గాల్‌బ్లాడర్‌లో రాళ్లున్నా... లక్షణాలేమీ కనిపించకుండా, పరీక్షలు చేసినప్పుడు బయటపడేవాటిని ‘సెలైంట్ స్టోన్స్’ అంటారు. ఇటువంటి కేసుల్లో... పదేళ్ల పాటు ఫాలో అప్ చేస్తే వందలో పదిమందికి గాల్‌బ్లాడర్‌కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఆపరేషన్ చేయాల్సిందే. యుక్తవయస్సులోని వారిలో సెలైంట్ స్టోన్స్ బయటపడితే, వాళ్లకు ఇంకా చాలా జీవితం ఉంది కాబట్టి.... వాళ్ల భావి జీవితంలోని 40-50 ఏళ్ళలో ఆ సెలైంట్ స్టోన్స్ కొన్నిసార్లు కొంత ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. కొందరిలో ఏ హానీ కలగకపోవచ్చు.
అలాంటి సందర్భాల్లో డాక్టర్... రోగితో సంప్రదించి, తక్షణ చికిత్సగా శస్త్రచికిత్స చేయాలా లేక వేచి చూడాలా అని ఆయా కేసులను బట్టి పరిశీలిస్తారు. అందుకే... రోగులకూ ఈ విషయంలో ప్రాథమిక అవగాహన ఉండటం తప్పనిసరి. అందువల్ల ముందుజాగ్రత్త తీసుకునే అవకాశం, ఫలితంగా కాంప్లికేషన్లను నివారించే అవకాశం ఉంది.
No comments:
Post a Comment