Showing posts with label Business. Show all posts
Showing posts with label Business. Show all posts

Sunday, October 21, 2012

దిగివస్తున్న బంగారం ధరలు


అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నెల రోజుల కనిష్ఠ స్థాయికి దిగి వచ్చింది. అమెరికా, యూరోప్‌ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల వార్తల కారణంగా డాలర్‌ బలపడింది. ఈ కారణంగా బంగారం ధర తగ్గింది. ఈనెల మొదటి వారంలో 1800 డాలర్ల సమీపంలోకి వెళ్లిన ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 1725 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. షార్ట్‌ టర్మ్‌ కోసం బంగారంలో పెట్టుబడులు పెట్టిన స్పెక్యులేటర్లు లాభాలు స్వీకరిస్తుండటం కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణమని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.




1600 డాలర్ల స్థాయి నుంచి వేగంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నెల కిందట 11 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అంటే 1800 డాలర్ల సమీపానికి వచ్చింది. ఇప్పుడు మళ్లీ 1600 డాలర్ల స్థాయికి వెళ్లేలా ఉందని అనలిస్టులు చెబుతున్నారు. సాధారణంగా దసరా, దీపావళి సమయంలో బంగారం ధర పెరుగుతుంటుంది. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మన రూపాయల్లో చూస్తే 10 గ్రాముల ధర దాదాపు 33 వేల రూపాయల దాకా వెళ్లింది. ప్రస్తుతం ఎంసీక్స్ లో 10 గ్రాముల ధర 100 రూపాయల దాకా నష్టపోతూ 31,200లకు సమీపంలో ట్రేడవుతోంది. అదే సమయంలో కేజీ వెండి ధర 100 రూపాయల దాకా పెరుగుతూ 59,900లకు సమీపంలో ట్రేడవుతోంది.

మీ ఫోన్.. వారి రక్తం!

కాంగోలో తీవ్రవాద ముఠాల దారుణ కాండ..

కుటుంబ సభ్యుల ఎదుటే అత్యాచారాలు, హత్యలు

బాలబాలికలతో వెట్టి చాకిరీ.

గనుల కోసమే ఆకృత్యాలు

ఆ లోహాలతో సెల్‌ఫోన్ సహా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ..

ఏడాదికి 900 కోట్లు..

అన్ని తీవ్రవాద కార్యకలాపాలకే!..

                                                             


                                                          
కాంగో నుంచి ఖనిజాలు కొనొద్దు: 'సేవ్ ది కాంగో'!


'బ్లడ్ ఇన్ మొబైల్' పేరిట లఘు చిత్రం.. 
  
ఇంటర్‌నెట్‌లో విడుదల

మీరు కొన్న టాబ్లెట్ కంప్యూటర్ విలువెంతో తెలుసా..? కాంగో దేశంలో ఒక మహిళ మానం!? అదే మీ ల్యాప్‌టాప్ కోసం ఖర్చయ్యిందెంతో తెలుసా..? ఆ దేశంలో ఒక మనిషి ప్రాణం!? మనం కొంటున్న సెల్‌ఫోన్ విలువ.. ఆవిరవుతున్న ఒక బాల్యం..!? ఇంతేకాదు.. మనం కొనే ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువు వెనుకా.. కాంగో దేశ ప్రజల కన్నీరు ఉంటుంది. ఆ దేశంలో ఓ నేరంతో అది సంబంధాన్ని కలిగి ఉంటుంది.

Thursday, October 4, 2012


వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. విద్యా, ఉద్యోగ రంగ్లాల్లోనే కాదు ఇంజినీరింగ్, టెక్నాలజీ వ్యాపార రంగంలోనూ ఇండియన్స్ ముందున్నారు. అగ్రరాజ్యంతో కొత్తగా కంపెనీలు పెడుతున్న ఇమ్మిగ్రెంట్స్‌లో భారతీయులే టాప్‌లో ఉన్నారని తాజా సర్వేలో తేలింది. వలసదారులు కంపెనీలు స్థాపించడం తగ్గుముఖం పట్టినా ఎన్నారైలే అగ్రస్థానంలో కొనసాగుతుండడం విశేషం.



2006-12 మధ్యకాలంలో అమెరికాలో కొత్తగా కంపెనీలు స్థాపించిన ఇమ్మిగ్రెంట్స్‌లో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. 33.2 శాతం మంది ఎన్నారైలు కంపెనీలు ఏర్పాటు చేశారు. 2005తో పోల్చుకుంటే ఇది ఏడు శాతం అధికం. జాతీయ స్థాయిలో ప్రవాసులు స్థాపిస్తున్న కొత్త కంపెనీ సంఖ్య 24.3 శాతానికి త గ్గింది. 2005 నాటికి ఇది 25.3 శాతంగా నమోదయింది. సిలికాన్‌వ్యాలీలో ఈ శాతం 52.4 శాతం నుంచి 43.9 శాతానికి పడిపోయిందని సర్వేలో వెల్లడయింది. కావుఫ్‌మాన్ ఫౌండేషన్ఈ సర్వే నిర్వహించింది. 32 పేజీల సర్వే నివేదికను కావుఫ్‌మాన్ ఫౌండేషన్విడుదల చేసింది.

దీని ప్రకారం కొత్తగా కంపెనీలు పెట్టిన విదేశీ వలసదారుల టాప్-10 జాబితాలో ఇండియా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. భారత్(33.2 శాతం) తర్వాత చైనా(8.1), బ్రిటన్(6.3), కెనడా(4.2), జర్మనీ(3.9), ఇజ్రాయెల్(3.5), రష్యా(2.4), కొరియా(2.2), ఆస్ట్రేలియా(2), నెదర్లాండ్స్ (2 శాతం) ఉన్నాయి. ఎన్నారైలు కాలిఫోర్నియాలో అత్యధిక సంఖ్యలో(26 శాతం) కొత్త కంపెనీలు పెట్టారు. మసాచుసెట్స్‌ను 8 శాతం మంది ఎంపిక చేసుకున్నారు.

17 నెలల గరిష్ట స్థాయికి నిఫ్టీ



కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు స్టాక్ మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. బీఎస్ఈ సూచి సెన్పెక్స్ గురువారం సెన్పెక్స్ 15 నెలల గరిష్ట స్థాయికి చేరి19 వేల స్థాయిని అందుకుంది. సెన్పెక్స్ 188 పాయింట్లు లాభపడి 19,107 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17 నెలల గరిష్ట స్థాయికి చేరింది. నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 5,787 వద్ద కుదురుకుంది.