Showing posts with label Education. Show all posts
Showing posts with label Education. Show all posts

Tuesday, November 27, 2012

OU Dgree Exams Fee date...

ఉస్మానియా పరిధిలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న రెగ్యులర్, దూరవిద్యా కేంద్రంలో బీఏ, బీకాం(కంప్యూటర్స్/జనరల్), బీఎస్సీ, బీబీఏ కోర్సుల ప్రథమ, ద్వితీయ,తృతీయ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 26 వరకు ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ప్రొ.భిక్షమయ్య తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో డిసెంబర్ 31 వరకు ఫీజు చెల్లించాలన్నారు. ఫీజు చెల్లించు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారానే ఓయూ పరీక్షల నియంత్రణ కేంద్రానికి అందజేయాలన్నారు.

Education play key role.....

 
ఉత్తమ విద్య మనిషిని సంస్కారవంతంగా, సమర్థుడిగా తయారు చేస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి చెప్పారు. ఇది ఉన్నత మార్గానికి సోపానమవుతుందని అభిప్రాయపడ్డారు. మంగళవారం కేశవ మెమోరియల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆంద్రాబ్యాంక్ 90వ వ్యవస్థాపక దినోత్సవానికి జస్టిస్ నరసింహారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆంధ్రాబ్యాంక్ జీఎం ప్రసన్న ఫణికర్ చేతుల మీదుగా 350మంది విద్యార్థులకు టీషర్ట్‌లు పంపిణీ చేశారు. ఎన్‌సీసీ నేషనల్ ట్రెక్కింగ్ శిబిరానికి ఎంపికైన వంశీ, అజయ్‌లను అభినందించారు. కేశవ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెరైక్టర్ నీల్‌గోక్టే, కేశవ మెమోరియల్ విద్యాసంస్థల వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు జె.నరసింహరావు, సహాయ కార్యదర్శి భావన్నారాయణ తదితరులు ప్రసంగించారు.

Wednesday, November 21, 2012

ఇంధనం కోసం ఎన్ని తిప్పలో...!

బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయం ఒకటి గత ఏడాది మూత్రం ద్వారా తగు మోతాదులో ఇంధనాన్ని తయారుచేయడం సాధ్యమేనని నిరూపించింది.



ప్రపంచం సంప్రదాయేతర ఇంధనవనరుల కోసం అర్రులు జాస్తోంది.. బయోడీజిల్ తయారీ... వ్యర్థాల నుంచి మిథేన్ ఉత్పత్తి... అన్నీ ఇందులో భాగమే. అయితే ఈ జాబితాలోకి కొత్తగా చేరుతున్నదేమిటంటే... మూత్రం... వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల మనిషి సహజజీవక్రియలో భాగంగా వదిలించుకునే మూత్రాన్ని ఇంధనంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.



ప్రపంచ జనాభా దాదాపు 700 కోట్లు! అందరూ రోజూ లఘుశంక తీర్చుకోవాల్సిందే. నాసా జరిపిన అధ్యయనాల ప్రకారం ఒక్కో మనిషి సగటున రోజుకు దాదాపు 2.5 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. కొంతమోతాదులో యూరియా.... మరికొన్ని లవణాలు కలిగి ఉండే మూత్రం నేరుగా మురుగుకాలువలోకి కలిసిపోవడం వల్ల కొన్ని చిక్కులున్నాయి. నీరు కలుషితమవడం ఒకటైతే... యూరియాలోని అమ్మోనియా కారణంగా నీటివనరుల్లో నాచు పెరిగిపోతూంటుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడంతోపాటు... మూత్రంలోని లవణాలను ఉపయోగించుకుని ఇంధనాన్ని సృష్టించేందుకు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. సుమారు దశాబ్దం క్రితం కొంతమంది శాస్త్రవేత్తలు ‘అనమాక్స్’ అనే ఓ బ్యాక్టీరియాను గుర్తించారు.



ఆక్సిజన్ అవసరం లేకుండా బతకగలిగే ఈ బ్యాక్టీరియాకు ఓ వినూత్న లక్షణం ఉంది. అమ్మోనియా... నైట్రేట్‌లను కలిపి నైట్రోజన్‌ను ఉత్పత్తి చేయగలదు. అదేసమయంలో హైడ్రోజనేస్ అనే ఒకరకమైన ఉదజని సంబంధిత ఇంధనాన్ని తయారుచేయగలదు. మూత్రంతోపాటు ఈ అనమాక్స్ బ్యాక్టీరియాను ఉపయోగించి ఇంధనాన్ని తయారుచేయవచ్చునని శాస్త్రవేత్తలు అప్పట్లో అంచనా వేశారు. అయితే అప్పటి టెక్నాలజీ ద్వారా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వీలుకాలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది... బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయం ఒకటి గత ఏడాది మూత్రం ద్వారా తగు మోతాదులో ఇంధనాన్ని తయారుచేయడం సాధ్యమేనని నిరూపించింది. అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మూడేళ్ల క్రితం ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా మూత్రం నుంచి ఉదజనిని వేరు చేసి ఇంధనంగా వాడుకోవచ్చునని ప్రతిపాదించారు.



మూత్రం ద్వారా ఇంధనాన్ని తయారుచేసేందుకు ఒకవైపు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తూండగానే ఆఫ్రికాలోని డ్యూరో ఐనా అడెబోలా, అకిన్‌డేలే అబియోలా, ఫలాకే ఒట్టువాటోయెన్, బెల్లో ఎనియోలా అనే నలుగురు టీనేజ్ యువతులు ఈ పనిని సాధించి చూపారు. ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారానే మూత్రంలోని యూరియా నుంచి ఉదజనిని వేరుచేసి... దాన్ని ఒక సిలిండర్‌లో నింపారు. ఈ వాయువుతో జనరేటర్‌ను నడిపి చూపారు కూడా. గత వారం నైజీరియాలో జరిగిన ఓ అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో ఈ టెక్నాలజీ ప్రదర్శితమైంది.

Tuesday, November 20, 2012

అమెరికా అంటే ముందుగా చట్టాలు, ఆ తర్వాతే మనుషులు

చట్టాన్ని, న్యాయాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు ‘ఎవరు, ఏమిటి’ అనే భేదాలు అమెరికాలో ఉండవు. అవతలివారు బలవంతులా? బలహీనులా? అన్న మీమాంస అక్కడి ‘లా’కి గాని, ‘లా ఎల్‌ఫోర్స్‌మెంట్’కి గాని ఉండదు. ‘యు.ఎస్. అంటే ముందుగా చట్టాలు, న్యాయం. ఆ తర్వాతే మనుషులు, మమతలు’ అనే వ్యాఖ్య తరచూ వినిపిస్తూ ఉంటుంది.

ఆ మధ్య ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో ఒక ముఖ్యుడు డ్రంకెన్ డ్రైవింగ్‌కి బుక్ అయ్యి, పదవి వదులుకున్నాడు. ఇటీవల ఒక సి.ఐ.ఏ. డెరైక్టర్ వివాహేతర సంబంధం బయటపడి రాజీనామా చేశాడు. ఈ మధ్యనే విదేశీ విద్యార్థుల్ని మోసగించిన ఒక యూనివర్సిటీ అధికారికి 80 ఏళ్లకి పైగానే జైలు శిక్ష పడవచ్చంటున్నారు. ఒక కుక్క ఒక పిల్లిని చంపితే ఆ డాగ్ ఓనర్‌ని మూడేళ్ళు ఖైదులో పెట్టే దేశం అది! పోలీసులు కూడా అక్కడ చట్టాల్ని సర్వస్వతంత్రంగా అమలు జరుపుతారు.

టెక్సాస్‌లోని శాన్‌యాంటోనియోలో ఒక వృద్ధమహిళ అనుమతి లేనిచోట రోడ్డు దాటుతుండగా ఒక యువతి డ్రైవ్ చేస్తున్న కారు ఆమెని ఢీకొని అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. పోలీసులు వచ్చి చూసి, అందులో డ్రైవర్ తప్పు ఏమీ లేదని నిర్ణయించి కేసు కూడా బుక్ చెయ్యకుండానే ఆ యువతిని కొద్దిసేపట్లోనే ప్రమాదస్థలం నుంచి పంపేశారు.

Wednesday, November 7, 2012

సివిల్స్-2013..

సివిల్స్-2013.. షెడ్యూల్ విడుదలైంది.. డే టు డే డెడ్‌లైన్లతో ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైంది. పోటీలో లక్షల నుంచి వేలకు.. వేల నుంచి వందలకు చేరుకోవాలంటే పకడ్బందీ వ్యూహాలు.. పక్కా ప్రిపరేషన్ ప్లాన్‌తోనే సాధ్యం. ముఖ్యంగా ‘ఒక్క’ మార్కు కూడా ముఖ్యమైన మొదటి దశ ప్రిలిమ్స్ కోసం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. షెడ్యూల్ ప్రకారం ఇంకా ఆరు నెలల సమయం అందుబాటులో ఉన్న ప్రిలిమ్స్.. ఆ తర్వాత మరో నాలుగు నెలలకు నిర్వహించే మెయిన్‌‌స కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై లాంగ్‌టర్మ్ గెడైన్స్

కోర్స్ ఇన్ఫో: బయోటెక్నాలజీ

పరీక్షలివీ..
జేఎన్‌యూ కంబైన్డ్ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్: దేశంలోని సెంట్రల్, ప్రముఖ యూనివర్సిటీల్లో బయోటెక్నాలజీలో పీజీ చేయాలంటే ఈ పరీక్ష రాయాల్సిందే. ఈ యూనివర్సిటీల్లో సీటు పొందినవారికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నెలకు రూ.800 స్టైపెండ్ కూడా అందిస్తోంది.

ఐఐటీల్లోనూ: జామ్ పరీక్ష ద్వారా ఐఐటీల్లో బయోటెక్నాలజీ కోర్సుకు ప్రవేశం లభిస్తుంది. ప్రస్తుతం రెండు ఐఐటీలు ఈ కోర్సు అందిస్తున్నాయి.
ఐఐటీ-రూర్కీ ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఐఐటీ-బాంబే ఎంఎస్సీ బయోటెక్నాలజీతోపాటు ఎంఎస్సీ పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ కోర్సు అందిస్తోంది.

మన రాష్ట్రంలో:
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం, ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి, కాకతీయ యూనివర్సిటీ-వరంగల్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ-అనంతపురంతో పాటు వివిధ ప్రైవేటు పీజీ కాలేజీలు.

అర్హత: డిగ్రీలో బయాలజీ/ ఫిజికల్ సెన్సైస్ కోర్సులు చదివుండాలి.

స్పెషలైజేషన్లు: ప్లాంట్ బయోటెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, మెరైన్ బయోటెక్నాలజీ, క్లినికల్ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ.

ఎంబీఏ/పీజీడీఎం (బయోటెక్నాలజీ):
పుణె యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్
ఎంటర్‌ప్రైజ్-హైదరాబాద్, ఎస్‌ఐఈఎస్ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ముంబై, భారతీ విద్యాపీఠ్ యూనివర్సిటీ-పుణె, పంజాబ్ యూనివర్సిటీ-చండీగఢ్, అమిటీ యూనివర్సిటీ-నోయిడా, మిట్‌కాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-పుణె

కాంపిటీటివ్ ఎగ్జామ్- ఏఐఈఈఏ

ఏఐఈఈఏ-యూజీ:
ఇందులో ర్యాంకు సాధించినవారు మొత్తం 11 యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. దీనికి విద్యార్థులు స్ట్రీమ్-ఏ, స్ట్రీమ్-బీలలో ఒక దాన్ని ఎంచుకోవాలి.
స్ట్రీమ్-ఏ (అగ్రికల్చరల్/బయాలజీ): అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీస్, హోం సైన్స్, సెరికల్చర్, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి సబ్జెక్టులుగా బయాలజీ/అగ్రికల్చర్/హోంసైన్స్‌లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
స్ట్రీమ్-బీ (మ్యాథమెటిక్స్): దీని ద్వారా అగ్రి ఇంజనీరింగ్, డెయిరీ టెక్నాలజీ, అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. కొన్ని అగ్రి వర్సిటీలు ఫుడ్ సైన్స్, బయోటెక్నాలజీ, ఫారెస్ట్రీ కోర్సుల్లో కూడా ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే 10+2లో బయాలజీ చదివి ఉండాలి.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులు 40 శాతం) ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.

వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 17-23 ఏళ్లు.
పరీక్ష విధానం: ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో రెండున్నర గంటల వ్యవధిలో జరిగే పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం మూడు సబ్జెక్టుల్లో 180 ప్రశ్నలుంటాయి. రెండు స్ట్రీమ్‌ల విద్యార్థులకు ఫిజిక్స్ నుంచి 60 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. ఇక మూడో సబ్జెక్టు కింద స్ట్రీమ్-ఏ విద్యార్థులు బయాలజీ/అగ్రికల్చర్‌లలో ఒకదానిని, స్ట్రీమ్-బీ విద్యార్థులు మ్యాథ్స్‌ను ఎంచుకోవాలి. దీనిలో కూడా 60 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.

బ్యాంక్ పీవో


ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో)... బ్యాంకింగ్ రంగంలో ఉజ్వలమైన కెరీర్‌ను అందించే పోస్టు. పీవోగా బ్యాంక్‌లో అడుగుపెడితే.. కెరీర్‌లో ఎదుగుదలకు ఎలాంటి పరిమితులూ ఉండవు. అంకితభావం ఉంటే.. ఆకాశమే హద్దు. నాలుగేళ్లు తిరిగేలోపు సీనియర్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు. పీవోగా చేరి.. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, చైర్మన్ స్థాయికి ఎదగొచ్చు.

నెస్ట్ పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి?

ప్రిపరేషన్ గెడైన్స్-నెస్ట్ 


బేసిక్ సెన్సైస్, దాని అనుబంధ సబ్జెక్టుల్లో సుశిక్షితులైన మానవ వనరులను దేశానికందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ) 2007లో నైసర్, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సెన్సైస్‌లను ఏర్పాటు చేసింది. ఈ రెండు సంస్థల్లో ఐదేళ్ల ఇంటిగ్రే టెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) నిర్వహిస్తారు.

ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్షలో 5 విభాగాలుంటాయి. మొదటి సెక్షన్ అందరికీ కామన్‌గా ఉంటుంది. ఇందులో బయాలజీ, కెమిస్ట్రీ ఫిజిక్స్, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్‌లలో ప్రధాన సంఘటనలపై ప్రశ్నలుంటాయి. రెండో సెక్షన్‌లో బయాలజీపై, మూడో సెక్షన్‌లో కెమిస్ట్రీపై, నాలుగో సెక్షన్‌లో మ్యాథమెటిక్స్‌పై, ఐదో సెక్షన్‌లో ఫిజిక్స్‌పై ప్రశ్నలుంటాయి.

రెండు నుంచి నాలుగు సెక్షన్స్‌లో విద్యార్థులు ఏవైనా మూడు విభాగాలను ఎంచుకుని పరీక్ష రాయాలి. విద్యార్థుల గ్రహణ శక్తిని, విశ్లేషణ శక్తిని అంచనా వేసేలా 10+2 (సీబీఎస్‌ఈ) స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంగ్లిష్ మాధ్యమంలో మూడు గంటల కాల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి.

టోఫెల్, జి.ఆర్.ఇ., జి-మాట్: ప్రిపరేషన్ టిప్స్

యు.ఎస్ యూనివర్సిటీలలో ప్రవేశం కోసం మన విద్యార్థులు రాసే అడ్మిషన్ టెస్టుల వివరాలలోకి వెళ్ళే ముందు టోఫెల్, జి.ఆర్.ఇ., జి-మాట్‌ల ప్రిపరేషన్ టిప్స్ కూడా తెలుసుకోండి.
ఇంటర్నెట్ ఆధారిత టోఫెల్ ఐ.బి.టి.లో రైటింగ్, లిజనింగ్ రీడింగ్, స్పీకింగ్ అనే నాలుగు విభాగాలలో సెక్షన్‌కి 30 పాయింట్ల చొప్పున మొత్తం 120 పాయింట్లు ఉంటాయి. యు.ఎస్ ఎడ్యుకేషన్‌లో పోటీ ఎక్కువ అవ్వడం వల్ల విదేశీ విద్యార్థులు అడ్మిషన్ పరీక్షల్లో మనుపటి కంటే బాగా కష్టపడవలసి వస్తోంది. టోఫెల్‌లో మంచి స్కోర్లు రావాలంటే ఇంగ్లిష్ మీద మంచి పట్టు ఉండాలి. చివరగా ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నా కనీసం రెండేళ్ల ముందు నుంచే ప్రాక్టీస్ టెస్టులు తీసుకోవాలి.

రెగ్యులర్ పద్ధతిలో ప్రిపేర్ అవ్వడంతో పాటు ఇంగ్లిష్ కార్టూన్ ఫిలింలు చూడడం వల్ల ఇంగ్లిష్ తొందరగా అభివృద్ధి చెందుతుందని అనుభవజ్ఞులు చెబుతారు. అలాగే రేడియోలో ఇంగ్లిష్‌న్యూస్, ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ సహా వచ్చే ఇంగ్లిష్ సినిమాలు కూడా ఉపయోగ పడతాయి అని ఒక పరిశీలనలో తేలింది. వీటివల్ల ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారి ఉచ్ఛారణ, శైలి మీద త్వరగా పట్టు దొరుకుతుందని కొందరు టోఫెల్ గురువులు సూత్రీకరించారు.

ఇక జి.ఆర్.ఇ.కి హాజరయ్యే వారిలో ఎక్కువభాగం ఇదివరలో నేర్చుకున్న హైస్కూల్ మాథమాటిక్స్ మూలసూత్రాలతో పరిచయం కోల్పోయి ఉండడం సహజం. అయితే అవి జి.ఆర్.ఇ. పరీక్షలోని క్వాంటిటేటివ్ సెక్షన్‌లో మళ్ళీ ముఖ్యమైనవిగా ఎదురుపడతాయి కనుక ఆల్జీబ్రా, జామెట్రీ సిద్ధాంతాలని మరొక్కసారి పునశ్చరణ చేసుకోవాలి. ప్రొఫెషనల్ కాలేజీలో చేరినప్పటి నుంచి నాలుగేళ్లపాటు శ్రద్ధగా రకరకాల ఇంగ్లిషుపదాలను మనసుకు ఎక్కించుకుంటే భాషాసంపద మీ సొంతమై పరీక్షకి కావలసిన వొకాబ్యులరీ మీకు ఏర్పడుతుంది.

కోచింగ్ సెంటర్లు మీకు ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చినా మీ దగ్గర మొదటి నుంచి గుజ్జు లేకపోతే ఎంత పండితులైనా ప్రొఫెసర్లు కూడా మీ కోసం స్వల్పకాలంలో మిరకిల్స్ సృష్టించలేరు. జి.ఆర్.ఇ. మీ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్‌ని టెస్ట్ చేస్తుంది. కనుక మీరు మూడు నాలుగేళ్ల వ్యవధి తీసుకుని క్రమేణా మిమ్మల్ని మీరు ఒక గన్‌లాగా రూపొందించుకుంటే ఆపైన మీకు అవసరమైన బుల్లెట్లని ఏ కోచింగ్ సెంటరో సమకూర్చగలుగుతుంది.

ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సెంటర్ (ఇ.టి.ఎస్) వెబ్‌సైట్‌లో ఉచితంగా లభించే వనరుల ద్వారా ప్రాక్టీస్ చేస్తే కూడా మీ క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. కంప్యూటర్ ప్రాక్టిస్ టెస్ట్‌లు ఎన్ని చేస్తే అంత మంచిది. ఇంగ్లిష్‌లో మీరు పండితులైనా కాకపోయినా అనలిటికల్ సెక్షన్‌లోని రెండు ఎస్సేలు టెస్టు సమయంలో మూడోవంతు తీసేసుకుంటాయి. కనుక ఉన్నత ప్రమాణాలు గల ఒక ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోర్సుని ఆన్‌లైన్‌లో గాని, బయట గాని ఒక ఏడాది ముందు నుంచి చెయ్యగలిగితే మంచి ఫలితం ఉంటుంది.

రివైజ్ చేసిన జి-మాట్ పరీక్ష మొదట అనుకున్నంత టఫ్‌గా ఏమీలేదని దానికి హాజరైన కొందరు అన్నారు. ఇందులోని ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ సెక్షన్ అంత కష్టమైనదేమీ కాకపోయినా ఇందులోని గ్రాఫులని, ఛార్టుల్ని దాటుకుంటూ వెళ్లడంలోనే సమయం అయిపోతుంది కాబట్టి వీటిని అలవాటు చేసుకోవడానికి ముందుగా ప్రాక్టీసు తప్పనిసరి. ఈ పరీక్షలో సాల్వ్ చెయ్యాల్సిన ప్రాబ్లమ్స్‌ని కూడా బాగా ముందు నుంచే ప్రాక్టీస్ చెయ్యాలి.

యు.ఎస్ జిబినెస్ స్కూల్స్‌కి 2013లో అప్లికేషన్‌లు వెల్లువెత్తబోతున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాంపిటీషన్ పెరిగే అవకాశాల వల్ల జి.ఆర్.ఇ., జి-మాట్ రాసే విద్యార్థులు ఈ పరీక్షలలో వీలైనంత ఎక్కువ స్కోర్లు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి.

Sunday, November 4, 2012

గ్రామీణ విద్యార్థులు కూడా టోఫెల్‌ని సాధించవచ్చు!

అమెరికాలో పైచదువులకు వెళ్ళాలంటే అన్నిటికంటే ముందు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉండాలి. అయితే అంతమాత్రం చేత ఒకటోతరగతి నుంచే తెలుగు వదిలేసి పూర్తిగా ఇంగ్లిషులోనే విద్యాభ్యాసం చెయ్యాల్సిన పని లేదు. మాతృభాష మీద పట్టు సంపాదించిన తర్వాత కూడా ఇంగ్లిషులో స్కిల్స్ పెంచుకోవచ్చు. అలాగే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇంగ్లిషులో వెనుకబడి ఉంటారనుకోవడం సరికాదు. కృషి, పట్టుదల ఉంటే ఇంగ్లీషు మీద కమాండ్ తెచ్చుకోవడం ఎవరికైనా తేలికే.
టోఫెల్: మీరు అమెరికాలో గ్రాడ్యుయేట్ కోర్సులలో అడ్మిషన్ సంపాదించాలంటే ముందుగా ఆలోచించవలసింది టోఫెల్ పరీక్ష గురించే. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్ అనే ఈ పరీక్ష అమెరికా సహా 130కిపైగా దేశాలలో 8వేలకి పైబడిన కాలేజీలు, యూనివర్శిటీల గుర్తింపు పొంది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గౌరవానికి పాత్రమవుతోంది. టోఫెల్ స్కోర్సుని అంగీకరించే విద్యా సంస్థలలో ప్రపంచంలోని 100 అగ్రశ్రేణి యూనివర్శిటీలు కూడా వున్నాయంటే ఈ కోర్సుకి సర్వత్రా వున్న గుర్తింపు అర్థమవుతుంది.
విద్యార్థులకి గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం ఇచ్చేటప్పుడు వారి టోఫెల్ స్కోరుని ఒక ముఖ్యమైన కొలబద్దగా యు.ఎస్. యూనివర్శిటీలు భావిస్తాయి. ఒక అమెరికన్ యూనివర్శిటీలో చేరిన తర్వాత అక్కడ క్లాసు రూములో ఉపయోగించడానికి అవసరమైన ఆంగ్ల భాషా నైపుణ్యం మీకు వున్నదని టోఫెల్ టెస్టు స్కోర్లు ద్వారా మీరు రుజువు చేసుకుంటారు. 165 దేశాలలో 4,500కి పైగా టెస్టు సైట్లలో విద్యార్థులు టోఫెల్ పరీక్ష రాసే సౌలభ్యం వుంది. ఈ టెస్టు మొత్తం ఒక్కరోజులోనే పూర్తి కావడం ఇంకొక వెసులుబాటు.


టోఫెల్‌లో ఇంటర్నెట్ ఆధారంగా జరిగే పరీక్షని ఐ.బి.టి అని, పేపర్‌పైన రాసే పరీక్షని పి.బి.టి అని అంటారు. ఐ.బి.టి. అందుబాటులో లేని కొన్ని దేశాలలో పి.బి.టి.ని నిర్వహిస్తారు. టోఫెల్ ఐ.బి.టి. పరీక్ష ఒక ఏడాదిలో 30 నుంచి 40సార్లు నిర్వహిస్తారు. ఏటా దాదాపు 10లక్షల మంది ఈ పరీక్షకి హాజరవుతుంటారు.
ఐ.ఇ.ఎల్.టి.ఎస్.: ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ అనేది గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఉన్న మరొక ప్రతిష్ఠాత్మకమైన ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్టు. 135 దేశాలలో 6,000కి పైగా విద్యా సంస్థలు గుర్తించిన ఈ టెస్టుకి ఏటా 14లక్షల మందికిపైగా విద్యార్ధులు హాజరవుతారు.

ఆస్ట్రేలియా, బ్రిటన్‌తో పాటు కొన్ని యు.ఎస్. యూనివర్శిటీలు కూడా ఈ టెస్టు స్కోర్లని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ యు.ఎస్. విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థులలో టోఫెల్‌కే ఆదరణ ఎక్కువ. అమెరికాలో ఏ యూనివర్శిటీ ఏ టెస్టుని ప్రిఫర్ చేస్తుందనేది ఆయా యూనివర్శిటీల వెబ్‌సైట్ల నుంచి తెలుసుకోవాలి.

యు.ఎస్. వెళ్ళాలనుకున్న విద్యార్థులు ఒక ప్రొఫెషనల్ కోర్సులో చేరినప్పటి నుంచే టోఫెల్‌కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాలి. బయట సంకోచం లేకుండా ఇంగ్లీషులో మాట్లాడాలి. తెలుగుతో పాటు ఇంగ్లీష్ న్యూస్‌పేపర్లు కూడా క్రమం తప్పకుండా చదవాలి.
పిల్లల్ని యు.ఎస్. పంపించాలనుకున్న పేరెంట్స్ ఈ విషయాల మీద మొదటినుంచి శ్రద్ధ తీసుకుంటే వాళ్ళు గ్రామాల నుంచి వచ్చినా, గవర్నమెంటు స్కూళ్ళలో చదివినా టోఫెల్‌లో మంచి స్కోర్లు సంపాదించడం కష్టమేమీ కాదు. 

Thursday, November 1, 2012

చిన్న నేరానికి అరెస్టయినా పెద్ద సమస్య రావచ్చు

పిల్లలు బస్సు ఎక్కుతున్నా, దిగుతున్నా బస్సు నుంచి ఎరుపు రంగు ఫ్లాష్ లైట్, స్టాప్ సిగ్నల్ వెలుగుతుంటాయి. అప్పుడు వెనక వస్తున్న ఏవాహనమైనా బస్సుకి కనీసం పది అడుగుల దూరంలో నిలిచి పోవలసిందే. అలా కాకుండా బస్సుని క్రాస్ చేస్తే 250 డాలర్ల జరిమానా విధించి, 60రోజుల వరకు డ్రైవింగ్ లెసైన్నుని సస్పెండ్ చేస్తారు. జరిమానాలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి.

ఇంగ్లిష్.. వింగ్లిష్..!

- ఆత్మన్యూనతాభావంలో తెలుగు మీడియం విద్యార్థులు

- నగర వాతావరణంలో ఇమడలేక సతమతం

- చదువు వదిలేసి ఇంటికొచ్చేస్తామంటూ ఆవేదన

- ఇంటర్‌లో ఇంగ్లిష్‌ను నిర్లక్ష్యం చేస్తున్న విద్యాసంస్థలు

- భవిష్యత్తు సవాళ్లపై మార్గదర్శనం శూన్యం

- దీంతో ఇంజనీరింగ్‌లో విద్యార్థుల ఇబ్బందులు

Saturday, October 27, 2012

అక్కడ పుట్టబోతున్న మనవడు, ఇక్కడ వీసా కష్టాలు!

అసలు కంటె వడ్డీ ముద్దు. ఏళ్ల తరబడి పిల్లలు అమెరికాలో, తాము ఇక్కడ ఉండగలిగిన తల్లిదండ్రులు తమకు మనవడో, మనవరాలో పుట్టబోతున్నట్టు తెలసినప్పుడు మాత్రం రెక్కలు కట్టుకుని అమెరికాలో వాలిపోవాలని తహతహలాడతారు. తన కూతురికి, లేదా కోడలికి నెలలు నిండేటప్పుడు దగ్గర ఉండి ఆమె బాగోగులు చూసుకోవాలని ఏ తల్లి అయినా, అత్తగారయినా ఆశపడతారు.

పుత్రోదయాన్ని పొందబోతున్న పడతికి అమ్మ, అత్త దగ్గరుండి సేవలు చెయ్యడం మన సంప్రదాయంలో ఒక విడదీయరాని ముఖ్యభాగం. మనవడు, లేదా మనవరాలి రాక కోసం కళ్లు కాయలు చేసుకుని ఎదురు చూస్తూ కూతురికి లేదా కోడలికి సపర్యలు చేసే అమ్మ, అత్తల సేవలు ప్రపంచంలోని ఏ కరెన్సీతోను అన్నిటికంటె విలువైన, డాలర్లతోను కొనలేనివి, వెల కట్టలేనివి. అంతేకాదు. తమ వృద్ధాప్యాన్ని కూడా ఖాతరు చెయ్యకుండా కాన్పుకి ముందు, కాన్పు తర్వాత తమ కుమార్తెకి తమ కోడలకి అమ్మ, లేదా అత్త అందించే ప్రేమ పూరితమైన సేవలు ప్రతి దానినీ పౌండ్లు, డాలర్లతో వెలకట్టే సమాజాలలో దొరకనివి కూడా.

ఇక్కడ మిగిలినపోయిన అమ్మ, అత్తలకి అక్కడ అమెరికాలో కూతురు, కోడలు కడుపులో కదిలిన పేగుకి మధ్య రుణానుబంధం ఇంతగా విడదీయరానిదీ, ఇంతగా అనూచానమైనదీ అయివుండగా కూతురి లేదా కోడలి కాన్పు కోసం, మనవడు లేదా మనవరాలిని ఎత్తుకోవడానికి వెళ్లేందుకు యు.ఎస్.కాన్సులేట్‌లో తమకి వీసా రాకపోవడం ఏ గ్రాండ్ పేరెంట్స్‌కైనా సరే అశనిపాతమే అవుతుంది.

ఇలా అమెరికాలో తమ ప్రాణానికి ప్రాణం లాంటి కూతురు లేదా కోడలు డెలివరీకి వీసా రెఫ్యూజ్ అయి వెళ్లలేకపోయిన అనేకమంది తల్లిదండ్రుల, అత్తమామల ఆక్రోశాన్ని యు.ఎస్.కాన్సులేట్‌లో పనిచేసిన పాతికేళ్లలో నేను అనేక పర్యాయాలు విన్నాను. అయితే ఇది నాణానికి ఒక పక్క మాత్రమే. నాణానికి రెండవవైపున మనకి భిన్నమైన అమెరికన్ సంస్కృతి, దాని ప్రాతిపదికపైన రూపొందిన వీసా నిబంధనలు ఉన్నాయి.

ఇక్కడ ముందుగా మీకు నేను చెప్పదలుచుకున్న అంశం అమెరికాలో తమ కూతురు డెలివరీకి వెళ్లానుకునే పేరెంట్స్ వీసాకి అనర్హులు అని తేల్చి చెప్పే నిబంధన ఎక్కడా లేదు.


అలాగే డెలివరీకి వెళుతున్నామని చెప్పిన వారికి కూడా కాన్సులేట్ ఆఫీసర్లు వీసాలు ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. కనుక వీసా ఇంటర్వ్యూలో మీరు మీ అమ్మాయి డెలివరీకి వెళుతున్నామని చెబితే ‘మీకు రూఢిగా వీసా రాదు’ అని ఎవరైనా చెబితే అది నిజం కాదని అర్థం చేసుకోండి. అయితే కూతురు/ కోడలు డెలివరీకి వెళ్లాలనుకునే పేరెంట్స్‌కి వీసా వచ్చే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ నిజాన్ని జీర్ణించుకోవాలంటే అమెరికన్ సంస్కృతి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

అమెరికాలో ‘కుటుంబం’ చాలా చిన్నది. తను, తన జీవిత భాగస్వామి, మైనారిటీ తీరని తన పిల్లలు అంతే. తల్లిదండ్రులు, అత్తమామలు, ఆ మాటకొస్తే మైనారిటీ తీరిన పిల్లలు లెక్కప్రకారం అమెరికన్ కుటుంబాలలో సభ్యులు కాదు. అందువల్ల మన సమిష్టి కుటుంబ సంప్రదాయాలు, కాన్పు సమయంలో దగ్గర ఉండడం అనే మన ప్రేమ పూరితమైన బాధ్యతలు, సెంటిమెంట్లు లాంటివి అమెరికన్ చట్టాల రూపకల్పనని, నిబంధనల నిర్మాణాన్ని ప్రభావితం చేయలేకపోయాయి.

Friday, October 26, 2012

స్టూడెంట్స్ అందరికీ అమెరికాలో సోషల్ సెక్యురిటీ వస్తుందా?

అమెరికాలో సోషల్ సెక్యురిటీ నంబర్ (ఎస్.ఎస్.ఎన్.) లేకపోతే అసలు ఏ పనీ జరగదు. అక్కడ బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే డబ్బు కంటే ముందు ఎస్.ఎస్.ఎన్. అవసరం. అసిస్టెంట్ షిప్ రావాలన్నా, వర్క్ చెయ్యాలన్నా, డ్రైవింగ్ లెసైన్స్ కావాలన్నా (కొన్ని మినహాయింపులతో) ఈ నంబరు తప్పనిసరి. ఎవరి నంబరు వారికే ప్రత్యేకంగా ఉండే ఈ ఎస్.ఎస్.ఎన్.ని యు.ఎస్. సిటిజన్లు, గ్రీన్ కార్డు హోల్డర్లు, తాత్కాలిక ఉద్యోగాలు చేసే విదేశీయులు, ఇంకా మరికొందరు అర్హులైన వారికి ఇస్తారు.

‘ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు’

గ్రూప్-1 మినహా ఏపీపీఎస్సీ నిర్వహించే మరే పరీక్షలకూ ఇంటర్వ్యూలను నిర్వహించబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ విషయమై కృష్ణయ్య నేతృత్వంలో వివిధ యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూను కలిసి చర్చలు జరిపారు. 40 కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలు లేకుండానే ఫలితాలివ్వాలని ఏపీపీఎస్సీ అధికారులను ఆదేశిస్తామని, ఈ మేరకు శుక్రవారమే ఉత్తర్వులిస్తామని హామీ ఇచ్చారని కృష్ణయ్య తెలిపారు. 

Tuesday, October 23, 2012

ఐ-20 పొడిగించడం ఆటోమాటిక్ ఏమీ కాదు

శాన్ డీగో. కాలిఫోర్నియాలో రెండవ పెద్ద నగరం. ఇటీవలే ఒక తెల్లవారు జామున ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక అపార్ట్‌మెంట్‌పై దాడిచేశారు. ఎఫ్-1 మీద ఒక పక్క కాలేజీకి వెళుతూనే ఇంకోపక్క వర్క్ ఆథరైజేషన్ లేకుండా క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న దాదాపు 40 మంది స్టూడెంట్స్ ఉంటున్నట్టు ఎవరో ఉప్పందించడంతో దాడి చేసి వాళ్లని పట్టుకున్నారు. వాళ్ల వీసాలని రద్దు చేసి 30 రోజులలోగా యు.ఎస్. నుంచి వెళ్లిపోవలసిందిగా ఆదేశించారు.

అంతరిక్షంలో వంద రోజుల పండుగ....

 భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ సోమవారం అంతరిక్షంలో వంద రోజులు పూర్తి చేసుకున్నారు. ఆమె ఈ ఏడాది జూలైలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్)కి చేరుకోవడం తెలిసిందే. ‘అంతరిక్షంలో తేలియాడడం అమూల్యమైన అనుభూతి. మేం దాన్ని ప్రతిక్షణాన్ని ఆనందిస్తున్నాం’ అని సునీత సోమవారం ఐఎస్‌ఎస్‌లోని డెస్టినీ యూఎస్ లేబొరేటరీ మ్యాడ్యూల్ నుంచి ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే ఇంటిలాంటి ప్రదేశం అంతరిక్షంలోనే కాదు మరెక్కడా లేదన్నారు. ఐఎస్‌ఎస్‌లో దిండు, పరుపు లేకుండా నిద్రలోకి జారుకోవడానికి కాస్త సమయం పడుతోందని అన్నారు. ఐఎస్‌ఎస్‌లో తమ పరికరాలు అక్కడొకటీ ఇక్కడొకటీ పడి ఉన్నాయని, కొత్త వ్యోమగాములు వచ్చే లోపు వాటిని శుభ్రం చేయాల్సిన అవసరముందని చెప్పారు. 

Friday, October 19, 2012

యు.ఎస్ వెళ్లిన తర్వాతే ఎఫ్-1 అసలు కథ!

స్టూడెంట్ వీసా ఇవ్వడానికి కాన్సులేట్‌లు చూసే ప్రధానమైన రిక్వైర్‌మెంట్‌లలో విద్యార్థికి అమెరికాలో ఉండడానికి తగినంత ఫండ్ ఉండాలి. ఆర్థిక వనరులు చూపలేనివారిని ‘‘పొటెన్షియల్ ఇమిగ్రెంట్’’ గా భావించి వీసా నిరాకరిస్తారు. వీసా కోసం ఏదో ఒక అకౌంట్‌లో డబ్బు చూపించి ఆ తర్వాత చేతిలో చిల్లిగవ్వ లేకుండా అమెరికాలో దిగే విద్యార్థి పీకల లోతు కష్టాలలో కూరుకుపోక తప్పదని పేరెంట్స్ గుర్తించాలి. మీ దగ్గర సొంత డబ్బు లేకపోతే జాతీయ బ్యాంకుల దీర్ఘకాలిక విద్యా రుణాలకు ప్రయత్నించండి.



ఎఫ్-1 అసలు కథ!

ఇక్కడ యుఎస్ కాన్సులేట్ నుంచి ఎఫ్-1 వీసా వచ్చిన వెంటనే అమెరికా వెళతారు. అయితే వెళ్లిన తర్వాత ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎఫ్-1 కథ ఎలా తిరగడుతుందో ఒక ఉదాహరణ చూడండి.



శ్రీధర్ న్యూయార్కులో ఒక యూనివర్సిటిలో చేరాడు. ఆర్థిక వనరులు అంతగా లేకుండా వెళ్లడం వల్ల అప్పుడప్పుడు క్లాసులు వదిలేసి వర్క్‌కి వెళ్లేవాడు. అదే అతడిని ఆఖరికి చిక్కుల్లో పడేసింది.



యు.ఎస్‌లో ఎఫ్-1లు పార్ట్ టైము క్యాంపస్ ఉద్యోగాలని నిర్ణీత గంటలకు మించకుండా, డి.ఎస్.ఓ. (స్కూలు అధికారి) అనుమతితోనే జరగాలి. ‘‘సేవిస్’’ డేటా బేస్‌లో దాని వివరాలు అప్‌డేట్ అవుతూ ఉండాలి. శ్రీధర్ ఇక్కడే దెబ్బ తిన్నాడు. డి.ఎస్.ఓ. తో అతనికి సరైన కమ్యూనికేషన్ కుదరలేదు. క్యాంపస్ జాబ్ గురించి ఎప్పటికప్పుడు డి.ఎస్.ఓ.తో చర్చించలేకపోయాడు. తను ఎక్కువ గంటలు పని చేస్తున్నట్టు ఎవరో అంటే యూనివర్సిటీ ఆఫీసులో అడిగొచ్చాడే గాని డి.ఎస్.ఓ. దగ్గరకు వెళ్లలేదు. యూనివర్శిటీ అబ్జెక్షన్ పెట్టేవరకు భయపడాల్సింది ఏమీ లేదని ఎవరో చెప్పింది నమ్మాడేగాని తన స్కూలు అధికారిని కన్సల్ట్ చెయ్యలేదు. దానితో ఒకనాడు డి.ఎస్.ఓ. అతడిని పిలిచి ‘‘ఫుల్ కోర్స్ లోడ్’’ (పూర్తి కోర్సు) చెయ్యలేక పోవడం వల్ల ‘‘సేవిస్’’ నిబంధనల క్రింద తను ‘‘అవుటాఫ్ స్టేటస్’’ అయ్యాడని, అతని ఎఫ్-1 వీసా రద్దయిందని, యు.ఎస్. నుంచి తక్షణం వెళ్లిపోవాలని చెప్పాడు.

అప్పీళ్ల కోసం తిరుగుతూ దేశం విడిచే గడువుని కూడా శ్రీధర్ పట్టించుకోకపోవడంతో అతడి మీద రిమూవల్ ప్రొసీడింగ్స్ అమలుచేసి బలవంతంగా అమెరికా నుంచి పంపేశారు. కష్టపడి సంపాదించుకున్న స్టూడెంట్ వీసాకి చిక్కులు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తల్ని పాటించాలి. మీ డి.ఎస్.ఓ. తో సత్సంబంధాలు కొనసాగించాలి సెవిస్ రూల్స్‌ని జవదాటని క్రమశిక్షణ పాటించాలి తొలి విద్యా సంవత్సరంలో ఆఫ్ క్యాంపస్ జాబ్ చెయ్యకూడదు ఆన్ క్యాంపస్ వర్క్ కూడా డి.ఎస్.ఓ. అనుమతితోనే చెయ్యాలి ఎఫ్-1 మీద యు.ఎస్. చేరిన తర్వాత 30 రోజులలోగా యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకోవాలి మందస్తు అనుమతి లేకుండా ఒక్క క్లాసుకి కూడా గైర్హాజరు కాకూడదు స్కూల్ జరిగేటప్పుడు వారానికి 20 గంటలకి మించి వెకేషన్‌లో వారానికి 40 గంటలకి మించి ఆన్ క్యాంపస్ జాబ్ చెయ్యకూడదు ఐ-20 లో వేసిన తేదీలోగా కోర్సు పూర్తిచెయ్యలేకపోతే ముందుగానే ఎక్స్‌టెన్షన్ పొంది తీరాలి ఒక స్కూలు నుంచి ఇంకొక స్కూలుకి మారాలంటే సెవిస్ నిబంధనల్ని పాటించితీరాలి యు.ఎస్సీ.ఐ.ఎస్ అనుమతించిన స్కూలులో మాత్రమే చదవాలి. ఏ ఒక్క నిబంధనని ఉల్లఘించినా ఎఫ్ వీసా రద్దవుతుంది.

Tuesday, October 16, 2012

ఈ గ్రహానికి.. నాలుగు సూర్యుళ్లు

భూమికి 5 వేల కాంతి సంవత్సరాల దూరంలోని ‘కేఐసీ 4862625’ అనే ఓ అసాధారణ క్వాడ్రిపుల్ సౌర వ్యవస్థ ఊహాచిత్రమిది. ఇందులోని నాలుగు సూర్యుళ్ల చుట్టూ తిరుగుతున్న ‘పీహెచ్1’ అనే ఓ భారీ గ్రహాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంతవరకూ ఒకటి లేదా రెండు నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలనే గుర్తించగా.. నాలుగు తారల చుట్టూ తిరిగే ఇలాంటి గ్రహాన్ని గుర్తించడం మాత్రం ఇదే తొలిసారి. భూమి కన్నా ఆరు రెట్లు పెద్దదైన పీహెచ్1 పూర్తిగా వాయువులతోకూడి ఉందట. అక్కడ 484-644 డిగ్రీ ఫారెన్‌హీట్‌ల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని, దానికి చంద్రుడి వంటి ఉపగ్రహాలూ ఉండవచ్చని అంచనా. అయితే, ఇంత ప్రతికూల పరిస్థితుల్లో ఆ గ్రహం ఎలా మనగలిగిందన్న కోణంలో ఇప్పుడు పరిశోధిస్తున్నారు