Thursday, October 4, 2012

టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక

కొలంబో: ప్రపంచకప్ ట్వంటీ 20లో భాగంగా ఇక్కడ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లంకేయులు 140 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యాన్ని ఛేదించడంలో తడబాటుకు గురైన పాకిస్థాన్ ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఓపెనర్లు హఫీజ్ (42), నజీర్ (20) పరుగులతో మంచి ఆరంభాన్నిచ్చినా, మిడిల్ ఆర్డర్ వైఫల్యం పాకిస్థాన్ కొంపముంచింది. పేలవమైన బ్యాటింగ్‌ను కొనసాగించిన పాక్ 123 పరుగులకే పరిమితమైయ్యారు. చివర్లో ఉమర్ ఆక్మల్(29) పరుగులతో రాణించినా అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. ఆరుగురు పాకిస్థాన్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. లంకేయులు ఆద్యంతం పకడ్భందీగా బౌలింగ్ చేసి పాక్‌ను నిలువరించారు. శ్రీలంక బౌలర్లలో అత్యధికంగా హెరాత్ మూడు వికెట్లు తీయగా, మాథ్యూస్ , మెండిస్‌లకు తలో రెండు వికెట్లు లభించాయి. 

No comments: