తెలంగాణ కంటే ప్రాణహిత ప్రాజెక్టునే తాను, తమ ప్రాంత రైతులు కోరుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరుతూ రెండు వేల మంది కార్యకర్తలతో వచ్చే జనవరిలో సంగారెడ్డి నుంచి న్యూఢిల్లీకి 1800 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ లేదని, అందువల్ల తెలంగాణ ఇవ్వడం సాధ్యపడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయం కేసీఆర్‌కూ తెలుసన్నారు. ఆయన లోపల సమైక్యవాదని, బయట మాత్రం తెలంగాణవాదని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీ కేవలం కేసీఆర్ అభివృద్ధి కోసమే ఆవిర్భవించింది తప్ప తెలంగాణ ప్రజల్ని ఆదుకునేందుకు కాదని ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల మాటాల్ని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు.

No comments:
Post a Comment