే కొంత సమయం కేటాయించుకోవాలి. లైబ్రరీలు, ఇంటర్నెట్ తదితర మార్గాల ద్వారా ఆయా పుస్తకాల్లో ప్రచురించిన అంశాలు సిలబస్‌తో సరితూగుతున్నాయా? లేదా? విశ్లేషణ నాణ్యంగా ఉందా? లేదా? అని చూసి.. నాణ్యమైన పుస్తకాన్ని ఎంచుకోవాలి.



పేపర్-2.. ఇంగ్లిష్‌దే కీలక పాత్ర:

పేపర్-2 ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో కీలకంగా మారిన సబ్జెక్ట్ ఇంగ్లిష్. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్‌పై అధిక దృష్టి సారించాలి. అందులోనూ స్పీడ్ రీడింగ్ అండ్ అండర్ స్టాండిగ్ దిశగా కృషి చేయాలి. గత రెండేళ్లుగా అడుగుతున్న ప్రశ్నల శైలి కూడా ఈ తరహాలోనే ఉంటోంది. ముఖ్యంగా ప్యాసేజ్ కొశ్చన్‌‌సకు ప్రాధాన్యమివ్వాలి. గత పరీక్షను విశ్లేషిస్తే పేరాగ్రాఫ్‌లు చిన్నవిగా.. ఒక్కో ప్యాసేజ్‌కు ప్రశ్నలు నాలుగే ఉన్నప్పటికీ సగటు పదాల సంఖ్య 350గా ఉంది. కాబట్టి వేగంగా చదవడం, అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. పేపర్-2లో సిలబస్ అంశాల ప్రకారం తొలిసారి (2010) పరీక్షలో మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్నవారే అధికంగా ఉత్తీర్ణత సాధించడం, దీనిపై నాన్-మ్యాథ్‌‌స అభ్యర్థుల నుంచి విమర్శల నేపథ్యంలో 2011లో పంథా మారింది. కాంప్రెహెన్షన్, రీజనింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. తదుపరి పరీక్షలోనూ ఇదే తీరు కొనసాగొచ్చు.

ప్రతి మార్కు కీలకమే:

ప్రిలిమ్స్ విషయంలో ప్రతి మార్కు కీలకమే. ఒక్క మార్కు తేడాతో మెయిన్‌‌సకు ఛాన్‌‌స కోల్పోయే వారు వేలల్లో ఉంటారు. గత ఏడాది రెండు పేపర్లు కలిపి కటాఫ్ 208గా ఉందని ఒక అంచనా. దీంతో కచ్చితంగా సమాధానం తెలిసిన ప్రశ్నలనే ఎంచుకోవాలి. పేపర్-1లో 50 శాతం; పేపర్-2లో 70 శాతం స్కోర్ చేసే విధంగా ప్రిపరేషన్‌ను పూర్తి చేసుకోవాలి.



మెయిన్‌‌ లో మార్పులు?

సివిల్స్ ఔత్సాహికుల్లో నెలకొన్న మరో గందరగోళం మెయిన్‌‌ లోనూ మార్పులు జరగనున్నాయనేదే. ఆప్షనల్స్ విషయంలో క్రేజీ, పాపులర్ వంటి కోణాలు; సివిల్ సర్వెంట్లకు పరిపాలన, న్యాయ, సామాజిక పరమైన అంశాలపై అవగాహన తప్పనిసరి అనే రెండో పాలన సంస్కరణల కమిటీ సిఫార్సుల నేపథ్యంలో సివిల్స్‌లో మార్పులకు అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలోనే 2011 నుంచి ప్రిలిమ్స్‌లో మార్పులు జరిగాయి. ప్రస్తుతం మెయిన్‌‌సలో మార్పులపై అధ్యయనానికి నిగర్వేకర్ కమిటీని నియమించింది కేంద్ర ప్రభుత్వం. మార్పులు చేసే ముందు అభ్యర్థులకు కనీస సమయం లభించేలా చూడాలని రెండో పాలనా సంస్కరణ కమిషన్ స్పష్టం చేసింది. దీంతో మార్పులు ఉంటే ఒక ఏడాది ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి మెయిన్‌‌సలో మార్పులు లేనట్లే అనేది కొందరి వాదన. సివిల్స్ షెడ్యూల్ ప్రకారం మెయిన్‌‌స పరీక్షలు నవంబర్ 8, 2013 నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే దాదాపు ఏడాది సమయం అందుబాటులో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మరో పదిహేను లేదా ఇరవై రోజుల్లో మెయిన్‌‌సలో మార్పులు చేస్తూ నిర్ణయం వెలువడొచ్చు అనేది మరికొందరి అభిప్రాయం.

ఒకవేళ రెండో వాదనే నిజమవుతుందని భావించినా పదిహేను, ఇరవై రోజుల్లో ఏదో ఒక నిర్ణయం వెలువడటం ఖాయం. కాబట్టి ఈ సమయంలో ప్రిలిమ్స్ సిలబస్ అనాలిసిస్, మెటీరియల్ అన్వేషణ వంటివి పూర్తి చేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణుల సూచన.



ప్రిలిమినరీ.. ఇదీ శైలి

ప్రిలిమ్స్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు ఉంటాయి. అవి..

= పేపర్-1 (జనరల్ స్టడీస్ 100 ప్రశ్నలు-200 మార్కులు);

= పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్ 80 ప్రశ్నలు-200 మార్కులు).

ప్రతి పేపర్‌కు సమయం రెండు గంటలు.

పేపర్-1 సిలబస్:

= కరెంట్ అఫైర్‌‌స; భారత చరిత్ర-జాతీయోద్యమం; జాగ్రఫీ; ఇండియన్ పాలిటీ; ఎకానమీ; ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ; జనరల్ సైన్‌‌స.

పేపర్-2 సిలబస్:

= కాంప్రెహెన్షన్; ఇంటర్ పర్సనల్ స్కిల్స్; లాజికల్ రీజనరింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్.



ఉపయోగపడే పుస్తకాలు

పేపర్- 1:

= ఆరు నుంచి 12వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు

= ప్రాచీన, మధ్యయుగ చరిత్ర -సతీష్ చంద్ర.

= ఇండియన్ పాలిటీ -లక్ష్మీకాంత్.

= ఇండియన్ ఎకానమీ -బ్యాచిలర్ డిగ్రీ పుస్తకాలు, ఆర్థిక సర్వేలు-నివేదికలు

= జనరల్ సైన్‌‌స -వాట్, వై అండ్ హౌ (పబ్లికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ డెరైక్టరేట్)

= కరెంట్ అఫైర్‌‌స: ప్రామాణిక దినపత్రికలు, యోజన, కురుక్షేత్ర మ్యాగజైన్లు

పేపర్- 2:

= ఎ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్. అగర్వాల్

= క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ -ఆర్.ఎస్. అగర్వాల్

= అనలిటికల్ రీజనింగ్ -ఎం.కె.పాండే

= ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ - ఎ.కె.కపూర్



ప్రిపరేషన్ టైం ప్లాన్ ఛార్‌‌ట

= జీఎస్‌కు సరితూగే ఆప్షనల్‌ను ఎంచుకోవాలి.

= ప్రిలిమ్స్‌తోపాటు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ ప్రారంభించి జనవరి చివరికి పూర్తి చేయాలి.

= ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, మెయిన్‌‌సలోని జనరల్ స్టడీస్ సిలబస్‌ను చదువుతూ మార్చి 15కి పూర్తి చేయాలి.

= మార్చి 15 నుంచి ప్రిలిమ్స్‌కే కేటాయించాలి.

= ప్రిలిమ్స్‌ పూర్తయిన రోజు రోజు నుంచే రెండో ఆప్షనల్‌కు ఉపక్రమించాలి. 45 రోజుల్లో పూర్తి చేయాలి.

= తర్వాత మెయిన్‌‌స వరకు రెండు ఆప్షనల్స్‌ను ఉమ్మడిగా చదవాలి.

= ప్రతి రోజు ఎనిమిది గంటలు కేటాయించాలి.



సివిల్స్-2013 షెడ్యూల్

నోటిఫికేషన్ తేదీ: ఫిబ్రవరి 2, 2013

ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: మార్చి 4, 2013

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేదీ: మే 19, 2013

మెయిన్‌‌స ఎగ్జామినేషన్‌‌స : నవంబర్ 8, 2013 నుంచి

No comments: