జన్యుమార్పిడి పంటల వ్యతిరేకులపై ఐసీఏఆర్ డీడీజీ స్వపన్‌కుమార్ దత్తా వ్యాఖ్య
అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు వేదికగా జన్యుమార్పిడి పంటలపై మరోమారు వాడివేడి చర్చలు మొదలయ్యాయి. ఈ పంటలతో రైతుకు చేటు తప్పదని కొందరు... మేలు తప్ప కీడు లేదని ఇంకొందరు తమతమ వాదనలు వినిపిస్తున్నారు. కానీ... భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ స్వపన్ కుమార్ దత్తా మాత్రం సైన్స్ గురించి తెలియని వారే జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకిస్తారని స్పష్టం చేస్తున్నారు. బయోటెక్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుతో ప్రస్తుతమున్న గందరగోళ పరిస్థితులు సర్దుకుంటాయని, తగిన అనుమతులు లభిస్తే... త్వరలోనే గోల్డెన్ రైస్‌తోపాటు ఐరన్ రైస్ కూడా అందుబాటులోకి రావచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూ ఇలా అన్నారు
ఆ వివరాలు...
అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు వేదికగా జన్యుమార్పిడి పంటలపై మరోమారు వాడివేడి చర్చలు మొదలయ్యాయి. ఈ పంటలతో రైతుకు చేటు తప్పదని కొందరు... మేలు తప్ప కీడు లేదని ఇంకొందరు తమతమ వాదనలు వినిపిస్తున్నారు. కానీ... భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ స్వపన్ కుమార్ దత్తా మాత్రం సైన్స్ గురించి తెలియని వారే జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకిస్తారని స్పష్టం చేస్తున్నారు. బయోటెక్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుతో ప్రస్తుతమున్న గందరగోళ పరిస్థితులు సర్దుకుంటాయని, తగిన అనుమతులు లభిస్తే... త్వరలోనే గోల్డెన్ రైస్‌తోపాటు ఐరన్ రైస్ కూడా అందుబాటులోకి రావచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూ ఇలా అన్నారు
ఆ వివరాలు...
జన్యుమార్పిడి పంటలతో పర్యావరణానికి నష్టం కలుగుతోం దని ఒకవైపు ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు శాస్త్రవేత్తలేమో... పెరుగుతున్న మానవ అవసరాలను తీర్చాలంటే ఇదే మేలైన మార్గమంటున్నారు. మీరేమంటారు?
సైన్స్ గురించి తెలియని వారే జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకిస్తారు. ఆధునిక బయోటెక్నాలజీలో జన్యుమార్పిడి తాజా పద్ధతి. సైన్స్‌పట్ల అవగాహన ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు మనిషి ఆకలిని తీర్చే లక్ష్యంతో పంట దిగుబడులను పెంచేందుకు ఈ టెక్నాలజీని వాడటంలో తప్పులేదు. రైతుకు లాభాలు తక్కువన్న వాదనలోనూ పస లేదు. లాభముంది కాబట్టే... వాళ్లు ఎక్కువ డబ్బుపోసి విత్తనాలు కొనిమరీ సాగు చేస్తున్నారు. ఇక్కడ ఒక్క విషయం స్పష్టం చేస్తాను... పత్తి విషయంలో దేశం ఇప్పటికే స్వావలంబన సాధించింది. ఈ నేపథ్యంలో బీటీ పత్తి సాగు విస్తీర్ణాన్ని తగ్గించమని కోరాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బీటీ పత్తి కోసం ఇతర పత్తి వంగడాలను పణంగా పెట్టలేం. మనకు జీవ వైవిధ్యాన్ని పెంపొందించే అన్ని రకాల వంగడాలూ కావాలి. అదే సమయంలో ఉత్పాదకత కూడా ఎక్కువగా ఉండాలి. రైతులకు గిట్టుబాటయ్యే వ్యవసాయం జరగాలన్నదే మా అభిమతం కూడా. పంటకు తగ్గ రాబడి రాకపోవడం రైతుకే కాదు... ప్రభుత్వానికీ మంచిది కాదు.
మరి... జన్యుమార్పిడి పంటలన్నింటి సాగుకు అనుమతివ్వాలా? నియంత్రణ ఏదీ అవసరం లేదంటారా?
నియంత్రణ వ్యవస్థ కచ్చితంగా ఉండాల్సిందే. అందుకోసమే బయోటెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పా టు కోసం ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం ఇది పార్లమెంట్ పరిధిలో ఉంది. జన్యుమార్పిడి పంటల విషయంలో ఉన్న అడ్డంకులన్నింటినీ ఏకగవాక్ష పద్ధతిలో పరిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. నిర్దిష్ట సమయంలోనే దరఖాస్తులను పరిష్కరించేందుకు ఏర్పాట్లు ఉంటాయి. త్వరలోనే ఇది పార్లమెంటు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాము.
టీ వంకాయ తరువాత దేశంలో అనుమతుల కోసం ఎదురు చూస్తున్న బీటీ పంటలెన్ని?
చాలా ఉన్నాయి. ఇక్రిశాట్ అభివృద్ధి చేస్తున్న బీటీ వేరుశనగ వీటిల్లో ఒకటి. కోల్‌కతా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గోల్డెన్ రైస్ తరహాలో పనిచేసే ‘ఐరన్ రైస్’ వంగడం ఒకటి సిద్ధమైంది. కానీ పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు మెరుగైన ప్రత్యామ్నాయమైన ఈ పంట భారత్‌లో ఓ కలగా మిగిలిపోతోంది. బీటీ పత్తి, వంకాయలపై మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాలు దీనికి కొంతవరకూ కారణమవుతున్నాయి. జన్యుమార్పిడి పంటలంటే... కేవలం బీటీ మాత్రమే కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. బీటీ వరి వంగడాలు కూడా కొన్ని అనుమతుల కోసం సిద్ధంగా ఉన్నాయి.
కానీ బీటీ వరి వద్దే వద్దని కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి కదా?
అది వారి ఇష్టం. కానీ ఇప్పుడు వీటి అవసరం లేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఎలాంటి చీడపీడలను ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలియదు. పశ్చిమ బెంగాల్‌లో కొన్నేళ్ల క్రితం వరకూ అసలు సమస్యేగానీ ఓ చీడ ప్రస్తుతం బాగా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే సాగుకు కాకపోయినా... శాస్త్రీయ విశ్లేషణకైనా అవకాశం కల్పించాలి.
భూ సారాన్ని పెంచేందుకు రెండు రకాల పంటలను కలిపి సాగు చేయాలని మీరు సూచించారు. ఈ సూచన అమలు చేసే అవకాశముందా?
ఈ విషయంలో నాకు అధికారం లేదు. ఒకవేళ ఉంటే మాత్రం... భూసారం గణనీయంగా తగ్గిపోయిన ప్రాంతాల్లో వరి, గోధుమ వంటి ఆహార ధాన్యాల స్థానంలో పప్పుధాన్యాలు సాగయ్యేలా చేస్తాను. ఎదిగిన తరువాత ఈ మొక్కల్ని మళ్లీ భూమిలోకి కలిపేయడం ద్వారా... లేదంటే స్థానికంగా లభించే సేంద్రియ ఎరువుల ద్వారా భూమిసారాన్ని పెంచవచ్చు. ఇంకో మార్గం ఏమిటంటే... నిస్సారమైన భూముల్లో కొన్నేళ్లపాటు అసలు సాగే జరక్కుండా చూడటం. మనదేశం లో అది దాదాపు అసాధ్యం. ప్రభుత్వాలు ఏదైనా కరువు, కాట కాలు వచ్చినప్పుడు మాత్రమే రైతులకు పరిహారమిచ్చేందుకు ముందుకొస్తాయి. పర్యావరణ పరంగా చూస్తే నిస్సారమైన భూములతోనూ మనకు విపత్తు ఉంది. కానీ ప్రభుత్వాలు ఇలాంటి వాటికి నిధులిచ్చేందుకు ఆసక్తి చూపవు.

No comments:
Post a Comment