డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నిల మధ్య ఎన్నడూ లేనంతగా రసవత్తర పోరుకు తెరతీయడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నిల మధ్య ఎన్నడూ లేనంతగా రసవత్తర పోరుకు తెరతీయడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. రోమ్ని నుంచి ఒబామా గట్టి పోటీని ఎదుర్కొంటున్నారనేది వాస్తవమే అయినప్పటికీ.. ఇప్పటికి ఒబామా అధిక్యంలో ఉండటం డెమోక్రాటిక్ వర్గాలకు ఊరట కలిగించే విషయం. గత కొద్ది రోజుల వరకు రోమ్నిపై స్వల్ప ఆధిక్యాన్నిఒబామా ప్రదర్శించినట్టు సర్వేలు వెల్లడించాయి. అయితే అధ్యక్ష ఎన్నికలపై తొలి చర్చాకార్యక్రమానికి ముందు వెల్లడించిన సర్వే ఫలితాలు డెమోక్రాటిక్ పార్టీలో గుబులు రేపుతోంది. శ్వేత భవనంలో పాగా వేయడానికి ఒబామా, రోమ్నిలు హోరాహోరీగా పోరాటం చేస్తున్నారని తాజా సర్వేల ఫలితాల వెల్లడించాయి. ఎన్ బీసీ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్, సీఎన్ఎన్ పోల్స్ వెల్లడించిన సర్వేలో ఒబామాకు 49 శాతం, రోమ్నికి 46 శాతం మద్దతు లభిస్తోందని తెలిపింది.
బుధవారం రోజున కోలరాడోలోని డెన్వర్ లో ఒబామా, రోమ్నిలు తొలిసారి ముఖాముఖి చర్చకు సిద్దమయ్యారు. అయితే ఓటింగ్ ప్రక్రియకు తొలి చర్చా కార్యక్రమం కీలకంగా మారనుందని.. చర్చా కార్యక్రమం ప్రకారం ఓటు ఎవరికి వేయాలనేది నిర్ణయం జరుగుతుందని ఎన్ బీసీ, వాల్ స్ట్రీట్ జర్నల్ సర్వేలో ఓటర్లు తమ మనోగాతాన్ని వెల్లడించారు. అయితే సర్వేలో ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశ ఆర్ధిక పరిస్థితి గతి తప్పిందని 53 శాతం మంది వెల్లడించగా.. 40 శాతం మంది అమెరికాకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమి లేదని అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment