పులిదోమతో (టైగర్ మస్కిటో) డెంగీ వస్తుంది. వర్షంతో పాటు పులి దోమ వస్తుంది. వానతోబాటు ఆ పులిదోమలే కాదు... ఇతర దోమలూ వస్తాయి. వర్షం తర్వాత నీరు నిలుస్తుంది. అడుగు జారుతుంది. జారినప్పుడు పడిపోయే ప్రమాదం లాగ... ఈ దోమలతో వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువే. అందుకే... వాన వచ్చినప్పుడు బురదలో నడకలాగే ఈ సీజన్‌లో దోమల నుంచి వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఎందుకంటే... వాన పడ్డాక వచ్చే తడిలో దోమలు పెరుగుతాయి. అందులో ఒకటే ఈ పులిదోమ. దాని పేరే ఏడిస్ ఈజిప్టై. అది వ్యాప్తి చేసే వైరస్ వల్ల వచ్చే వ్యాధే ఈ ‘డెంగీ’. ఈ సీజన్‌లో డెంగీ వ్యాధి పట్ల అవగాహనదాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
డెంగీలో రకాలివే...
క్లాసికల్ డెంగీ ఫీవర్
డెంగీ హేమరేజిక్ ఫీవర్
డెంగీ షాక్ సిండ్రోమ్
పులిదోమతో డెంగీ వస్తుంది...
డెంగీ లక్షణాలు : సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి... ఇవి డెంగీ వ్యాధిలో కనిపించే లక్షణాలు. ఇక ఎముకలు ఎంత నొప్పిగా అనిపిస్తాయంటే... ఎముకలు విరిగిపోతాయేమో అన్నంత బాధ. అందుకే దీన్ని ‘బ్రేక్-బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వీటితో పాటు కనుగుడ్ల వెనక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇవి సాధారణ డెంగీ (క్లాసికల్ డెంగీ) లక్షణాలు. క్లాసికల్ డెంగీ వచ్చినప్పుడు జ్వరం పెరుగుతూ, తగ్గుతూ వస్తుంది.
ఒక్కోసారి రోగి తీవ్రమైన షాక్‌కు గురవుతాడు. దీన్నే ‘డెంగీ షాక్ సిండ్రోమ్’ అంటారు. ఇది చాలా ప్రమాదరకమైన పరిస్థితి. ఇవేగాక... ఆకలి లేకపోవడం, పొట్టలో నొప్పి, వికారం, వాంతులు, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరిలో నాడి వేగంగా కొట్టుకోవడం, మరికొందరిలో బలహీనంగా కొట్టుకోవడం కూడా ఉంటుంది.
మొదటిసారి కంటే... తర్వాతివే ప్రమాదకరం...
సాధారణంగా మొదటిసారి వచ్చే డెంగీ కంటే... ఆ ఒకసారి డెంగీ వచ్చి తగ్గాక మళ్లీ వస్తే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే... డెంగీని సంక్రమింపజేసే వైరస్‌లో నాలుగు రకాలున్నాయి. అదేరకం వైరస్ మరోసారి వస్తే అది ప్రమాదకరం కాదు. కాని... ఒకసారి వ్యాధికి గురైన వాళ్లలో మరోసారి ఇంకోరకమైన డెంగీ వైరస్ వచ్చినప్పుడు అది మరింత తీవ్రరూపంలో కనిపిస్తుంది. ఫలితంగా మొదటిసారి కంటే ఆ తర్వాత వచ్చేవి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి.
పరీక్షలు, నిర్ధారణ...
చికిత్స...
జ్వరం వంటి సాధారణ లక్షణాలకు చేసే చికిత్స ద్వారానే దీన్ని కూడా తగ్గించవచ్చు. ఇది వైరస్ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి. అయితే... దీనికి ఇంకా నిర్దిష్టమైన వ్యాక్సిన్ రూపొందలేదు. కాబట్టి సింప్టమ్యాటిక్ ట్రీట్‌మెంట్ ప్రక్రియనే అనుసరిస్తారు.
రోగి... నోటి ద్వారా వీలైనంతగా ద్రవపదార్థాలు తీసుకునేలా చూడాలి.
రోగుల ఒంటిలో ద్రవాలు తగ్గకుండా ఉండేందుకు ఐవీ ఫ్లూయిడ్స్ (సెలైన్) ఎక్కిస్తారు.
సాధారణంగా ఈ ప్లేట్‌లెట్స్ కౌంట్ 4,50,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. ఈ కనిష్ఠ విలువ కంటే ప్లేట్‌లెట్స్ తగ్గినప్పుడు ఆ పరిస్థితిని గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ కౌంట్ 20,000 నుంచి 10,000కు తగ్గినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్లవచ్చు. అందుకే ప్లేట్‌లెట్స్ బాగా తగ్గిన రోగుల్లో ఆ విషయాన్ని గుర్తించి వాటిని ఎక్కిస్తారు. ఇప్పుడు సాధారణంగా రక్తాన్ని ఎక్కించేందుకు బదులుగా రక్తంలోని అంశాలైన ప్లేట్‌లెట్స్ మాత్రమే ఎక్కించే అవకాశం ఉండటంతో పూర్తి రక్తా (హోల్ బ్లడ్)న్ని ఎక్కించాల్సిన అవసరం లేదు.
రోగికి అవసరమైన ఇతర సపోర్టివ్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది...
అపోహ - వాస్తవం
అపోహ: ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గినప్పుడు అది తప్పనిసరిగా డెంగీ కావచ్చు.
నివారణ ఇలా...
డెంగీ నివారణ అంటే... దోమలనుంచి రక్షించుకోవడమనే విషయం గుర్తుంచుకోవాలి. ఇంటినీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం.
సాధ్యమైనంత వరకు శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు వాడటం అవసరం.
పగిలిపోయిన సీసాలు, పూలకుండీలు లాంటివి లేకుండా చూడాలి.
ఇళ్లలోని నీటిని నిల్వ ఉంచే... కుండలు, బిందెలు, డ్రమ్ములను వారానికి ఒకరోజు తప్పకుండా శుభ్రం చేయాలి. దోమ లార్వా పెరిగేందుకు అవసరమైన సైకిల్ పూర్తి కావడానికి పది రోజుల సమయం పడుతుంది. ఇలా వారానికి ఒక రోజు ఇంటిలోని నీటి పాత్రలను ఖాళీ చేయడం వల్ల సైకిల్ పూర్తి కాకముందే బ్రేక్ చేసినట్లవుతుంది.
లార్వాలను నివారించడానికి కాల్వల్లో గంబ్యూసియా చేపలను వదలాలి
డెంగీపేరు చెప్పగానే ఒకింత ఆందోళన. ఎందుకంటే... మామూలుగా దానంతట అదే తగ్గిపోయే ఈ వ్యాధే ఒక్కోసారి ప్రమాదకరం కావచ్చు. రక్తం గడ్డకట్టేందుకు ఉపయోగపడే ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గడంతో అంతర్గత అవయవాల్లో రక్తస్రావం, షాక్‌కు (బీపీ ఎక్కువగా పడిపోవడం వల్ల) గురి చేసి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయడం ఒక్కోసారి ఈ వ్యాధి వల్ల జరిగే తీవ్ర పరిణామాలు. అందుకే ఈ వ్యాధి వచ్చాక చికిత్స కంటే, ముందుజాగ్రత్తలతో నివారించడమే మంచిది.
డెంగీలో రకాలివే...
క్లాసికల్ డెంగీ ఫీవర్
డెంగీ హేమరేజిక్ ఫీవర్
డెంగీ షాక్ సిండ్రోమ్
పులిదోమతో డెంగీ వస్తుంది...
అది మామూలు దోమ కాదు. పులిదోమ. డెంగీని సంక్రమింపజేసే దోమ పేరు ఏడిస్ ఈజిప్టై. పులి చారల్లాగే ఆ దోమ ఒంటిపైన, కాళ్ల కణుపుల దగ్గర చారలుంటాయి. అందుకే దాన్ని టైగర్ మస్కిటో అంటారు. ఈ దోమ వల్ల డెంగీ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అందుకే దోమలను నివారించడం అంటే... ఈ వ్యాధితో పాటు మరెన్నో వ్యాధులను అరికట్టడం అన్నమాట. చికిత్స కంటే నివారణ ప్రధానం కాబట్టి ఈ సీజన్‌లో దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఎన్నో వ్యాధులను నివారించడం అన్నమాట.
డెంగీ లక్షణాలు : సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి... ఇవి డెంగీ వ్యాధిలో కనిపించే లక్షణాలు. ఇక ఎముకలు ఎంత నొప్పిగా అనిపిస్తాయంటే... ఎముకలు విరిగిపోతాయేమో అన్నంత బాధ. అందుకే దీన్ని ‘బ్రేక్-బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వీటితో పాటు కనుగుడ్ల వెనక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇవి సాధారణ డెంగీ (క్లాసికల్ డెంగీ) లక్షణాలు. క్లాసికల్ డెంగీ వచ్చినప్పుడు జ్వరం పెరుగుతూ, తగ్గుతూ వస్తుంది.
చాలాసార్లు ఒంటి నిండా ఎర్రటి దద్దుర్లు (ర్యాష్) కూడా కనిపించవచ్చు. ఈ ర్యాష్ జ్వరం మొదలైన ఒకటి రెండు రోజుల్లోనే కనిపిస్తుంది. ఇవి వీపు, రొమ్ము, కడుపు మీద రావడం మొదలై ఆ తర్వాత చేతులు, కాళ్లకు వ్యాపిస్తుంది. నోట్లో కూడా కనిపించవచ్చు. ముక్కులోంచి రక్తస్రావం జరగవచ్చు. కారణం... డెంగీ వచ్చినవారిలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా చర్మం కింద రక్తస్రావం జరిగినప్పుడు ఇలా ర్యాష్‌లా కనిపిస్తుంది. మలంలో, మూత్రంలో కూడా రక్తస్రావం జరగవచ్చు. మలం నల్లగా కూడా రావచ్చు. కడుపులో రక్తస్రావం జరగడం వల్ల ఇలా మలం నల్లగా కనిపిస్తుంది. ఈ రక్తస్రావం అంతర్గత అవయవాల్లో (ముఖ్యంగా మెదడులో) కనిపిస్తే (ఇంటర్నల్ బ్లీడింగ్) వల్ల రోగి ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తాడు. దీన్నే డెంగీ హేమరేజిక్ ఫీవర్ అంటారు.
ఒక్కోసారి రోగి తీవ్రమైన షాక్‌కు గురవుతాడు. దీన్నే ‘డెంగీ షాక్ సిండ్రోమ్’ అంటారు. ఇది చాలా ప్రమాదరకమైన పరిస్థితి. ఇవేగాక... ఆకలి లేకపోవడం, పొట్టలో నొప్పి, వికారం, వాంతులు, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరిలో నాడి వేగంగా కొట్టుకోవడం, మరికొందరిలో బలహీనంగా కొట్టుకోవడం కూడా ఉంటుంది.
మొదటిసారి కంటే... తర్వాతివే ప్రమాదకరం...
సాధారణంగా మొదటిసారి వచ్చే డెంగీ కంటే... ఆ ఒకసారి డెంగీ వచ్చి తగ్గాక మళ్లీ వస్తే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే... డెంగీని సంక్రమింపజేసే వైరస్‌లో నాలుగు రకాలున్నాయి. అదేరకం వైరస్ మరోసారి వస్తే అది ప్రమాదకరం కాదు. కాని... ఒకసారి వ్యాధికి గురైన వాళ్లలో మరోసారి ఇంకోరకమైన డెంగీ వైరస్ వచ్చినప్పుడు అది మరింత తీవ్రరూపంలో కనిపిస్తుంది. ఫలితంగా మొదటిసారి కంటే ఆ తర్వాత వచ్చేవి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి.
పరీక్షలు, నిర్ధారణ...
ఒంటిమీద వచ్చే ర్యాష్, నీరసంగా ఉండటం వంటి లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. అలాగే రక్తపోటు తగ్గడం, రక్త పరీక్షలు (సీరలాజికల్ స్టడీస్), రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గడం, లివర్ పెరగడం, గ్రంథుల వాపు వంటి వైద్య పరీక్షలతోనూ దీన్ని గుర్తించవచ్చు. సాధారణంగా జ్వరం రెండు రోజుల కంటే ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రోగి జ్వరానికి కారణాన్ని నిర్దిష్టంగా తెలుసుకునేందుకు డాక్టర్లు రక్తపరీక్షను సూచిస్తారు. ఈ రక్త పరీక్షల్లో ప్లేట్‌లెట్ కౌంట్, తెల్ల రక్తకణాలు తక్కువగా ఉండటాన్ని గమనిస్తే అప్పుడు వైరస్‌ను నిర్దిష్టంగా గుర్తించేందుకు డెంగీ యాంటీబాడీస్ కోసం పరీక్షను సూచిస్తారు. డెంగీ వైరస్‌కు వ్యతిరేకంగా రక్తంలో కనిపించే యాంటీబాడీస్ సహాయంతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.
చికిత్స...
జ్వరం వంటి సాధారణ లక్షణాలకు చేసే చికిత్స ద్వారానే దీన్ని కూడా తగ్గించవచ్చు. ఇది వైరస్ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి. అయితే... దీనికి ఇంకా నిర్దిష్టమైన వ్యాక్సిన్ రూపొందలేదు. కాబట్టి సింప్టమ్యాటిక్ ట్రీట్‌మెంట్ ప్రక్రియనే అనుసరిస్తారు.
రోగి... నోటి ద్వారా వీలైనంతగా ద్రవపదార్థాలు తీసుకునేలా చూడాలి.
రోగుల ఒంటిలో ద్రవాలు తగ్గకుండా ఉండేందుకు ఐవీ ఫ్లూయిడ్స్ (సెలైన్) ఎక్కిస్తారు.
సాధారణంగా ఈ ప్లేట్‌లెట్స్ కౌంట్ 4,50,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. ఈ కనిష్ఠ విలువ కంటే ప్లేట్‌లెట్స్ తగ్గినప్పుడు ఆ పరిస్థితిని గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ కౌంట్ 20,000 నుంచి 10,000కు తగ్గినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్లవచ్చు. అందుకే ప్లేట్‌లెట్స్ బాగా తగ్గిన రోగుల్లో ఆ విషయాన్ని గుర్తించి వాటిని ఎక్కిస్తారు. ఇప్పుడు సాధారణంగా రక్తాన్ని ఎక్కించేందుకు బదులుగా రక్తంలోని అంశాలైన ప్లేట్‌లెట్స్ మాత్రమే ఎక్కించే అవకాశం ఉండటంతో పూర్తి రక్తా (హోల్ బ్లడ్)న్ని ఎక్కించాల్సిన అవసరం లేదు.
రోగికి అవసరమైన ఇతర సపోర్టివ్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది...
డెంగీ లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం కింద జ్వరానికి సాధారణంగా వాడే ఆస్పిరిన్ వంటి మందులను వాడకూడదు. ఆస్పిరిన్ వంటి కొన్ని మందులు రక్తాన్ని పలచబారుస్తాయి. డెంగీ కేసుల్లో అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉన్నందువల్ల ఇలాంటి మందులను సొంతంగా వాడటం ఒక్కోసారి ప్రమాదకరం కావచ్చు. అందుకే డెంగీ లక్షణాలు కనిపించినప్పుడు వైద్య సలహా మేరకే జ్వరాన్ని తగ్గించే మందుల్ని వాడాలి.
అపోహ - వాస్తవం
అపోహ: ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గినప్పుడు అది తప్పనిసరిగా డెంగీ కావచ్చు.
వాస్తవం: ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిన ప్రతి వ్యాధీ డెంగీ కాకపోవచ్చు. డెంగీతో పాటు మరికొన్ని ఇతర జబ్బుల్లోనూ ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గవచ్చు. కాబట్టి వైరస్ కోసం పరీక్షించాక మాత్రమే అది డెంగీ అని నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది.
నివారణ ఇలా...
డెంగీ నివారణ అంటే... దోమలనుంచి రక్షించుకోవడమనే విషయం గుర్తుంచుకోవాలి. ఇంటినీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం.
సాధ్యమైనంత వరకు శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు వాడటం అవసరం.
ఈ దోమ లార్వాలు మంచినీటిలో పెరుగుతాయి. కాబట్టి మన పరిసరాల్లో నీరు చేరకుండా చూసుకోవాలి.
దోమల నివారణ కోసం రాత్రి వేళల్లోనే గాక పగటి వేళల్లోనూ మస్కిటో రిపల్లెంట్స్ ఉపయోగించడం మంచిది.
ఇళ్లు, పరిసరాల్లో పాత టైర్లు, ఖాళీ కొబ్బరిబొండాలు, కాఫీ, టీల కోసం వాడేవి లేదా వాడాక పారేసే ప్లాస్టిక్ కప్పులు లేకుండా చూసుకోవాలి.
పగిలిపోయిన సీసాలు, పూలకుండీలు లాంటివి లేకుండా చూడాలి.
ఇళ్లలోని నీటిని నిల్వ ఉంచే... కుండలు, బిందెలు, డ్రమ్ములను వారానికి ఒకరోజు తప్పకుండా శుభ్రం చేయాలి. దోమ లార్వా పెరిగేందుకు అవసరమైన సైకిల్ పూర్తి కావడానికి పది రోజుల సమయం పడుతుంది. ఇలా వారానికి ఒక రోజు ఇంటిలోని నీటి పాత్రలను ఖాళీ చేయడం వల్ల సైకిల్ పూర్తి కాకముందే బ్రేక్ చేసినట్లవుతుంది.
లార్వాలను నివారించడానికి కాల్వల్లో గంబ్యూసియా చేపలను వదలాలి

No comments:
Post a Comment