Showing posts with label Akshayapatra. Show all posts
Showing posts with label Akshayapatra. Show all posts

Friday, November 30, 2012

మన ఆహారం... మన గొప్పదనం...

(ఇండియన్ డైటేటిక్ అసోసియేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ‘భారత ఆహారాలు-ఆరోగ్యం’పై సెప్టెంబర్ 29 నుంచి డిసెంబర్ 1వరకు హైదరాబాద్‌లో సదస్సు జరుగుతున్న నేపథ్యంలో...)

తిండి కలిగితే కండ గలదోయ్... అన్నాడు మహాకవి గురజాడ. పనిచేయాలంటే తగినంత శక్తి ఉండాలి కదా... అయితే పనిచేయడానికి మాత్రమే కాదు మనిషి మూర్తిమత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, వ్యవహారశైలిని కూడా తినే తిండి నిర్దేశిస్తుందని మన వేదాలు ఘోషిస్తున్నాయి. మనిషి వ్యవహారశైలి, పని స్వభావంపై ఆహారం ప్రభావం చూపిస్తుందని భగవద్గీతలో ప్రస్తావన ఉంది. ఆహారం మెదడుపైన ప్రభావం చూపిస్తుంది కనుకనే మనలో సత్వ, రజో, తమో గుణాలు ప్రేరేపణకు గురవుతుంటాయి. మన న్యాయశాస్త్రంలోనూ ఆహార పదార్థాల గురించిన వివరణ ఉంది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమావయ, అభవ పదార్ధాలుగా వాటిని వివరించారు. అందుకే వేదకాలానికి పూర్వం నుంచే అన్నం పరబ్రహ్మ స్వరూపమైంది.

వ్యాధులు, ఆరోగ్యంలో ఆహార పదార్ధాల పాత్రపై మన పూర్వీకులకు పూర్తి అవగాహన ఉండేది. ఉప్పు అధికంగా తీసుకంంటే వచ్చే ఎగ్జిమా, అసిడిటీల గురించి, స్వీట్లు ఎక్కువ తింటే పెరిగే కఫ దోషాల గురించి వారికి అనాడే తెలుసు. వాటికి విరుగుడుగా మంచి ఆహార అలవాట్లను, దోషనివారణకు అనువైన సాంప్రదాయ వైద్య ప్రక్రియలను అనాడే అభివృద్ధి చేసుకున్నారు. కానీ కాలం మారింది. నేడు కొత్త తరం ఆహార పదార్ధాలు వచ్చేశాయి. మనదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఆహార అలవాట్లలో విపరీతమైన మార్పులు వచ్చాయి. జీవన విధానమూ మారిపోయింది. సాంప్రదాయ భారత ఆహారం గింజధాన్యాలతో నిండి ఉండేది. దంపుడు బియ్యం స్థానంలో బాయిల్డ్ రైస్ వచ్చి చేరాయి. తెల్లబియ్యం వచ్చిన తర్వాత మిగిలిన రకాలను తినడమే మానేశారు.

గోధుమ పరిస్థితీ ఇంతే. చపాతీల స్థానాన్ని రిఫైన్డ్ గోధుమతో తయారయ్యే బ్రెడ్‌లు ఆక్రమించాయి. అమెరికన్లు, యూరోపియన్లు మన వంటకాలు నేర్చుకుని వాటిలో ఉన్న పోషక విలువలను తెలుసుకుని ఆశ్చర్యపోతుంటే భారతీయులు మాత్రం వారి పిజ్జాలు, బర్గర్ల వెంటపడుతున్నారు. జొన్నలు, సజ్జలు, రాగులను పూర్తిగా వదిలేశారు. ఇపుడు తింటున్న రిఫైన్డ్ ఆహారంలో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ ఉండడం లేదు. దాంతో రోగనిరోధక శక్తి కనుమరుగైపోతున్నది. వ్యాధులు పెరిగిపోయాయి. వయసుతో నిమిత్తం లేకుండా గుండె సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్, ఊబకాయం, డయాబెటిస్ వంటివి దాడి చేస్తుండడానికి కారణం మనం తినే ఆహారమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మన శరీర తత్వాన్ని, మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా అనేక వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చని వారు చెబుతున్నారు. సరిహద్దులో నిరంతరం దేశరక్షణ బాధ్యతలను చూస్తున్న సైన్యాన్ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. వారు ఎడారిలో, కొండకోనల్లో, మైదాన ప్రదేశాలలో కాపలా కాస్తుంటారు. అందుకే వారి కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నది. సైనికులు దేశాన్ని రక్షిస్తున్నట్టే మనమూ మన దేహాన్ని రక్షించుకోవాలి. ఈ విషయంలో మన పరిశోధనా సంస్థలు తీసుకుంటున్న జాగ్రత్తల నుంచి మనమూ పాఠం తీసుకోవాలి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అపుడే ఆరోగ్య భారత్ ఆవిష్కృతమవుతుంది.

- పి. తులసీకుమారి


రుచుల సోయగం

సోయ... అంటే సో గుడ్.
సోయ... ఉంటే సో హెల్దీ.
సోయ... వండితే సో టేస్టీ.
వీకెండ్‌లో హోటల్‌వైపు పరుగులు తీసే జిహ్వను కట్టిపడేసేలా ‘సోయ’ వంటకాలతో
ఇంటిల్లిపాదికి వెరైటీ విందు ఇవ్వండి.
వీకెండ్‌ను యమ్మీగా మార్చావంటూ కితాబు అందుకోండి.


సోయాబీన్ సటయ్

కావలసినవి

సోయాబీన్స్ - 100 గ్రా.
(సోయాబీన్స్‌ను మిక్సర్ జార్‌లో వేసి, మెత్తగా పొడి చేయాలి.) ఉప్పు - తగినంత
పీ నట్ బటర్ - 100 గ్రా. 
సోయ పాలు - తగినన్ని
పై పదార్థాలన్నీ చపాతీ పిండిలా కలిపి, పక్కనుంచాలి.
చాప్ స్టిక్స్ - తగినన్ని
సటయ్ మ్యారినేట్ కోసం... 
లెమన్‌గ్రాస్(మార్కెట్లో లభిస్తుంది) - అర కప్పు, ఉల్లిపాయలు - 2 (చిన్నవి), వెల్లుల్లి రెబ్బలు - 4 
కారం - అర టీ స్పూన్ 
అల్లం - చిన్నముక్క
పసుపు - చిటికెడు 
ధనియాలపొడి - టీ స్పూన్ 
సోయా సాస్- 2 టేబుల్‌స్పూన్లు 
నూనె - 3 టేబుల్ స్పూన్లు 

తయారి

మ్యారినేట్ కోసం చెప్పిన పదార్థాలన్నీ మిక్సర్ వేసి, బ్లెండ్ చేసి పక్కన ఉంచాలి. సోయాబీన్ మిశ్రమాన్ని సమానభాగాలు చేసి, కావలసిన షేప్ చేయాలి. వీటికి పుల్లలు గుచ్చి, వాటిమీద మారినేట్ మిశ్రమాన్ని పోయాలి. అన్నివైపులా తడిసేలా జాగ్రత్త తీసుకొని, ప్లేట్‌పైన మరో మూత పెట్టి లేదా కవర్‌తో మూసేయాలి. దీనిని గంటసేపు బయట ఉంచి, మరో గంట ఫ్రిజ్‌లో ఉంచి, ఆ తర్వాత ఈ ముక్కలను గ్రిల్ చేయాలి. రెండు వైపులా గ్రిల్ చేశాక, ప్లేట్‌లోకి తీసుకొని గార్నిష్ చేయాలి. పెనం మీద కాల్చుకోవాలంటే సరిపడా నూనెను వాడాలి. వీటిని టొమాటో చట్నీతో సర్వ్ చేయాలి.

టోఫు పీస్ మసాలా

కావలసినవి

సోయాటోఫు (మార్కెట్లో లభిస్తుంది) - 100 గ్రా., పచ్చి బఠాణీలు - అర కప్పు 
ఉల్లిపాయలు - 2, టొమాటో - 2 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్ 
బాదంపప్పు - 4, జీడిపప్పు - 4
ఎండుమిర్చి - 4, ధనియాలు - టేబుల్ స్పూన్, ఏలకులు - 2, 
సోంపు - అర టీ స్పూన్, 
దాల్చినచెక్క - చిన్న ముక్క
కారం - 2 టీ స్పూన్లు (తగినంత)
ఉప్పు - తగినంత, కొత్తిమీర - తగినంత 

తయారి

ఉల్లిపాయలను, టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. టోఫులను నీళ్లలో వేసి, బయటకు తీసి, పేపర్ టవల్ మీద ఉంచాలి. (ఇలా చేస్తే టోఫుల్లోని నీళ్లన్నీ ఇంకిపోతాయి). మెత్తబడిన టోఫులను కావలసిన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి, టేబుల్‌స్పూన్ నూనె వేసి, సన్నని మంటమీద టోఫు ముక్కలను పది నిమిషాలు రెండువైపులా వేయించాలి. టోఫులను విడిగా గిన్నెలోకి తీసుకొని, చల్లారనివ్వాలి. అదే పాన్‌లో మరొక టీ స్పూన్ నూనె వేసి, దాల్చినచెక్క, ఏలకులు, సోంపు, ధనియాలు, ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి. ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే పాన్‌లో ఉల్లిపాయముక్కలు వేయించి, దాంట్లో టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాలి. ఉడికిన టొమాటో ముక్కలను గరిటెతో చిదిమి, చల్లారనివ్వాలి. బాదం, జీడిపప్పులను వేయించి, పేస్ట్ చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేయించిన దినుసులను మిక్సర్ జార్‌లో వేసి, పొడి చేయాలి. దీంట్లోనే టొమాటో మిశ్రమం వేసి పేస్ట్ చేయాలి. స్టౌ పై పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి వేడయ్యాక, టొమాటో మిశ్రమం, జీడిపప్పు పేస్ట్ వేసి, కప్పు నీళ్లు పోసి కలపాలి. దీంట్లో ఉప్పు, కారం వేసి మరో పది నిమిషాలు మరిగించాలి. మిశ్రమం బాగా చిక్కబడిన తర్వాత టోఫు ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, చివరగా కొత్తిమీర వేసి దించాలి. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది. 

సోయ కబాబ్

కావలసినవి

సోయాబీన్ పొడి - 100 గ్రా.
బ్రెడ్ క్రంబ్ పౌడర్ - 100 గ్రా.
అల్లం - చిన్నముక్క (సన్నగా తరగాలి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
పచ్చిమిర్చి - 4
గరంమసాలా, 
జీలకర్ర పొడి - 
అర టీ స్పూన్ చొప్పున
ఆమ్‌చూర్ పొడి 
(మార్కెట్లో లభిస్తుంది) 
మిరియాల పొడి - చిటికెడు 
ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
నూనె - తగినంత

తయారి: 

కడాయిలో నూనె వేసి, ఉల్లిపాయలు, అల్లం తరుగు, కొత్తిమీర, అల్లం-వెల్లుల్లి పేస్ వేయించాక కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత సోయాబీన్ పొడి, బ్రెడ్ క్రంబ్ పొడి వేసి కలిపి, వేయించాలి. ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని తగినంత తీసుకొని, చేతులతో మిర్చి బజ్జీ అంత సైజు చేయాలి. వీటిని బొగ్గుల మీద లేదా గ్రిల్‌లోనైనా కాల్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చాకుతో మధ్యకు కట్ చేయాలి. వీటిని పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.

Friday, November 23, 2012

మొలకెత్తే బలం...

మొలకలు తింటే మంచిది అంటారు.
జీవం ఏదైనా ఆరోగ్యమే.
గింజ నుంచి మొలకెత్తే జీవం ఇంకా ఆరోగ్యం.
కాని, రోజూ అలాగే... పచ్చిగానే... చప్పిడిగానే అంటే... కొంచెం బోర్.
మైండ్ అప్లయ్ చేయాలి.
కిచెన్ సరంజామాతో మ్యాజిక్ చేయాలి. కొంచెం టొమాటో తరుగు, కాసింత వెల్లుల్లి పొడి, జీలకర్ర, నిమ్మరసం...
అన్నింటినీ జత చేస్తే... ఆపైన రుచి చూస్తే... ఉదయానికి నమస్తే...
ప్రతి ఉదయానికీ ఆరోగ్యమస్తే!


మొలకెత్తిన పెసలు

కావలసినవి
మొలకెత్తిన పెసలు - ఒకటిన్నర కప్పు
టొమాటో తరుగు - కప్పు
కీరా తరుగు - కప్పు
కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్
క్యాప్సికమ్ / పచ్చిమిర్చి తరుగు - తగినంత
సలాడ్ డ్రెస్సింగ్ కోసం...
మిరియాల పొడి - అర టీ స్పూన్
ఉప్పు - తగినంత
జీలకర్ర - టీ స్పూన్
నిమ్మరసం - టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూన్
పంచదార లేదా బెల్లం - టీ స్పూన్

తయారి
సలాడ్ డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి.

గిన్నెలో పావు కప్పు కన్నా తక్కువ నీళ్లు పోసి, ఉప్పు కలిపి మరిగించాలి. అందులో మొలకెత్తిన గింజలను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత గింజలను చల్లారనివ్వాలి.

సలాడ్ డ్రెస్సింగ్ కోసం కలిపిన మిశ్రమాన్ని, చల్లారిన గింజలపై వేసి కలపాలి.

సర్వ్ చేసే గిన్నెలో టొమాటో, కీరా తరుగు, ఆ పైన స్ప్రౌట్స్ ఉంచి, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగుతో గార్నిష్ చేయాలి.

నోట్: మొలకెత్తిన గింజలను, కూరగాయల తరుగును కలిపి ఎక్కువసేపు ఉంచకూడదు. దీనివల్ల పచ్చి వాసన వేసి, తినాలనిపించదు.

బఠాణీ సలాడ్

కావలసినవి
మొలకెత్తిన /బాగా నానిన బఠాణీలు - అర కప్పు, క్యారట్ ముక్కలు - అర కప్పు, బంగాళదుంప - 1, బీన్స్ - అర కప్పు, పెరుగు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, నిమ్మరసం - టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత

తయారి
కూరగాయ ముక్కలను, బఠాణీలను ఉడికించి, పక్కన పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో పెరుగు, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.

పెరుగు మిశ్రమాన్ని బఠాణీలు, కూరగాయల ముక్కల్లో వేసి, బాగా కలిపి, సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.

శనగల సలాడ్

కావలసినవి
శనగలు (ఉడికించినవి) - 3 కప్పులు
బంగాళదుంప - 1 (ఉడికించి, ముక్కలు చేయాలి), పసుపు - చిటికెడు, పచ్చిమిర్చి - 1 (తరగాలి), ఉల్లితరుగు - 2 టేబుల్ స్పూన్లు, టొమాటో - ఒకటి (తరగాలి)
పంచదార - అర టీ స్పూన్,
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - చిటికెడు
కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్

తయారి
ఒక గిన్నెలో పచ్చిమిర్చి, బంగాళదుంప, ఉల్లిపాయ, టొమాటో తరుగులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.

ఉడికించిన శనగలను పై మిశ్రమంలో వేసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

నోట్: మొలకెత్తిన శనగలకు కొద్దిగా నీరు కలిపి, 2 నిమిషాలు ఉడికించి సలాడ్‌కి వాడుకుంటే బాగుంటాయి.

మిక్స్‌డ్ బీన్స్ సలాడ్

కావలసినవి
బొబ్బర్లు+శనగలు+సోయా - కప్పు, టొమాటో - 1(గుండ్రంగా తరగాలి)
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్,
జీలకర్ర - అర టీ స్పూన్,
పసుపు - చిటికెడు
కరివేపాకు - రెమ్మ, కీరా - అరముక్క
(గుండ్రంగా తరగాలి)
ఉప్పు - తగినంత, ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూన్, నిమ్మరసం - టీ స్పూన్, మిరియాల పొడి - చిటికెడు

తయారి
బొబ్బర్లు, శనగలు, సోయా గింజలను ఉడకబెట్టి పక్కన పెట్టాలి.

ఆలివ్ ఆయిల్‌లో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, జీలకర్ర కలపాలి.

టొమాటో, కీరా, బొబ్బర్లు, శనగలు, సోయాగింజలు ఒక గిన్నెలో వేసి కలపాలి. అందులో ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని వే సి కలిపి, సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

గింజలు మొలకెత్తాలంటే...

పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, కందులు, పచ్చిబఠాణీలు, బీన్స్... ఇలా గింజధాన్యాలు మొలకెత్తాలంటే పది నుంచి పన్నెండు గంటలు నీళ్లలో నానబెట్టాలి.

ఆ తర్వాత గింజలను పల్చటి వస్త్రంలో వేసి, నీటిని వడకట్టాలి. తర్వాత కాస్త మందంగా ఉన్న వస్త్రంలో ఆ గింజలను వేసి, గట్టిగా మూట కట్టాలి. ఈ మూటను వెచ్చగా ఉండే చీకటి ప్రదేశం లో ఒక రోజు ఉంచాలి.

మొలకలకు నాణ్యమైన గింజలను ఎంచుకోవాలి. గింజ గట్టిదనాన్ని బట్టి కొన్ని రెండు రోజులకు కూడా మొలకలు రావచ్చు.

మొలకెత్తిన గింజలను ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే నాలుగైదు రోజుల పాటు వాడుకోవచ్చు.

మొలకెత్తిన గింజలను పచ్చిగాను, ఉడికించి గానీ తీసుకోవచ్చు. వీటిని ఆఫీస్, స్కూల్‌కు తీసుకెళ్లడం కూడా సౌలభ్యంగా ఉంటుంది.

మొలకెత్తిన గింజల్లో ఎక్కువ పీచుపదార్థాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత పీచుపదార్థం అందుతుంది.

Sunday, October 21, 2012

బాదుషా

మైదా .................................250 గ్రా.


డాల్టా లేదా వెన్న .............. 3 టీ.స్పూ.
పెరుగు ............................  100 గ్రా.

వంటసోడా ........................ చిటికెడు

ఉప్పు ............................... చిటికెడు

చక్కెర ............................. 500 గ్రా.

యాలకుల పొడి ............1/2 టీ.స్పూ.

నూనె .........................వేయించడానికి

ఇలా చేయాలి

మైదాలో ఉప్పు, సోడా వేసి జల్లించాలి. ఇందులో కరిగించిన డాల్టా లేదా వెన్న లేదా నెయ్యి వేసి కలపాలి. తర్వాత పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా తడిపి ఒక గంట నాననివ్వాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజులో ముద్దలా చేసుకుని కొద్దిగా వెడల్పు చేసి మధ్యలో వేలితో గుంతలా చేయాలి. ఇలా చేసుకున్నవి వేడి నూనెలో నిదానంగా బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.

పక్కన చక్కెరలో అర కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేలా మరిగించి యాలకుల పొడి కలిపి మూత పెట్టి ఉంచాలి. వేయించిన బాదుషాలను ఈ పాకంలో వేసి పది నిమిషాలు నాననిచ్చి తీసి, విడిగా ప్లేట్లో పెట్టుకోవాలి.

క్యారట్ పూర్ణాలు

క్యారట్ తురుము .............................. 1 కప్పు
చక్కెర ............................................... 1/4 కప్పు
యాలకుల పొడి ........................ 1/2 టీ.స్పూ.

నెయ్యి - 3 టీ.స్పూ.

మినప్పప్పు - 1 కప్పు

ఉప్పు - చిటికెడు

నూనె - వేయించడానికి

వండే విధం

మినప్పప్పు కడిగి నీళ్లుపోసి మూడు గంటలు నానబెట్టి మెత్తగా కాటుకలా రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసి కలిపి మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా కలిపి పెట్టుకోవాలి. ప్యాన్‌లో నెయ్యి వేడి చేసి క్యారట్ తురుము వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పంచదార వేసి ఉడికించాలి. మొత్తం ఉడికి దగ్గర పడ్డాక యాలకుల పొడి కలిపి దింపేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. క్యారట్ ఉండలను ఒక్కొక్కటిగా పప్పు మిశ్రమంలో ముంచి వేడి నూనెలో వేయాలి. అన్నివైపులా బంగారు రంగు వచ్చేవరకు వేపుకుని తీసేయాలి.

నవరాత్రి వంటలు..........కట్టె పొంగలి

బియ్యం - 250 గ్రా.

పెసరపప్పు - 100 గ్రా.

మిరియాలు

- 1/2 టీ.స్పూ.

జీలకర్ర - 1 టీ.స్పూ.

కరివేపాకు - 2 రెబ్బలు

ఉప్పు - తగినంత

నెయ్యి - 4 టీ.స్పూ.

నూనె - 3 టీ.స్పూ.

ఇంగువ - చిటికెడు

పచ్చిమిర్చి - 2

ఇలా చేద్దాం

బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఒక గినె్నలో నూనె, సగం నెయ్యి వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేసి దోరగా వేగిన తర్వాత కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపి, మూడు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో తగినంత ఉప్పు వేయాలి.

నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం, పప్పు నీళ్లనుండి తీసి వేసి మెత్తగా ఉడికించాలి. చివరిలో మిగిలిన నెయ్యి వేసి దింపేయాలి.

Friday, October 19, 2012

పండుగ వంటలు




పెరుగు అన్నం


కావలసినవి:

బియ్యం - కప్పు, పెరుగు - 3 కప్పులు

ఉప్పు - తగినంత, అల్లం - చిన్నముక్క (తరగాలి)

కొత్తిమీర తరుగు - టీ స్పూన్

దానిమ్మ గింజలు - తగినన్ని



పోపుకోసం...

కరివేపాకు - 2 రెమ్మలు, మినప్పప్పు - టీ స్పూన్

ఆవాలు - అర టీ స్పూన్

ఎండుమిర్చి - 2 (మధ్యకు విరవాలి)

పచ్చిమిర్చి - 2 (నిలువుగా కట్ చేయాలి)

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ - తగినంత



తయారి:

అన్నం మెత్తగా వండి, గరిటెతో బాగా కలిపి, చల్లారనివ్వాలి.

పెరుగులో ఉప్పు వేసి, చల్లారిన అన్నంలో కలపాలి.

దీంట్లో అల్లం, పచ్చిమిర్చి కలపాలి.
స్టౌ పై కడాయి పెట్టి, నెయ్యి వేసి ఆవాలు, మిన ప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేగనివ్వాలి.
ఈ పోపును పెరుగన్నంలో కలపాలి. అరకప్పు పాలు వేడి చేసి పెరుగన్నంలో కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి.
కొత్తిమీర, దాన్నిమ్మ గింజలతో అలంకరించాలి.



సజ్జముద్దలు

కావలసినవి:

సజ్జ పిండి - 2 కప్పులు

బెల్లం తరుగు - కప్పు

నీళ్లు - ముద్ద చేయడానికి

తగినన్ని

ఏలకుల పొడి - చిటికెడు

డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్‌మిస్) - 2 టీ స్పూన్లు

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

తయారి:

నీళ్లు వేడి చేసి, సజ్జ పిండిలో కలిపి ముద్ద చేయాలి. కావల్సిన పరిమాణంలో ముద్ద తీసుకొని, రొట్టె చేసి, పెనం మీద రెండువైపులా కాల్చాలి.

వేడిగా ఉన్నప్పుడే నీళ్లు అద్దుకుంటూ చేత్తో ముక్కలు ముక్కలు చేయాలి. తర్వాత రోట్లో వేసి దంచాలి.

పెనం మీద నెయ్యి, బెల్లం, ఏలకుల పొడి, రొట్టె ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి, దించాలి.
కావలసిన పరిమాణం రొట్టెముక్కల పొడిని తీసుకొని, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి.



ఎండు కొబ్బరి అన్నం



కావల్సినవి:

బియ్యం - 2 కప్పులు (అన్నం వండి, బేసిన్‌లో వేసి, విడదీసి, చల్లారనివ్వాలి), పసుపు - చిటికెడు, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, ఎండుకొబ్బరి పొడి - అర కప్పు, కారం - అర టీ స్పూన్, శనగపప్పు - టేబుల్ స్పూన్, మినప్పప్పు - టేబుల్ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, ఎండుమిర్చి - 4, పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేయాలి), వేయించిన పల్లీలు - కొన్ని, నూనె - 3 టేబుల్ స్పూన్లు



తయారి:

చల్లారిన అన్నంలో ఉప్పు, టేబుల్ స్పూన్ నూనె, కొబ్బరిపొడి, కారం, కొన్ని కరివేపాకు ఆకులు వేసి కలపాలి.

పెనం మీద మిగిలిన నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి నిమిషం సేపు వేయించాలి. తర్వాత పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరికాసేపు వేయించాలి.

ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి.



పులిహోర


కావలసినవి:

బియ్యం - 2 కప్పులు, పసుపు - 1/2 స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, చింతపండు గుజ్జు - పావు కప్పు, బెల్లం తరుగు - టీ స్పూన్, శనగపప్పు, మినప్పప్పు - టేబుల్ స్పూన్ చొప్పున, ఆవాలు-టీ స్పూన్, ఎండుమిర్చి-4, పచ్చిమిర్చి - 4 ఇంగువ - పావు టీ స్పూన్, నువ్వులపొడి - టేబుల్ స్పూన్, పల్లీలు - కొన్ని, నూనె - 3 టేబుల్ స్పూన్లు, అల్లం - చిన్న ముక్క

తయారి:

అన్నం వండి చల్లార్చి, అందులో పసుపు, ఉప్పు, టేబుల్ స్పూన్ నూనె, కొన్ని కరివేపాకు ఆకులు వేసి కలపాలి.

కడాయిలో మిగిలిన నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, పప్పులు, పల్లీలు వేసి నిమిషం సేపు వేయించాలి. కోసిన పచ్చిమిర్చి, దంచిన అల్లం, ఇంగువ, కరివేపాకు వేయించాక చింతపండు గుజ్జు, బెల్లం వేసి ఉడికించి, తీయాలి. ఈ మిశ్రమాన్ని, నువ్వులపొడి అన్నంలో వేసి కలపాలి.



చపాతీ ముద్దలు

కావలసినవి:

గోధుమపిండి - 2 కప్పులు

బెల్లం తరుగు - కప్పు

నీళ్లు - ముద్ద చేయడానికి తగినన్ని

ఏలకుల పొడి - చిటికెడు

డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్‌మిస్) - 2 టీ స్పూన్లు

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు


తయారి:

పిండిలో నీళ్లు పోసి, ముద్ద చేయాలి. కావల్సిన పరిమాణంలో ముద్ద తీసుకొని, చపాతీ చేసి, పెనం మీద రెండువైపులా కాల్చాలి.



చపాతీని ముక్కలు చేసి, రోట్లో వేసి దంచాలి.



పెనం మీద నెయ్యి, బెల్లం, ఏలకుల పొడి, చపాతీ ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి, దించాలి.



కావలసిన పరిమాణంలో ఈ పొడిని తీసుకొని, బాదం, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి.

Friday, October 5, 2012

బార్బిక్యూ ప్రాన్స్

కావలసినవి:


టొమాటో పేస్ట్ - 100 గ్రా.

రొయ్యలు - అర కేజీ

వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్

నిమ్మరసం - టేబుల్ స్పూన్

ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు - రుచికి తగినంత

టొమాటో కెచప్ - 100 గ్రా.

తయారి:

టొమాటోలను ఉడికించి, పేస్ట్ చేయాలి.

వెడల్పాటి గిన్నెలో వెల్లుల్లి తరుగు, నిమ్మరసం, ఉప్పు, టొమా టో కెచప్, టొమోటో పేస్ట్ వేసి కలిపి, ఈ మిశ్రమాన్ని రొయ్యలకు పట్టించి, పదిహేను నిమిషాలు ఉంచాలి.

రొయ్యలను సన్నని ఇనుప పుల్లలకు గుచ్చాలి రొయ్యలకు ఆలివ్ ఆయిల్‌ను అప్లై చేస్తూ, ఐదు నిమిషాలు గ్రిల్ చేయాలి.

అన్‌గర టంగ్డి

కావలసినవి:


చికెన్ - 2 పెద్ద ముక్కలు, పెరుగు - అర కప్పు,

నిమ్మరసం - టేబుల్ స్పూన్, గరం మసాలా - టీ స్పూన్,

కారం - టీ స్పూన్, ఉప్పు - తనగింత,

టొమాటోలు - 2 (ఉడికించి, పేస్ట్ చేయాలి)

అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్ - కొన్ని చుక్కలు

తయారి:

చికెన్‌ను శుభ్రపరిచి, చాకుతో సన్నని గీతలు పెట్టాలి.

మరొక గిన్నెలో చికెన్, ఉప్పు మినహా కావలసిన పదార్థాలన్నీ కలపాలి.
ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు అన్ని వైపులా పట్టించి, గంటసేపు ఉంచాలి.

ముక్కలకు ఉప్పు రాసి, గ్రిల్ చేయాలి లేదా పాన్ మీద కొద్దిగా నూనె వేసి రెండు వైపులా వేయించాలి.

నిమ్మరసం, చాట్‌మసాలా చల్లి, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేయాలి.

క్రీమ్ టొమాటో సూప్

కావలసినవి:

టొమాటోలు - 4, పుదీనా ఆకులు - కొన్ని

ఉప్పు - తగినంత

మిరియాల పొడి - తగినంత, క్రీమ్ - గార్నిష్‌కి తగినంత

కొత్తిమీర తరుగు - కొద్దిగా

ఆలివ్ ఆయిల్ - అర టీ స్పూన్

 
తయారి:

టొమాటోలను శుభ్రపరిచి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.

దీంట్లో పుదీనా, ఉప్పు వేసి మరో పది నిముషాలు ఉడికించి, చల్లారనివ్వాలి.

ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి.


బ్లెండ్ చేసిన టొమాటో మిశ్రమాన్ని పెద్ద జల్లిలో వేసి, వడకట్టి, గింజలను తీసేయాలి.

స్టౌ పై కడాయి పెట్టి, ఆలివ్ ఆయిల్ వేసి, వేడయ్యాక, అందులో వడకట్టిన టొమాటో మిశ్రమాన్ని పోసి వేడి చేయాలి. కప్పులో పోసి, పైన మిరియాలపొడి చల్లి, క్రీమ్ వేసి సర్వ్ చేయాలి.

స్టఫ్డ్ టొమాటో

కావలసినవి:


టొమాటోలు - 6,

పనీరు తురుము - 150 గ్రా.

ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)

కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్

పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)

ఉప్పు, కారం - తగినంత

గరంమసాలా - అర టీ స్పూన్

పసుపు - అర టీ స్పూన్

చీజ్ తురుము - టేబుల్ స్పూన్

నూనె - టేబుల్ స్పూ   తయారి:

టొమాటోలను శుభ్రపరిచి, క్లాత్‌తో తడిలేకుండా తుడవాలి.

టొమాటో పై భాగంలో క్యాప్‌లాగ కట్ చేయాలి.
స్టౌ మీద కడాయి పెట్టి, నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
టొమాటోను కట్ చేసిన పై ముక్కను తరిగి, పేస్ట్ చేసిన మిశ్రమాన్ని ఇందులో కలిపి, ఉడికించాలి.
పనీర్ తురుము వేసి మరో నిమిషం ఉడికించాలి.

టొమాటో కప్పులను ఈ మిశ్రమంతో నింపాలి.

పైన చీజ్ తురుము, కొత్తిమీర తరుగు వేయాలి.

{పెజర్ కుకర్ పాన్‌లో బటర్ వేసి, కరిగాక టొమాటో కప్పులను అందులో ఉంచి, ఉడికించి, దించాలి. (అవెన్‌లో అయితే 200 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో 20 నిమిషాలు బేక్ చేయాలి)

స్టఫ్డ్ పనీర్ టొమాటో వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.

క్యారట్ పెరుగు పచ్చడి

కావలసినవి


క్యారట్ తురుము ....................................................... 1/4 కప్పు

కొత్తిమీర ..................................................................... 3 టీ.స్పూ.

ఉల్లిపాయ తరుగు ...................................................... 1/2 కప్పు

పెరుగు ........................................................................ 2 కప్పులు

ఉప్పు .......................................................................... తగినంత

నిమ్మరసం ................................................................... 1 టీ.స్పూ.

జీలకర్ర పొడి ............................................................... 1/2 టీ.స్పూ.

మిరియాల పొడి ..................................................... 1/4 టీ.స్పూ.

ఇలా చేయాలి

పెరుగులో ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి చిలికి పెట్టుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యారట్ తురుము వేసి బాగా కలియబెట్టాలి. నిమ్మరసం కలిపి చల్లగా సర్వ్ చేయాలి. ఈ పెరుగు పచ్చడి అలాగే తినొచ్చు లేదా పులావ్, బిర్యాని, ఫ్రైడ్ రైస్ మొదలైన స్పెషల్ వంటకాలకు తోడుగా సర్వ్‌చేస్తే బావుంటుంది.

ఆలూ, పెప్పర్ కర్రీ

కావలసినవి


బంగాళా దుంపలు ......................... 25- గ్రా.

ఉల్లిపాయ ....................................... 1

పచ్చిమిర్చి ....................................... 3

పసుపు ............................................ 1/4 టీ.స్పూ.

కరివేపాకు ....................................... 1 రెబ్బ

అల్లం వెల్లుల్లి ముద్ద ........................ 1/2 టీ.స్పూ.

మిరియాల పొడి .......................... 1/2 టీ.స్పూ.

ఉప్పు .............................................. తగినంత

నూనె ............................................... 2 టీ.స్పూ.

వండే విధం

బంగాళా దుంపలు చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడేవరకు వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి నిలువుగా తరిగి వేసి కొద్దిసేపు వేపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసి కలిపి బంగాళా దుంప ముక్కలు, తగినంత ఉప్పువేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత కప్పుడు నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. గరిటతో కొద్దిగా మెదిపి మిరియాల పొడి వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లి దింపేయాలి. ఈ కూర అన్నం కంటే పూరీ, చపాతీ, దోశలకు బావుంటుంది.

సోయా కబాబ్

కావలసినవి


బంగాళాదుంపలు ...................................................... 250 గ్రా.

బ్రెడ్ స్లైసులు ............................................................... 3

సోయా కీమా ............................................................. 100 గ్రా.

పసుపు ........................................................................ 1/4 టీ.స్పూ.

కారం పొడి ................................................................. 1 టీ.స్పూ.

గరం మసాలాపొడి .................................................... 1/2 టీ.స్పూ.

కొత్తిమీర ...................................................................... 4 టీ.స్పూ.

ఉప్పు ........................................................................... తగినంత

క్యారట్ తురుము ......................................................... 3 టీ.స్పూ.

నూనె ............................................................................ 1/4 కప్పు

ఇలా వండాలి

ఒక గినె్నలో సోయా కీమా వేసి వేడి నీళ్లు పోయాలి. చల్లారాక తీసి గట్టిగా పిండి వేరే గినె్నలో వేసి పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసుల అంచులు తీసేయాలి. బంగాళా దుంపలు నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి పొడి పొడిగా మెదిపి ఒక గినె్నలో వేయాలి. ఇందులో సోయా కీమా, పసుపు, కారం పొడి, క్యారట్ తురుము, గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, పొడిగా చేసిన బ్రెడ్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి ముద్దలా చేయాలి. పెద్ద నిమ్మకాయంత ఉండలు చేసుకుని కబాబ్ పుల్లలకు గుచ్చి పొడుగ్గా చేయాలి. ఇలా అన్నీ తయారుచేసుకోవాలి. పాన్‌లో చెంచాడు నూనె వేసి ఈ కబాబ్ పుల్లలకు గుచ్చి పొడుగ్గా చేయాలి. ఇలా అన్నీ తయారుచేసుకోవాలి. పాన్‌లో చెంచాడు నూనె వేసి ఈ కబాబ్ పుల్లలను వరసగా అమర్చాలి. కొద్దిగా కొద్దిగా నూనెవేస్తూ అన్ని వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకుని ఉల్లిచక్రాలు, టమాటో స్లైసులు, సాస్‌తో సర్వ్ చేయాలి. ఇవి గ్రిల్లర్‌లో కూడా చేసుకోవచ్చు

కార్న్, చికెన్ ఫ్రై

కావలసినవి


బోన్‌లెస్ చికెన్ ............................................... 250 గ్రా.

కార్న్ గింజలు ................................................ 100గ్రా.

ఉల్లిపాయ ...................................................... 2

పసుపు ........................................................... 1/4 టీ.స్పూ.

కారం పొడి .................................................. 1 టీ.స్పూ.

ధనియాల పొడి ............................................. 2 టీ.స్పూ.

గరం మసాలా పొడి ................................... 1/4 టీ.స్పూ.

అల్లం వెల్లుల్లి ముద్ద........................................ 1 టీ.స్పూ.

కొత్తిమీర ........................................................ 3 టీ.స్పూ.

ఉప్పు ................................................................ తగినంత

నూనె ................................................................ 3 టీ.స్పూ.

ఇలా చేద్దాం

చికెన్‌లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత చాలా చిన్న ముక్కలుగా లేదా కీమాలా కట్ చేసుకోవాలి. కార్న్ గింజలను నీళ్లుపోసి ఉడికించి వడ కట్టి ఉంచాలి. ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనెవేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి, కారం వేసి కలిపి చికెన్ కీమా వేయాలి. ధనియాల పొడి, తగినంత ఉప్పు వసి కలిపి నిదానంగా వేయించాలి. చికెన్ ముందే ఉడికించాం కాబట్టి మసాలాలు కలిసి వేగిన తర్వాత కార్న్ గింజలు, కొత్తిమీర, గరం మసాలా పొడి వేసి కలిపి మరికొద్దిసేపు వేయించి దింపేయాలి. ఈ కూర నూడుల్స్‌తో కూడా సర్వ్ చేయొచ్చు

కాప్సికమ్ చికెన్

కావలసినవి


చికెన్ ............................ 1/2 కిలో

కాప్సికమ్ ..................... 250 గ్రా.

ఉల్లిపాయ ..................... 1

పచ్చిమిర్చి ..................... 2

పసుపు .......................... 1/4 టీ.స్పూ.

కారం పొడి ..................... 1 టీ.స్పూ.

గరం మసాలా పొడి ..... 1/2 టీ.స్పూ.

కొబ్బరి పొడి ..................... 3 టీ.స్పూ.

ఉప్పు .............................. తగినంత

నూనె ............................... 4 టీ.స్పూ.

కావలసినవి

పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి వేసి కొద్దిగా వేపి శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత తగినంత ఉప్పు, గరం మాసాలా వేసి కలిపి అర కప్పు నీళ్లుపోసి మూతపెట్టాలి. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత అంగుళం సైజులో కట్ చేసుకున్న కాప్సికమ్, కొబ్బరి వేసి కలిపి మూత పెట్టి నిదానంగా ఉడికించాలి. కూరంతా ఉడికి నూనె తేలుతుండగా దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలకు బావుంటుంది

టోఫూ, కార్న్ ఫ్రైడ్ రైస్

కావలసినవి

సన్న బియ్యం లేదా బాస్మతి - 2 కప్పులు

స్వీట్ కార్న్ గింజలు - 1/2 కప్పు

టోఫూ ముక్కలు - 1/2 కప్పు

ఉల్లిపాయ -1

పచ్చిమిర్చి -3

కరివేపాకు - 2 రెబ్బలు

పసుపు - 1/4 టీ.స్పూ.

క్యారట్ తరుగు - 3 టీ.స్పూ.

కొత్తిమీర - 3 టీ.స్పూ.

అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.

గరం మాసాలా పొడి - 1/4 టీ.స్పూ.

ఉప్పు - తగినంత

నూనె - 2 టీ.స్పూ.

నెయ్యి - 1 టీ.స్పూ.

ఇలా వండాలి

బియ్యం కడిగి అరగంట నీళ్లలో నానబెట్టి పొడి పొడిగా ఉడికించుకోవాలి. కార్న్ గింజలు ఆవిరిమీద ఉడికించి పెట్టుకోవాలి. టోఫీ పనీర్ అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని గోరువెచ్చని నీళ్లలో వేసి ఉంచాలి. ఇలా చేయడంవల్ల పనీర్ ముక్కలు రబ్బర్‌లా గట్టిగా కాకుండా, మృదువుగా ఉంటాయి. ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువునా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి.

ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరో రెండు నిమిషాలు వేపాలి. ఇందులో వేయించిన టోఫూ ముక్కలు, ఉడికించిన కార్న్ గింజలు, క్యార్ తురుము వేసి మరికొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు అన్నం, తగినంత ఉప్పు, గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలియబెట్టి రెండు నిమిషాలు వేయించి దింపేయాలి.