Showing posts with label Flash news. Show all posts
Showing posts with label Flash news. Show all posts

Friday, November 2, 2012

మోడీకి తోడెవరు?

'మీ భార్య ఎక్కడ' అంటూ గుజరాత్ సీఎంను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. తన భార్య యశోద గురించిన వివరాలపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని.. ఆమెను ఎందుకు దాచిపెడుతున్నారని నిలదీశారు. "యశోదా బెన్‌ను మోడీ పెళ్లి చేసుకున్నారా లేదా? అలా అయితే విడాకులిచ్చారా? ఆమెతో ఎందుకు కలిసి ఉండట్లేదు? తన వైవాహిక స్థితిని ఆయన ఎందుకు ప్రకటించలేదు'' అని దిగ్విజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు

ఆయన వివాహితుడా.. లేక బ్రహ్మచారా..?
వైవాహిక జీవితానికి ఎందుకు దూరం
ఆశయాలే కారణమా?
మోడీ వ్యక్తిగత జీవితంలోని సత్యాలు..


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బ్రహ్మచారే కానీ, అందరూ అనుకుంటున్నట్లు ఆయన అవివాహితుడు మాత్రం కాదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన వివాహితుడా, అవివాహితుడా అన్న అంశం కూడా ప్రత్యర్థుల ప్రచారానికి ఓ అస్త్రంగా మారింది. మోడీకి పెళ్లి అయింది. ఆయనకు భార్య ఉన్నారు. సంతానం మాత్రం లేదు. చాలా కాలంపాటు మోడీ భార్య గురించి ఎవరికీ తెలియలేదు. కానీ, 2002లో గోద్రా అల్లర్లు జరిగిన తరువాత రాజకీయ ప్రత్యర్థులు మోడీ వ్యక్తిగత చరిత్రను తవ్వి తీయడంతో ఆమె ఉనికి వెలుగులోకి వచ్చింది.

సాధారణ వ్యక్తిగా..
నరేంద్ర మోడీ భార్య పేరు.. యశోదాబెన్ చిమన్‌లాల్ మోడీ. వయసు 57 సంవత్సరాలు. ప్రస్తుతం గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా, రాజోసనా గ్రామంలో ఓ ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నారు. ముడతలు పడిన మామూలు చీర, కొద్దిగా ఒంగిన నడుము, కాళ్లకు రబ్బరు చెప్పులు, వయసుకు మించిన వృద్ధాప్య లక్షణాలతో ఎంతో సాధారణ వ్యక్తిగా కనిపిస్తారు.. యశోదాబెన్. చూసినవారికి ఆమె గుజరాత్ సీఎం మోడీ భార్య అంటే ఒక పట్టాన నమ్మకం కలగదు. ఆమె ఎవరినీ కలుసుకోవడానికి ఇష్టపడరు.

నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ తన భర్త అని సగర్వంగా చెప్పుకొంటారు. తన భర్త ఓ గొప్ప దేశ నాయకుడని, అంతకు మించి ఓ గొప్ప జాతీయవాది అని గొప్పగా చెబుతుంటారు. ఇంతకంటే మోడీ గురించి ఆమె ఏమీ మాట్లాడరు. ఆ ఊళ్లో యశోదాబెన్ నరేంద్ర మోడీ భార్యగానే అందరికీ తెలుసు. మోడీ కూడా ఏనాడూ ఆమె తన భార్య కాదని గానీ, అవునని గానీ చెప్పలేదు. ఆయన కూడా ఎక్కడా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించరు. సుమారు 2,500 జనాభా కలిగిన ఆ గ్రామంలో ముస్లింల సంఖ్యే ఎక్కువ. ఆమె పాఠాలు చెప్పేది కూడా ఎక్కువగా ముస్లిం విద్యార్థులకే.

చిన్నప్పుడే పెళ్లి
మోడీ స్వస్థలమైన మెహ్‌సానా జిల్లా వాద్‌నగర్ గ్రామంలో వారిద్దరికీ పెళ్లి అయిందని ఆమె బంధువులు చెప్పారు. అప్పుడు ఆమె వయసు 18. పెళ్లి జరిగే సమయానికి ఆమె చదువుకున్నది ఏడో తరగతి వరకే. అదే వారిద్దరి మ«ధ్య విభేదాలు సృష్టించిందని కొందరు బంధువులు అంటారు. పెళ్లయిన కొద్ది రోజుల తరువాత యశోదాబెన్‌ను పైచదువుల కోసం పుట్టింటికి పంపించేశారు. మోడీ ఆశయాలు, అభిరుచులకు తగినట్లు ఉన్నత విద్య అభ్యసించడం కోసం ఆమె అక్కడికి దగ్గరలోని ధోలకా పట్టణానికి వెళ్లి 1972లో ఎస్.ఎస్.సి పూర్తి చేశారు. తరువాత ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేసి, అహ్మదాబాద్‌లోనే ఓ మూడు నెలలపాటు టీచర్‌గా ఉద్యోగం చేశారు.

మలుపు తిరిగిన జీవితం
అహ్మదాబాద్‌లో టీచర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆమె వైవాహిక జీవితం మలుపు తిరిగిందని ఆమె బంధువులు చెబుతుంటారు. 1978 మార్చి 23న ఆమె బనస్కాంత జిల్లాలోని దేఖ్‌వాలీ గ్రామానికి వెళ్లి అక్కడ ఓ ప్రైమరీ టీచర్‌గా పనిచేయడం ప్రారంభించారు. ఆ తరువాత ఆమెను రూపాల్ గ్రామంలోని జిల్లా పంచాయతీ స్కూలుకు బదిలీ చేశారు. అక్కడ ఆమె 12 ఏళ్లపాటు పనిచేశారు. 1991లో ఆమె రాజసోనా గ్రామానికి వచ్చి, అక్కడ టీచర్‌గా పని చేయడం మొదలు పెట్టారు. ఆ తరువాత కూడా చాలా కాలం పాటు ఆమె తరచూ అహ్మదాబాద్ వెళ్లి వచ్చేవారు. కానీ, తనతో ఉండిపొమ్మని మోడీ ఏనాడూ కోరకపోవడంతో యశోదాబెన్ చివరికి రాజసోనాలోనే స్థిరపడిపోయారు.

ముస్లింలకెంతో అభిమానం
ఆమె తన వృత్తి పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటారని, ఎందరో ముస్లిం విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దారని స్థానిక ముస్లింలు ఆనందంగా చెబుతుంటారు. యశోదాబెన్ ఈ ఏడాది తన టీచర్ పదవికి విరమణ చేస్తున్నారు. ఆమె పట్ల అక్కడి ముస్లింలకు విపరీతమైన అభిమానం. "నరేంద్ర మోడీ ఓ జాతీయ స్థాయి నాయకుడు. ఆయన శక్తిసామర్థ్యాలు అపారం. యశోదాబెన్ ఆయనకు సరైన జోడీ కాకపోవచ్చు. కానీ, ఆమె ఆయన భార్య. కనుక ఎప్పటికైనా మోడీ ఆమెను తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నాం'' అని ఆమె ఇంటి పక్కనే కాపురం ఉంటూ, ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటున్న ముస్లిం దంపతులు చెప్పారు.

సాధారణంగా ఆమె తన భర్త గురించి మాట్లాడరు. భర్తంటే ఆమెకు భయం. బీజేపీ నాయకులు ఆమెను ఎవరితోనూ మాట్లాడనివ్వరు. కాంగ్రెస్ నాయకులు ఆమెతో మోడీ గురించి మాట్లాడించి, ఆయనను రచ్చకెక్కించాలని తరచూ ప్రయత్నిస్తుంటారు. స్కూల్ సమయంలో ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా హెడ్మాస్టర్ ఆమె మీద ఓ కన్ను వేసి ఉంచుతారు. ఇంటి దగ్గర ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా స్థానిక పెద్దలు జాగ్రత్తలు తీసుకొంటుంటారు. తన మీద మరీ ఒత్తిడి వస్తే ఆమె అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని బ్రాహ్మణవాడ గ్రామంలో ఉంటున్న తన అన్న ప్రకాశ్‌భాయ్ ఇంటికి వెళ్లిపోతారు.

ఒంటరి జీవితం
ఆమెకు ఆ స్కూల్లో ఇచ్చే జీతం పదివేల రూపాయలు. గ్రామంలోనే ఓ చిన్న ఇంట్లో ఆమె నివాసం ఉంటున్నారు. ఆమె ఎవరన్నది అందరికీ తెలిసిన విషయమే కనుక సాధారణంగా ఆమె జోలికి ఎవరూ రారు. ఆమెది పూర్తిగా ఒంటరి జీవితం. ఆదివారం వచ్చిందంటే ఆమె ఓ షేర్ ఆటో ఎక్కి తన సోదరుడి ఇంటికి వెళ్లిపోతారు. ఆయన ఓ చిన్న పచారీ దుకాణాన్ని నడుపుకొంటున్నారు. రోజంతా అక్కడే ఉండి మర్నాడు ఉదయం తిరిగి వస్తారు.

తన భర్త నుంచి ఏదైనా ఫోన్ కాల్ వస్తుందేమోనని ఆమె ప్రతి క్షణం ఎదురు చూస్తుంటారు. ఏదో ఒక రోజున ఆయన ఫోన్ చేయకపోతారా, తాను అహ్మదాబాద్ వెళ్లి ఆయనతో శేష జీవితాన్ని గడపకపోతానా అని ఆమె ఆశిస్తూ ఉంటారు. ఇక యశోదాబెన్ తన వైవాహిక జీవితం గురించి సంప్రదించని జ్యోతిషుడు ఆ చుట్టుపక్కల లేడు. భార్యాభర్తా కలిసే ఉంటారని దాదాపు అందరూ ఆమెకు జోస్యం చెప్పారు. ఆమెలో దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఓ పాలు ఎక్కువే.

స్పర్థలకు కారణమేమిటి?
ఇంతకూ, మోడీ తన భార్యను వదిలేశారా? లేక ఆమే ఆయనను విడిచిపెట్టారా? ఇది తేలని ప్రశ్నగా మారిపోయింది. అయితే, బాగా చిన్నతనం నుంచీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఉన్న మోడీకి వైవాహిక జీవితం మీద కంటే, వ్యక్తిగత ఆశయాల మీదే శ్రద్ధ ఎక్కువ. చాలామంది సంఘ్ ప్రచారక్‌ల మాదిరిగానే ఆయన పూర్తిగా సైద్ధాంతిక కార్యక్రమాలలో మునిగిపోయారు.ఆ విషయాన్ని ఆయన యశోదాబెన్‌తో అనేక పర్యాయాలు చెప్పారని, దాంతో ఆమె ఎవరి వ్యక్తిగత ఆశయాలకు వారు అంకితం కావడమే మంచిదని భావించారని, పరస్పర అంగీకారం మీద వారు విడి విడిగాఉండడం ప్రారంభించారని ఆమె బంధువులే కాక, ఇరుగు పొరుగు వారు సైతం చెబుతుంటారు.

మోడీకి తల్లి అంటే ఎంతో ప్రేమ. ఇటీవలి వరకూ ఆయన అమ్మ దగ్గరికి వెళ్లి వస్తుండేవారు. ప్రస్తుతం ఆయన ఒక్కరే ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఉంటున్నారు. మోడీ తన బంధువులెవరినీ దగ్గరకు రానివ్వలేదు. ఆయన సమీప బంధువులు పలువురు ఇంకా చిన్న ఇళ్లల్లోనో, పెంకుటిళ్లలోనో నివాసం ఉంటున్నారు. విచిత్రమేమిటంటే, గుజరాత్‌లో ఆయనను ఎక్కువగా అభిమానించేది మహిళలే. ఆయన సభలకు ఎక్కువగా హాజరయ్యేది మహిళలే.

సోనియా, రాహుల్ మోసం

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని సొంతం చేసుకున్నారు
యంగ్ ఇండియన్ పేరిట సొంత కంపెనీ
10, జన్‌పథ్‌లో వాటాదారుల సమావేశం
వందల కోట్ల ఆస్తుల కోసం పన్నాగం
సీబీఐ దర్యాప్తు జరపాలి: సుబ్రమణ్య స్వామి
కాంగ్రెస్ అప్పు ఇచ్చిదంటూ పత్రాలు

న్యూఢిల్లీ, నవంబర్ 1: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలపై జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి మరోసారి ఆరోపణలు చేశారు. వీరు ఒక 'పబ్లిక్ లిమిటెడ్' కంపెనీని తమ సొంత కంపెనీగా మార్చుకున్నారని తెలిపారు. ఢిల్లీలో రూ.1600 కోట్ల విలువ చేసే 'హెరాల్డ్ హౌస్'ను, మరిన్ని విలువైన ఆస్తులను సొంతం చేసుకునేలా పావులు కదిపార ని ఆరోపించారు. గురువారం స్వామి దీనిపై ఒక ప్రకటన జారీ చేశారు. దాని సారాంశం ఇది...

'అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్' (ఏజేఎల్) అనే సంస్థ నేషన ల్ హెరాల్డ్, ఖ్వామీ ఆవాజ్ అనే రెండు పత్రికలకు యజమాని. దీనిని అప్పట్లో నెహ్రూ స్థాపించారు. ఈ సంస్థకు ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని అనేక చోట్ల అత్యంత విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ విలువే దాదాపు 1600 కోట్లు. ఇన్ని ఆస్తుల కు యజమాని అయిన ఏజేఎల్ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు... 'యంగ్ ఇండియన్' అనే మరో సంస్థ విషయానికి వద్దాం. ఇది సోనియా, రాహుల్ కలిసి స్థాపించిన ప్రైవేటు కంపెనీ. తల్లీ కొడుకులకు ఇందులో 38 శాతం చొప్పున వాటాలున్నాయి.

అచ్చంగా ప్రైవేటు కంపెనీ అయిన యంగ్ ఇండియన్ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని చట్టవిరుద్ధంగా సొంతం చేసుకుంది. దీనికోసం చాలా తతంగమే నడిపారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లోని రికార్డు ల్లో... ఏజేఎల్‌కు సంబంధించి నెహ్రూ, ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ, జీడీ బిర్లా వంటి ప్రముఖులను (వీరంతా ఎప్పుడో మరణించారు) షేర్ హోల్డర్లుగా పేర్కొన్నారు. నిజానికి... ఏజేఎల్‌లో 80 శాతం షేర్ హోల్డర్లు ప్రస్తుతం జీవించి లేరు. షేర్లు ఉన్న కంపెనీలు కూడా పనిచేయడంలేదు. వీటిలో కొన్ని కోల్‌కతాకు చెందిన అనుమానాస్పద కంపెనీలు కూడా ఉన్నాయి.

గత ఏడాది ఫిబ్రవరి 26న ఏజేఎల్ డైరెక్టర్ల బోర్డు సమావేశమై ఒక తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీ తమకు 90 కోట్ల రుణం ఇచ్చినట్లు తెలిపింది. నిజానికి ఒక రా జకీయ పార్టీ ఇతరులకు అప్పులివ్వడం చట్ట విరుద్ధం. ఆ విషయా న్ని పక్కనపెడితే... కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రూ.10 విలువైన 9 కోట్ల షేర్లను 'యంగ్ ఇండియన్' కంపెనీకి బదిలీ చేసింది. ఈ విధంగా మొత్తం షేర్లలో 75 శాతం షేర్లు యంగ్ ఇండియన్‌కు దఖలు పడ్డాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే...షేర్ హోల్డర్ల సమావేశం సోనియాగాంధీ అధికార నివాసమైన 10, జన్‌పథ్‌లో జరగడం. ప్రభుత్వం కేటాయించి న ఈ బంగళాను వ్యాపార, వాణిజ్య అవసరాలకోసం ఉపయోగించుకోరాదు.

10, జన్‌పథ్‌లో జరిగినట్లు చెబుతున్న షేర్‌హోల్డర్ల సమావేశ వివరాలను యంగ్ ఇండియ న్ సంస్థ ఆర్వోసీకి సమర్పించింది. ఇలా రకరకాల అవాస్తవాలు చెబుతూ, చట్టవిరుద్ధ వ్యవహారాలు నడుపుతూ ఏజేఎల్‌ను సోనియా, రాహుల్ గాంధీలకు చెందిన యంగ్ ఇండియన్ సంస్థ సొం తం చేసుకుంది. ఏజేఎల్ చైర్మన్ మరెవ రో కాదు. కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా! 'అందరూ ఒక తానులోని ముక్కలే! పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఆస్తులు సోనియా యజమానిగా ఉన్న ప్రైవేట్ కంపెనీకి దఖలు పడ్డాయి.

ఇదంతా పెద్ద ఫ్రాడ్' అని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. రూ.90 కోట్ల అప్పును కేవలం రూ.50 లక్షలకే కొట్టివేశారని తెలిపారు. దీనిపై తీవ్ర ఆర్థిక మోసాల సంస్థ లేదా సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. 'యంగ్ ఇండియన్'లో తనకు 38 శాతం వాటా ఉన్న విషయాన్ని రాహుల్ తన ఎన్నికల అఫిడవిట్‌లో కూడా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు.

రాహుల్ కన్నెర్ర
సుబ్రమణ్య స్వామి ఆరోపణలపై రాహుల్‌గాంధీ మండిపడ్డారు. కేసు వేసి, కోర్టుకులాగుతానని హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియన్‌కు సంబంధించి ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు, నిరాధారాలని తెలిపారు. స్వామి మీడియా సమావే శం ముగిసిన కొన్ని గంటల్లోనే రాహుల్ కార్యాలయం నుంచి నోటీసు వెళ్లింది. "విలేకరుల సమావేశంలో మీరు చేసిన ఆరోపణల ను పరిశీలించాం. ఈ మీడియా సమావేశం వెనుక ఉద్దేశమేమిటో సులువుగానే అర్థమవుతుంది. మీరు చేసిన హేయమైన వ్యాఖ్యలపై, మీ బాధ్యతారాహితమైన ఆరోపణలపై అన్నిరకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అని ఆ నోటీసులో హెచ్చరించారు.

Sunday, October 21, 2012

దిగివస్తున్న బంగారం ధరలు


అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నెల రోజుల కనిష్ఠ స్థాయికి దిగి వచ్చింది. అమెరికా, యూరోప్‌ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల వార్తల కారణంగా డాలర్‌ బలపడింది. ఈ కారణంగా బంగారం ధర తగ్గింది. ఈనెల మొదటి వారంలో 1800 డాలర్ల సమీపంలోకి వెళ్లిన ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 1725 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. షార్ట్‌ టర్మ్‌ కోసం బంగారంలో పెట్టుబడులు పెట్టిన స్పెక్యులేటర్లు లాభాలు స్వీకరిస్తుండటం కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణమని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.




1600 డాలర్ల స్థాయి నుంచి వేగంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నెల కిందట 11 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అంటే 1800 డాలర్ల సమీపానికి వచ్చింది. ఇప్పుడు మళ్లీ 1600 డాలర్ల స్థాయికి వెళ్లేలా ఉందని అనలిస్టులు చెబుతున్నారు. సాధారణంగా దసరా, దీపావళి సమయంలో బంగారం ధర పెరుగుతుంటుంది. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మన రూపాయల్లో చూస్తే 10 గ్రాముల ధర దాదాపు 33 వేల రూపాయల దాకా వెళ్లింది. ప్రస్తుతం ఎంసీక్స్ లో 10 గ్రాముల ధర 100 రూపాయల దాకా నష్టపోతూ 31,200లకు సమీపంలో ట్రేడవుతోంది. అదే సమయంలో కేజీ వెండి ధర 100 రూపాయల దాకా పెరుగుతూ 59,900లకు సమీపంలో ట్రేడవుతోంది.

పలువురు తెలంగాణవాదుల అరెస్ట్

పాలమూరులో చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటారనే నెపంతో పోలీసులు సోమవారం తెలంగాణవాదులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. నారాయణపేటలో బీజేపీ రాష్ట్ర తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్‌ నాగురావు నామాజీతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు బీజేపీ నేతల ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

పట్టాలు తప్పిన కావేరి ఎక్స్ ప్రెస్

చిత్తూరు జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున చెన్నై- కావేరీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. మైసూరు నుంచి చెన్నై వెళుతున్న కావేరీ ఎక్స్‌ప్రెస్‌ కుప్పం మండలం మల్లానూరు పులికొండ వద్ద ఈరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. రైల్వే ట్రాక్ పై కొండ చరియలు పడటంతో ఇంజన్ భాగం దెబ్బతింది. ఆరు బోగీలకు ఇంజన్ తో లింకు తెగిపోయింది. ట్రాక్ పై బోగీలు ఒరిగిపోవటంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


కాగా ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను మల్లనూరు రైల్వేస్టేషన్ కు తరలించారు. వీరిని ప్రత్యేక రైలులో చెన్నైకి చేర్చేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే అన్ని రైళ్లు రద్దయ్యాయి. కాగా చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహాలు (world telugu conference)

తిరుపతి వద్ద 90 ఎకరాల్లో ఏర్పాట్లు

తిరుపతిలో నిర్వహించే నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహాలు ముమ్మరం చేశామని ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కార్యదర్శి బలరామయ్య తెలిపారు. రవీంద్రభారతి కళాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభల ఏర్పాట్ల గురించి వివరించారు."డిసెంబర్‌లో 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల కోసం జూన్ నుంచే పనులు ప్రారంభించాం. తిరుపతి వద్ద 90 ఏకరాల స్థలాన్ని మహాసభల వేదిక ప్రాంగణంగా నిర్ణయించాం.

Friday, October 5, 2012

వెస్టిండీస్ 20-20లో ఫీనల్ కి

కోలంబోలో జరిగిన 20-20 సెమిఫైనల్స్లో అస్ట్రేలియా వెస్టిండియా చేతిలో పరాజయం చెందింది. ఆస్ట్రిలియా పై గెలిచిన వెస్టండీస్ ఫైనల్ కి చేరుకుంది. ఫైనల్ లో శ్రీలంక తో ఫైనల్ లో ఈ ఆదివారం తలపడనుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా 49 బాల్ల్ లో 79 రన్స్ చేసిన క్రిస్ గేల్ ఎన్నికయ్యాడు.

Thursday, October 4, 2012

ప్వధ్వీ-2 విజయవంతం

ప్రతిష్టాత్మకమైన పృధ్వీ- 2 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో గురువారం ఉదయం తొమ్మిది గంటలకు విజయవంతంగా ఈ క్షిపణని ప్రయోగించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఉపరితలం నుంచి ఉపరితలానికి వెళ్ళే వ్యూహాత్మక క్షిపణి పృధ్వీ-2కి 350 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలపైనా దాడి చేయగల సామర్థ్యం ఉంది. ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను చేధించే పృధ్వీ -2ను భారత్‌ 2010, డిసెంబర్‌ 22న విజయవంతంగా ప్రయోగించింది. సైంటిస్ట్‌ రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ( డిఆర్‌డిఒ) పర్యవేక్షణలో టెస్ట్‌ ఫైరింగ్‌ ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు ఇంజన్ల సామర్ధంతో పనిచేసే పృధ్వీ - 2 తొమ్మిది మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు కలిగి ఉంది. శత్రు క్షిపణులను కనిపెట్టి మట్టుపెట్టడంలో చాకచాక్యంగా పనిచేస్తుందని వారు తెలిపారు.

ప్లాష్ న్యూస్

జగన్ ఆస్తుల కేసులో జగన్ కు సంబదించిన నగదును, ఆస్తులను జప్తు చేసిన ఈడీ