Thursday, October 4, 2012

ఎఫ్-1కి, హెచ్ -1కి మధ్య వంతెన ‘ఓపిటి’

వార్షిక సెలవుల్లో లేదా కోర్సు వర్క్ పూర్తయి విద్యార్థులు థీసిస్, డిజర్‌టేషన్, ప్రాజెక్ట్‌లో ఉండగా చేసే పార్ట్ టైమ్ లేదా ఫుల్‌టైమ్ జాబ్ ప్రీ కంప్లీషన్ ఓపిటి కిందికి వస్తుంది. కాగా ఒక విద్యాసంవత్సరం జరుగుతుండగా లేదా విద్యార్థి ఫుల్ కోర్సు లోడ్‌ని పూర్తిగా చేస్తుండగా పార్ట్ టైమ్ మాత్రమే అనుమతిస్తారు (నిర్దేశించిన పాఠ్యప్రణాళికను సంపూర్ణంగా అధ్యయనం చేయడాన్ని ఫుల్‌కోర్స్ లోడ్ అంటారు).


విదేశీ విద్యార్థులు హెచ్ ఒన్ వీసా లేకుండానే పరిమిత కాలానికి అమెరికాలో పనిచేయడానికి ఎంచుకునే మార్గాల్లో ఓపిటి (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) సర్వసాధారణమైనది. ఇది విద్యార్థికి ఆదాయంతోపాటు తన అధ్యయన రంగంలో విలువైన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఇస్తుంది.



విద్యార్థి వీసాకి (ఎఫ్-1), తాత్కాలిక ఉపాధి వీసాకి (హెచ్ -1) మధ్య మనవాళ్లకు అమెరికాలో ఒక చట్ట సమ్మతమైన వంతెన లాంటిది ఓపిటి. అక్కడ లీగల్‌గా ఉద్యోగంలోకి మారాలనుకునే మన విద్యార్థులు దీని లోతుపాతుల్ని మనసు పెట్టి శోధించాలి. అయితే పేరులో ఉన్నట్లుగానే ఓపిటి అనేది ఆప్షనల్. చదువు పూర్తి చేసుకుని ఓపిటి తీసుకోకుండానే హెచ్-ఒన్ కి మారకుండానే స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయే విదేశీ విద్యార్థులు కూడా ఉంటారు.


ఓపిటి క్యాంపస్ వెలుపల (ఆఫ్ క్యాంపస్) పని చేసే వీలు కల్పిస్తుంది. క్యాంపస్ బయట అంటే అమెరికాలో ఎక్కడైనా సరే అని అర్థం. యూనివర్శిటీకి సమీపంలోనే వర్క్ చేయాలనే నియమం ఏమీ లేదు.

స్కూల్‌లో ఉండగానే చేసే ప్రీ-కంప్లీషన్ ఓపిటి అని, చదువు పూర్తయ్యాక చేస్తే పోస్ట్ కంప్లీషన్ ఓపిటి అంటారు. ఈ రెండింటికీ వేర్వేరు నిబంధనలు ఉంటాయని మన విద్యార్థులు తెలుసుకోవాలి. అయితే ఈ రెండు దశలకీ కలిపి పన్నెండు నెలలపాటు మాత్రమే వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సెలవుల్లో రెండు నెలల ఓపిటి చేస్తే కోర్సు ముగిశాక పది నెలలుమాత్రమే ఓపిటికి అవకాశం ఉంటుంది. అంతకు ముందు సిపిటి మీద పన్నెండు నెలలు, అంతకు మించి పని చేసిన వారికి ఓపిటి అవకాశం ఉండదు.



వార్షిక సెలవుల్లో లేదా కోర్సు వర్క్ పూర్తయి విద్యార్థులు థీసిస్, డిజర్‌టేషన్, ప్రాజెక్ట్‌లో ఉండగా చేసే పార్ట్ టైమ్ లేదా ఫుల్‌టైమ్ జాబ్ ప్రీ కంప్లీషన్ ఓపిటి కిందికి వస్తుంది. కాగా ఒక విద్యాసంవత్సరం జరుగుతుండగా లేదా విద్యార్థి ఫుల్ కోర్సు లోడ్‌ని పూర్తిగా చేస్తుండగా పార్ట్ టైమ్ మాత్రమే అనుమతిస్తారు (నిర్దేశించిన పాఠ్యప్రణాళికను సంపూర్ణంగా అధ్యయనం చేయడాన్ని ఫుల్‌కోర్స్ లోడ్ అంటారు). స్కూల్ సెషన్‌లో ఉన్నప్పుడు వారానికి ఇరవై గంటల వరకు, సెషన్‌లో లేనప్పుడు లేదా వెకేషన్‌లో ఉన్నప్పుడు ఫుల్‌టైమ్ పని చేయవచ్చు. ఫుల్‌టైమ్ ఎంప్లాయీగా పని చేయడం, ఎన్ని కంపెనీలకైనా పని చేయగలగడం, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్‌గా పని చేయడం పోస్ట్ కంప్లీషన్ ఓపిటిలో ఉన్న వెసులుబాట్లు. స్కూలులో చేరి తొమ్మిది నెలలవుతుండగా ఓపిటికి దరఖాస్తు చేసుకోవచ్చు (ఓపిటికి ఎలా అప్లై చేసుకోవాలో విద్యార్థులు తాము ఎంచుకునే యుఎస్ విద్యాసంస్థల వెబ్‌సైట్ల నుంచి తెలుసుకోవచ్చు).

యుఎస్‌సిఐఎస్ నుంచి ఆథరైజేషన్ వచ్చేవరకు అలాగే స్కూల్‌లో చేరి ఏడాది గడిచే వరకు ఓపిటి మీద పనిచేయకూడదు. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఐ- 766 మీద సూచించిన తేదీ వరకు పని ప్రారంభించకూడదు.


ఎఫ్-1 వీసా మీద ఉన్నవారు అమెరికాలో ఓపిటికి అప్లై చేయడానికి జాబ్ ఆఫర్ చేతిలో ఉండవలసిన పని లేదు. కానీ ఓపిటి ఎంప్లాయ్‌మెంట్ అనేది ఒక విద్యార్థి తన విద్యాభ్యాసానికి ఎంచుకున్న ప్రధాన అధ్యయనాంశంతో నేరుగా సంబంధం కలిగి ఉండడం మాత్రం తప్పనిసరి.



ఓపిటి దరఖాస్తు పరిశీలను యుఎస్‌సిఐఎస్ తనకు అవసరమైన సమయం తను తీసుకుంటుంది. కనుక విద్యార్థులు ఈ ప్రాసెస్‌ని ముందుగా మొదలుపెట్టాలి. పోస్ట్ కంప్లీషన్ ఓపిటి కోసం విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ పూర్తికావడానికి 90 రోజుల ముందే అప్లయ్ చేయాలి. స్ప్రింగ్, సమ్మర్ సీజన్లలో ఓపిటి దరఖాస్తులు ముమ్మరంగా ఉంటాయి.


ఒక విదేశీ విద్యార్థి తన ఎఫ్ -1 వీసా స్టేటస్‌ని ఎక్కడా ఉల్లంఘించలేదని సెవిస్ రికార్డు ధ్రువపరిస్తేనే ఓపిటి ఇస్తారు. విద్యార్థి మరో స్కూల్‌కి మారినప్పుడు లేదా మరొక స్థాయిలో కొత్త కోర్సులోకి వెళ్లినప్పుడు అంతవరకు ఉన్న ఓపిటి తనకు తానుగా రద్దయిపోతుందని కూడా గుర్తుంచుకోవాలి.

ప్రతి హయ్యర్ ఎడ్యుకేషన్ స్థాయిలోనూ (తదుపరి స్థాయి కోర్సుకి మారినప్పుడల్లా) విద్యార్థులు ప్రతిసారి పన్నెండు నెలల చొప్పున ఓపిటి అవకాశం పొందుతారు. ఇలా ఉండగా నాలుగు ముఖ్య, నిర్దేశిత అధ్యయన రంగాలకు చెందిన విదేశీ విద్యార్థులు తమ ఓపిటిని మరో పదిహేను నెలలు (అంటే మొత్తం ఇరవై తొమ్మిది నెలలకు) పొడిగించుకునే ప్రత్యేక అవకాశం ఉంది.

No comments: