Thursday, October 4, 2012

బ్యాక్టీరియా పెట్టే బంగారు గుడ్లు!


అదో శక్తిమంతమైన బ్యాక్టీరియా. అంతేకాదు.. 24 క్యారట్ల బంగారం గుడ్లను కూడా పెడుతుంది!


వాషింగ్టన్: అదో శక్తిమంతమైన బ్యాక్టీరియా. విషపూరితమైన లోహాలను సైతం తేలికగా అరిగించుకుంటుంది. అంతేకాదు.. 24 క్యారట్ల బంగారం గుడ్లను కూడా పెడుతుంది! బ్యాక్టీరియా.. బంగారం గుడ్లను పెట్టడమేంటీ.. అనిపిస్తోంది కదూ? కానీ.. ‘కుప్రియవైడస్ మెటాలిడరన్స్’ అనే ఓ బ్యాక్టీరియా విషపూరితమైన రసాయనిక సమ్మేళనమైన గోల్డ్‌క్లోరైడ్‌ను తినేసి 24 క్యారట్ల బంగారాన్ని స్రవిస్తుందని కనుగొన్నామంటున్నారు మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.




పకృతిలో సహజసిద్ధంగా ఏర్పడే గోల్డ్‌క్లోరైడ్ (లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారు)ను ఈ బ్యాక్టీరియా తినేసి వారం రోజుల్లో బంగారం ముద్దలను విడుదల చేస్తుందని పరిశోధన బృందం సారథి కజెమ్ కషెఫీ వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని ‘గ్రేట్ వర్క్ ఆఫ్ మెటల్ లవర్’ పేరుతో ఆర్ట్ ఇన్‌స్టలేషన్‌గా కూడా రూపొందించామని, దీనిని ఆస్ట్రియాలో జరగనున్న సైబర్ ఆర్ట్ కాంపిటీషన్‌లో ప్రదర్శించనున్నామని తెలిపారు. అయితే, ఈ పద్ధతిలో బంగారు తయారీ వల్ల పర్యావరణ, ఆర్థిక, నైతికపరమైన అనేక సందేహాలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

No comments: