Thursday, October 4, 2012

హైదరాబాద్-తిరుపతి డబుల్ డెక్కర్ రైళ్లు!

 రాష్ట్రంలో హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్-తిరుపతి మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దేశంలోని నాలుగు మార్గాల్లో ఈ రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే శాఖ.. వచ్చే ఏడాది మన రాష్ట్రంలో కూడా ఈ సర్వీసులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రైల్వేశాఖ ఇటీవల ముంబై- అహ్మదాబాద్, జైపూర్-ఢిల్లీ, హౌరా-ధన్‌బాద్ మధ్య ఏసీ డబుల్ డెక్కర్ రైళ్లను ప్రారంభించింది. తొలిదశలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్-తిరుపతి మార్గాల్లో వీటిని నడపాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి రూట్లను సర్వే చేస్తున్నారు. 

No comments: