డీజిల్ ధర పెంచడం, రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐని అనుమతించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఒక ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడింది. ఈ ఉత్సాహాన్ని కొనసాగించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని నిర్ణయాలతో సంస్కరణలు నిలిపేస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రావని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఈవాళ కొన్ని ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇన్సూరెన్స్, పెన్షన్ రంగాల్లో ఎఫ్ డీఐలను 49 శాతానికి పెంచడం, కంపెనీల బిల్లుకు ఆమోదం, కాంపిటీషన్ చట్టం, కమొడిటీ ట్రేడింగ్ చట్టంలో మార్పులు చేయడంతో ఇతర నిర్ణయాలు తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల దాకా లాభపడుతూ 19 వేలపైన ట్రేడవుతోంది. 15 నెలల తర్వాత సెన్సెక్స్ మళ్లీ ఈ స్థాయికి వచ్చింది. రూపాయి కూడా బలపడుతోంది. ఫిబ్రవరి తర్వాత మళ్లీ 52ను అధిగమించి పైకి వచ్చింది

No comments:
Post a Comment