Showing posts with label cinima. Show all posts
Showing posts with label cinima. Show all posts

Saturday, February 16, 2013

మూడు తరాల 'చిత్రం'!

తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తన కుమారుడు నాగ చైతన్యలతో కలిసి నటించనున్నట్టు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు కలిసి వెండి తెర పంచుకోనున్నారని వస్తున్న ఊహాగానాలకు నాగ్ తెర దించారు. తాము కలిసి నటించే సినిమా ఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కానుందని తెలిపారు. తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ జ్యుయెలర్స్ దుకాణాన్ని విశాఖపట్టణంలో శనివారంనాడు-ఫిబ్రవరి 16న- నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ- అభిమానుల అభిలాష మేరకు తన తండ్రి, కొడుకు కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. 

అక్కినేని త్రయం కలిసి నటించే సినిమా మూడు తరాల 'చిత్రం' అవుతుంది. మొదటి తరానికి చెందిన నాగేశ్వరరావు, రెండో తరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నాగార్జున, మూడో తరానికి చెందిన చైతన్య సిల్వర్ స్క్రీన్ పై మెరిస్తే ఇక అక్కినేని అభిమానులకు పండుగే. మూడు తరాలు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించిన ఘనత కూడా అక్కినేని కుటుంబానికే చెందుతుంది. ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న మల్టీ స్టారర్ ట్రెండ్ తర్వాత మూడు తరాల దిశగా సాగేందుకు అడుగులు పడుతున్నాయనడానికి అక్కినేని త్రయం సినిమానే ఉదాహరణ. అయితే మూడు తరాలు హీరోలున్న ఫ్యామిలీలు చాలా తక్కువగా ఉండడంతో ఇటువంటి సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయనడంలో సందేహం లేదు. 

తెలుగు చిత్రసీమలో 'కుటుంబ' సినిమాలు కొత్తేంకాదు. గతంలో చాలా మంది హీరోలు తమ కొడుకులు, అన్నలు, తమ్ముళ్లు, మనవలు, మనవరాళ్లతో కలిసి సినిమాల్లో కనిపించిన సందర్భాలున్నాయి. పెద్ద ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ, బాలకృష్ణతో నటించారు. సూపర్ కృష్ణ తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులతో కలిసి పలు చిత్రాల్లో ఫ్యాన్స్ కు వినోదం పంచారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా తన కుమారుడు నాగార్జున తో నటించారు. చిరంజీవి తన సోదరుడు నాగబాబుతో చాలా సినిమాల్లో సందడి చేశారు. అయితే పూర్తిస్థాయి మూడు తరాల సినిమా ఇప్పటివరకు రాలేదని చెప్పొచ్చు. ఆ లోటును అక్కినేని వంశం తీర్చనుంది. 

కథ దొరికితే కలిసి నటించేందుకు మూడు తరాలు నటులు సిద్ధపడుతుండడంతో ఈ ట్రెండ్ భవిష్యత్ లో మరింత విస్తరించనుంది. తన తండ్రి బాబాయ్ తో కలిసి నటించేందుకు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కొణిదెల వంశంలో నటన చిరంజీవి నుంచి ప్రారంభమయింది కాబట్టి పవన్ కళ్యాణ్ ను రెండో తరంగా పరిగణించాల్సివుంటుంది. అటు ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు రానా కూడా తాత, బాబాయ్ తో సినిమా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 

ఇక టాలీవుడ్ లో కుటుంబ చిత్రాలకైతే కొదవే లేదు. ఇప్పుడున్న యువ హీరోలు తమ వంశంలో స్టార్ డమ్ వున్న తమ ముందువారితో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చాలా మంది ఇప్పటికే నటించారు. కృష్ణంరాజు-ప్రభాస్, నాగార్జున-సుమంత్, మోహన్ బాబు- విష్ణు-మనోజ్ కాంబినేషన్లు ఈ కోవకు చెందినవే. అయితే మూడు తరాల 'చిత్రం' అభిమానులకు ఇచ్చే ఆనందం అంతాఇంతా కాదనడంలో అతిశయోక్తి లేదెమో!

Tuesday, November 27, 2012

వంద కోట్ల క్లబ్

బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్ 
అని హీరోహీరోయిన్లకు ఓ స్థాయి వుంది. వారి సినిమాలు వంద కోట్ల కలెక్షన్లు దాటితే ఆయా హీరోయిన్లను వందకోట్ల క్లబ్‌లో మెంబర్లుగా చేరుస్తారు. హీరోలు ఎందరు ఉన్నా హీరోయిన్లు ఎంతమంది ఉన్నారనేదే ప్రశ్న. ప్రియాంక చోప్రా, అసిన్, సోనాక్షిసిన్హా వంటి భామామణులే ఈ క్లబ్‌లో గుర్తింపు పొందారు. కరీనాకపూర్‌తో సమానంగా పారితోషికం తీసుకుంటున్నా కత్రినాకైఫ్‌కు మాత్రం ఈ క్లబ్‌లో చోటు దొరకలేదు. ఆ స్థానం ఎప్పుడు దక్కుతుందా అని ఎదురుచూసిన కత్రినాకు జబ్‌తక్ హైజాన్ చిత్రం వరంలా దొరికింది. ఈ చిత్రం వంద కోట్ల షేర్ దాటింది. ఈ విషయంపై అభిప్రాయం అడిగితే ఇది ఆరంభం మాత్రమేనని, గతంలో ఉన్నవాళ్లకి రెండుమూడు చిత్రాలు ఉంటే ఆ అంకెను తాను దాటేస్తానంటోంది ధీమాగా. చూద్దాం అది కూడా!

గిన్నీస్‌బుక్.....ఐటమ్ రికార్డు

ఐటమ్ పాటలు అనేక మంది చేస్తూనే ఉన్నారు. గతంలో హెలెన్, హలం, జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనూరాధ లాంటి డాన్సర్లు కేవలం ఐటమ్‌సాంగ్‌లకోసమే ఉండేవారు. రానురాను హీరోయిన్లు ఐటమ్‌లు చేస్తున్నప్పుడు వీరికి ప్రాధాన్యత తగ్గింది. తాజాగా ఖాళీగా కూర్చుంటున్న హీరోయిన్లు కూడా ఐటమ్‌లు చేసేస్తున్నారు. ఐతే వీరందరికీ ఝలక్ ఇచ్చేలా భోజ్‌పురి భాషలో సీమాసింగ్ అనే ఐటమ్‌గాళ్ రికార్డుస్థాయి ఐటమ్ పాటలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఆమె చేసిన ఐటమ్ పాటలన్నీ గిన్నీస్‌బుక్ వారికి పంపి, ఎక్కువ ఐటమ్ పాటల్లో నృత్యంచేసిన నటీమణిగా గుర్తించమని అడగనుందట. పనిలో పనిగా ఆమెకు గనక గుర్తింపు వస్తే తమ భాషకు కూడా గుర్తింపు వస్తుంది కదా అని వారు కూడా ఆమెను ప్రోత్సహిస్తున్నారట. ఇదే విధంగా ఐటమ్ పాటలకు కూడా గిన్నిస్‌బుక్‌లో చోటు దొరికితే అందరూ ఆ వైపున ప్రయత్నిస్తారేమో!

Sunday, October 21, 2012

మీ ఫోన్.. వారి రక్తం!

కాంగోలో తీవ్రవాద ముఠాల దారుణ కాండ..

కుటుంబ సభ్యుల ఎదుటే అత్యాచారాలు, హత్యలు

బాలబాలికలతో వెట్టి చాకిరీ.

గనుల కోసమే ఆకృత్యాలు

ఆ లోహాలతో సెల్‌ఫోన్ సహా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ..

ఏడాదికి 900 కోట్లు..

అన్ని తీవ్రవాద కార్యకలాపాలకే!..

కాంగో నుంచి ఖనిజాలు కొనొద్దు: 'సేవ్ ది కాంగో'!

'బ్లడ్ ఇన్ మొబైల్' పేరిట లఘు చిత్రం.. 
  
ఇంటర్‌నెట్‌లో విడుదల

మీరు కొన్న టాబ్లెట్ కంప్యూటర్ విలువెంతో తెలుసా..? కాంగో దేశంలో ఒక మహిళ మానం!? అదే మీ ల్యాప్‌టాప్ కోసం ఖర్చయ్యిందెంతో తెలుసా..? ఆ దేశంలో ఒక మనిషి ప్రాణం!? మనం కొంటున్న సెల్‌ఫోన్ విలువ.. ఆవిరవుతున్న ఒక బాల్యం..!? ఇంతేకాదు.. మనం కొనే ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువు వెనుకా.. కాంగో దేశ ప్రజల కన్నీరు ఉంటుంది. ఆ దేశంలో ఓ నేరంతో అది సంబంధాన్ని కలిగి ఉంటుంది.

Sunday, October 14, 2012

తెలుగును కాపాడుకోవాలి

సినీ నిర్మాత డి.రామానాయుడు

- ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ‘దేశభాషలందు తెలుగు లెస్స...’ అని కృష్ణదేవ రాయలు తెలుగు భాషను కీర్తించారంటూ గొప్పగా చెప్పుకోవడం తప్ప మాతృభాషను కాపాడుకునేందుకు, సంస్కరించుకునేందుకు మనం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నిర్మాత డా.డి.రామానాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని మావలంకర్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఢిల్లీ తెలుగు అకాడమీ(డీటీఏ) 25వ వార్షికోత్సవంలో భాగంగా రామానాయుడిని డీటీఏ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.

బూసాన్ చలనచిత్రోత్సవంలో ‘బర్ఫీ’కి జేజేలు

లండన్: ఆస్కార్ అవార్డుల రేసులో విదేశీ చిత్ర విభాగంలో పోటీపడుతున్న భారత చిత్రం ‘బర్ఫీ’ 17వ బూసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దక్షిణ కొరియాలోని బూసాన్ సినీ ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం 4 వేల మంది ప్రేక్షకులు లేచి నిలబడి తమ కరతాళ ధ్వనులతో ‘బర్ఫీ’కి హర్షాతిరేకాలు తెలిపారు. ఈ సినిమా కోసం కేటాయించిన పాసులన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ‘బర్ఫీ’ నటీనటులు రణ్‌బీర్ కపూర్, ప్రియాంక చోప్రా ప్రేక్షకుల మధ్య కూర్చొని ఈ సినిమాను వీక్షించారు.

Thursday, October 11, 2012

అమితాబ్ బచ్చన్ జన్మదినం

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరి బీచ్‌లో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. గురువారం అమితాబ్ జన్మదినం.

Saturday, October 6, 2012

శ్రీదేవి రీఎంట్రీ అదిరింది

15 ఏళ్ల విరామం తర్వాత 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రంతో బహు భాషానటి శ్రీదేవి రీఎంట్రీ అదిరింది. సాధారణ గృహిణి పాత్రలో శ్రీదేవి అద్భుతంగా ఒదిగిపోయింది. ఎన్నాళ్లుగానో తెర మీద మళ్లీ శ్రీదేవిని చూడాలనుకుంటున్న అభిమానులకు ఆ ముచ్చట తీరింది. ఈ చిత్రంలో శశి (శ్రీదేవి) పాత్ర ఇంగ్లిష్ వింగ్లీష్ పాత్రకే పరిమితం కాకుండా.. భారత దేశంలో ప్రతి రోజు ఏదో ఒక క్షణంలో ఎవరో ఒకరు ఆంగ్ల భూతానికి బలవుతూ ఉన్నవారికి ప్రతిరూపంగా నిలిచింది. ఊరుకాని ఊరు.. దేశం కాని దేశంలో ఇంగ్లీష్ రాని వారి పరిస్థితి ఎలా ఉంటుందో శశి పాత్ర కళ్లకు కట్టినట్టు చూపించింది. ఫలితంగా ప్రతి ఒక్కరికీ ఆ పాత్ర అందరినీ అలరించడమే కాకుండా, శ్రీదేవికి ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం కలిగించింది.