చక్కటి, రుచికరమైన టీని వేగవంతంగా తయారు చేయగల టీ మిషన్‌ను ఆవిష్కరించామని కేంబ్రిడ్జ్ పరిశోధకులు ప్రకటించారు. సంప్రదాయ పద్ధతుల్లో టీ కాచడానికి వీడ్కోలు పలుకుతూ, ఈ మిషన్ కేవలం రెండే నిమిషాల్లో టీ తయారు చేయగలదని వివరించారు. దీని ద్వారా టీ ‘స్ట్రాంగ్‌నెస్’ స్థాయిలను సెట్ చేసుకోవచ్చు. ధర పరంగా ఇది కాఫీ మిషన్‌లకన్నా తక్కువ స్థాయిలోనే దొరుకుతుంది. కాఫీ మిషన్లకు తమ సరికొత్త ఆవిష్కరణ సవాలు విసురుతుందని, టీని కొత్త పుంతలు తొక్కిస్తుందని ఆవిష్కర్తలు విశ్వాసం వ్యక్తం చేశారు.
Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts
Tuesday, November 27, 2012
1000 MW Solar Power Through Bidding......
బిడ్డింగ్ ద్వారా వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి మృత్యుంజయ్ సాహు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 2013 కంటే ముందుగా 1,000 మెగావాట్లు వచ్చేలా డిస్కంలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిస్కంలు సూచించిన ప్రాంతాల్లో ప్లాంటును ఏర్పాటు చేయడంతోపాటు బిడ్డింగ్‌లో తక్కువ ధరను కోట్ చేసిన సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాలని డిస్కంలను ఆదేశించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిన ధర కంటే డెవలపర్లు ఎక్కువ ధరను పేర్కొంటే... ఆ మొత్తాన్ని పరిశ్రమల నుంచి వసూలు చేసుకోవాలని ఇంధనశాఖ సూచించింది. పరిశ్రమలు ముందుకురాని పక్షంలో ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొంది.
Subscribe to:
Posts (Atom)
